Choreographer Kasturi : టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Jani Master) ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆయనపై కేసు నమోదు అవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. తాను ఏ తప్పు చేయలేదని తన తప్పు లేకపోయినా కావాలనే తనని ఇరికించారంటూ జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పారు. నిజానిజాలను కోర్టు బయటపెడుతుందని జానీ మాస్టర్ చెప్పిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆ వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో చూశాం.. అయితే ఇంత జరిగిన కూడా జానీ మాస్టర్ క్రేజ్ ఎక్కడా తగ్గలేదని తెలుస్తుంది. బయటికి వచ్చిన ఆయనకు ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు పలకరిస్తున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో ఓ సినిమా ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగులో కూడా ఓ సినిమాకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.. కెరియర్ పరంగా ఆయన బిజీ అయిన కూడా ఆయనపై ఇంకా కొన్ని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొరియోగ్రాఫర్ కస్తూరి (Choreographer Kasturi ) జానీ మాస్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జానీ మాస్టర్ నిజంగానే తప్పు చేశాడా..?
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి అందరికీ తెలుసు. తెలుగు తో పాటు పలు ఇండస్ట్రీలలో ఆయన ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఎన్నో కష్టాలన్నీ ఎదుర్కొని ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన జాతి అవార్డు అందుకునే స్థాయికి ఎదిగారంటే ఆయన కష్టం ఊరికే పోలేదు. అలాంటి జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల కేసు నమోదు అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసు పై పలువురు మాస్టర్లు సినీ ప్రముఖులు మాట్లాడారు. మాస్టర్ నిజంగానే తప్పు చేశారా నీకు కొందరు వాదిస్తే.., మరికొందరు మాత్రం తప్పు ఇద్దరు చేశారని తమ వాదనలు వినిపించారు. అయితే తప్పు ఎవరు చేసారు అన్న విషయం గురించి ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. రెండు చేతులు కొడితేనే చప్పట్లు అవుతాయని ఇద్దరిదీ తప్పే ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కూడా మాస్టర్ మాత్రం రాకెట్ లాగా వరుస సినిమాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై కొరియోగ్రాఫర్ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అసలు తప్పు ఎవరిది అన్న విషయాల గురించి బయట పెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
Also Read :పోలీసుల అదుపులోకి మంచు మనోజ్.. అసలేం జరిగింది..?
జానీమాస్టర్ అలాంటోడే : కొరియోగ్రాఫర్ కస్తూరి..
కొరియోగ్రాఫర్ కస్తూరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె మాట్లాడుతూ జానీ మాస్టర్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. మొదటినుంచి చూసుకుంటే మాస్టర్ ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండగా ఎప్పుడు ఇలాంటి రూమర్లు గాని ఇలాంటి కేసులు గాని ఆయన మీద లేవు మొదటిసారి ఇలాంటి వింటున్నామంటూ ఆమె అన్నారు. మాస్టరు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు. అవార్డు రావడం ఇష్టం లేకనే కొందరు కావాలనే ఇలా చేశారని అనిపిస్తుంది అంటూ ఆమె తన వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు లేనిది ఆ అమ్మాయి ఇప్పుడే తప్పు జరిగిందని అనడం ఏంటి అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉంది అసలు విషయం ఏంటో ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది అనేసి కస్తూరి అన్నారు. మాస్టర్ అమ్మాయి టాలెంట్ ది గుర్తించి ఎలాగైనా పైకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఈ స్టేజ్ లో కూర్చోబెట్టారు. పుష్పాలాంటి సినిమాలో ఆమె కొరియోగ్రాఫర్ గా పనిచేసింది అంటే దానికి కారణం ఎవరు మాస్టర్. మాస్టర్ పై ఆమె ఆశపడింది. మాస్టర్ ని పెళ్లి చేసుకుంటే తన లైఫ్ బిందాస్ గా ఉంటుందని ఆలోచించింది. ఆమె ఆమె తల్లి చేసిన ఆరోపణలవల్ల మాస్టర్ కి పోయింది ఏమీ లేదు. ప్రతి ఇండస్ట్రీ అయినను కళ్ళకద్దుకొని తీసుకుంటున్నారు. ప్రస్తుతం మాస్టర్ కోర్టు కేసు అంటూ అయినా ఈ అమ్మాయిని చేరతీసినందుకు కర్మ ఫలితాన్ని అనుభవించారు. ఇప్పుడు గోడ గొట్టిన బంతి లాగా వరుస అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ఫుల్ జోష్ తో ముందుకు వెళ్తున్నారు. కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాస్టర్ చేసిన మంచి పనిని ఆమె తప్పుగా అర్థం చేసుకొని ఏకంగా మాస్టర్ కి ఎసరు పెట్టేసింది ఆ దేవుడనేవాడు ఉంటే ఆ అమ్మాయికి ఏం జరగాలో అది చేస్తాడంటూ కస్తూరి సంచలన ఆరోపణలు చేసింది. మొత్తానికి ఇంటర్వ్యూ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన జానీ మాస్టర్ అభిమానులు నెటిజన్లు మాస్టర్ చేసిన తప్పు ఆ అమ్మాయిని చేర తీయ్యడం.. అదే ఆయనకు శాపంగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు..