BigTV English

Brahmamudi Serial Today February 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంటికొచ్చిన అప్పు, కళ్యాణ్‌ – రుద్రాణి, రాహుల్‌ ను ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్న సీతారామయ్య

Brahmamudi Serial Today February 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంటికొచ్చిన అప్పు, కళ్యాణ్‌ – రుద్రాణి, రాహుల్‌ ను ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్న సీతారామయ్య

Brahmamudi serial today Episode: ప్రకాష్‌ ఎమోషనల్‌గా సీతారామయ్య కాళ్ల మీద పడి అందరిలాగే నేను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి అంటూ ఏడుస్తాడు. మాకు ఆస్థి వద్దు నాన్నా అందరం కలిసే ఉందాం.. అంటూ ఏడుస్తుంటాడు. అయితే అప్పును కోడలిగా ఒప్పుకుని కళ్యాణ్‌ను అప్పును మన ఇంటికి తీసుకురావాలని సీతారామయ్య చెప్తాడు. తప్పకుండా తీసుకువస్తామని చెప్తాడు ప్రకాష్‌. దీంతో అది నువ్వు చెప్తే ఎలా ప్రకాష్‌.. ధాన్యలక్ష్మీ కూడా చెప్పాలి అంటాడు. దీంతో ధాన్యలక్ష్మీ అలాగే మామయ్యగారు.. నా కొడుకు కోసం ఏమైనా చేస్తాను. రేపే వెళ్లి నా కొడుకును కోడలిని ఇంటికి తీసుకువస్తాను అంటుంది.


ఆస్థి పంపకాలు ఆగిపోయాయన్న కోపంతో రుద్రాణి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. శ్రీరాముడితో కలిసి సీత అరణ్యవాసానికి వెళ్లినట్టు నువ్వు కూడా వెళ్లాలనుకుంటున్నావా..? లేకపోతే భర్త మాటలు జవదాటని భార్య అని ఏదైనా న్యూస్‌ చానెల్‌లో హెడ్‌లైన్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నావా అంటూ ధాన్యలక్ష్మీని నిలదీస్తుంది. దీంతో ధాన్యలక్ష్మీ అసలు నువ్వు ఏం అడగాలనుకున్నావో అడుగు అంటుంది. నేనేం ఏం అడుగుతాను. ఇన్ని రోజులు నీకు నీ కొడుకు ఆస్థి దక్కాలని.. నీ తరపున పోరాడాను. నిన్ను అలాగే తీర్చిదిద్దాను. కానీ నువ్వేంటి ఇలా మారిపోయావు. బెల్లం కొట్టిన రాయిలా చలనం లేకుండా ఉండిపోయావు.

మీ ఆయన అలా అడుగుతుంటే.. నువ్వెందుకు అలా ఉండిపోయావు అంటుంది. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా నువ్వే అడగొచ్చు కదా..? నేను అడిగి అందరి ముందు చెడ్డదాన్ని కావాలి. గయ్యాలి దాన్ని కావాలా..? నువ్వు మాత్రం తెర వెనక కథ నడిపిస్తూ తెరముందు మంచిదానిలా తిరుగుతుంటావా..? అని అడగ్గానే.. ధాన్యలక్ష్మీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను అడిగే దానికి నువ్వు అడిగే దానికి చాలా తేడా ఉంది. నేను వాళ్ల రక్తం పంచుకుని పుట్టినదాన్ని కాదు. కానీ మీకు అన్ని హక్కులు ఉన్నాయి ఆస్థిలో వాటా అడగొచ్చు అని చెప్తుంది. నాకు ఆస్థిలో హక్కు కాదు నా కొడుకు సుఖం నాకు కావాలి. అని చెప్పి వెళ్లిపోతుంది.


అప్పు కళ్యాణ్‌ బట్టలు ఆరేస్తుంటే.. ప్రకాష్‌, ధాన్యలక్ష్మీ వస్తారు. లోపలికి రండి మామయ్యగారు అని అప్పు పిలవగానే మేము లోపలికి రావడం కాదు. మీరే మాతో పాటు రావాలి అంటాడు. అప్పు, కళ్యాణ్‌ షాక్‌ అవుతారు. కళ్యాన్‌ ఎక్కడికి నాన్నా అని అడుగుతాడు. దీంతో ప్రకాష్‌ చల్లకొచ్చి ముంత దాస్తావెంటుకు.. చెప్పు అని ధాన్యలక్ష్మీని అంటాడు. ధాన్యలక్ష్మీ మనం మన ఇంటికి వెళ్లాలి అని చెప్తుంది. మరోసారి కళ్యాణ్‌, అప్పు షాక్‌ అవుతారు. ఇంత మంచి వార్త చెబితే అలా షాక్‌ అవుతారేంట్రా అని ప్రకాష్‌ అడుగుతాడు. ధాన్యలక్ష్మీ కూడా మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు.

ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టి తప్పు చేశానేమో.. నన్ను క్షమించండి అంటుంది. దీంతో కళ్యాణ్‌ కోపంగా అమ్మా ఏం మాటలవీ.. నువ్వు మమ్మల్ని అలా దూరం పెట్టడంతోనే మంచి జరిగిందేమో.. స్వతహాగా ఎదగాలన్న ఆశ రెట్టింపైంది అని చెప్తాడు. నేను ఇంకా పూర్తి స్థాయి రైటర్‌గా స్థిరపడలేదు అని కళ్యాణ్‌ చెప్పగానే.. ఇవే పనులు మన ఇంట్లో ఉండి  కూడా చేసుకోవచ్చు కదా అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో ప్రకాష్‌ ఒరేయ్‌ మీ అమ్మే వచ్చి అడిగితే ఇంకా ఆలోచిస్తావేంట్రా పదండి పదండి అంటాడు.

ఇంటికి వచ్చిన అప్పు, కళ్యాణ్‌లకు దుగ్గిరాల కుటుంబం మొత్తం గ్రాండ్ గా వెల్‌కం చెప్తారు. అందరూ సంతోషంగా ఉంటే రుద్రాణి, రాహుల్‌ మాత్రం ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంటారు. ఇంతలో ఇందిరాదేవి ఈ ఇంట్లో ఉన్న కలుపుమొక్క అయిన రుద్రాణి, రాహుల్‌ లన బయటకు పంపిద్దాం అంటుంది. అందరూ సపోర్టు చేస్తారు. వాళ్లను బయటకు పంపిద్దామని చెప్తారు. కావాలంటే ఖర్చుల కోసం నెలకింతని భరణంగా ఇద్దామని అంటారు. రుద్రాణి కోపంగా నేను ఈ ఇంటి ఆడపడచు హోదాలో బతికాను.. నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని కోప్పడుంతుంది.

దీంతో ఇందిరాదేవి మాకుంది. మా ఇంటిని ముక్కలు చేయాలని చూసిన నిన్ను ఇంట్లోంచి బయటకు పంపించేయాల్సిందేనని చెప్తుంది. నువ్వు హాస్పిటల్‌లో ఉండగా ఆస్థి కోసం ఎన్ని గొడవలు చేసిందో నాకు తెలుసు. ఇటువంటి పాపాత్మురాలిని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వకూడదు అంటుంది. ఎలాగూ బయటకు పంపిస్తారు కానీ నా వాటా ఆస్థి నాకు ఇవ్వండి వెళ్లిపోతాను అంటుంది రుద్రాణి. దీంతో సీతారామయ్య మీ అమ్మ మంచి నిర్ణయమే తీసుకుంది ఇక తల్లి కొడుకు ఇద్దరూ బయలుదేరండి అని చెప్తాడు సీతారామయ్య. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×