E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పార్టీలో ప్రత్యక్షమైన సీతారామయ్య ఫోటో   

Brahmamudi Serial Today Episode June 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పార్టీలో ప్రత్యక్షమైన సీతారామయ్య ఫోటో   
Advertisement

Brahmamudi serial today Episode: ఆకలితో ఫుడ్‌ తినలేక నీళ్లు తాగుతున్న వెంకట్‌ దగ్గరకు వెళ్లిన నందు ఆకలిని చంపుకోవడానికి నీళ్లు తాగుతున్నావా..? అంటూ పరామర్శిస్తుంది. దీంతో ఒక పూట తినకపోతే ఏం కాదులే నందు అంటాడు వెంకట్‌. దీంతో ఎమోషనల్‌ అవుతున్న నందు.. పద నీకు ట్రీట్‌ ఇస్తాను.. ఇద్దరం కలిసి వెళ్లి చాట్‌ తిద్దాం పద అంటూ వెంకట్‌ను తీసుకుని వెళ్లిపోతుంది.

చలపతి ఇంటికి వెళ్లిన కరెంట్‌ ఆఫీసర్‌ మీరు కరెంట్‌ బిల్లు కడతారా..? లేకపోతే కరెంట్‌ కట్‌ చేయాలా అంటూ అడగ్గానే.. చలపతి ఒక్క రెండు రోజులు టైం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంటాడు. అప్పుడే వచ్చిన వెంకట్‌ తన దగ్గరున్న డబ్బులతో బిల్లు కడతాడు. దీంతో చలపతి నీ శాలరీ ఇప్పుడు రాదు కదా..? ఫస్ట్‌కు వస్తుంది కదా..? మరి ఈ డబ్బు ఎక్కడిది అంటూ అడగ్గానే.. పరధ్యానంతో వెంకట్‌ టిప్పి వచ్చింది అని చెప్పగానే.. చలపతి, లక్ష్మీ ఇద్దరూ షాక్‌ అవుతారు. టిప్పా అంటూ అడగ్గానే.. ఏం లేదు నాన్న మ కంపెనీలో ఏదైనా కొత్తగా ఐడియా ఇస్తే.. ఇలా డబ్బులు ఇస్తారు.. దీన్నే నేను టిప్పు అన్నాను అని చెప్పి వెంకట్‌ వెళ్లిపోతాడు. చలపతి, లక్ష్మీ రాజు గురించి ఆలోచిస్తుంటారు.

Advertisement

మరోవైపు కంపెనీ క్లయింట్స్‌ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో సీతారామయ్య ఫోటో ఉంటుంది. పూలమాల వేసి దీపం వెలిగించి ఉన్న ఫోటోను చూసిన రేఖ కోపంగా గట్టిగా ఇందును పిలుస్తుంది. రేఖ అరుపులకు అందరూ వస్తారు. ఇందు కూడా ఏమైంది ఆంటీ అంటూ పరుగెత్తుకుంటూ వస్తుంది. రేఖ కోపంగా ఈ ముసలోడి ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది.. వాళ్ల ఫోటోలు ఇలాంటి పార్టీలో పెట్టకూడదని అసలు ఇంట్లోనే ఉండకూడదని చెప్పాను కదా..? అనగానే.. అపర్ణ ఫోటో చూసి హ్యపీగా ఫీలవుతుంది. ఇందు తాను ఆ ఫోటో పెట్టలేదని అపర్ణ కూడా పెట్టలేదని చెప్పగానే.. మరి ఎవరు పెట్టారు అంటూ రేఖ కోపంగా అడగ్గానే.. రాజు నేనే పెట్టాను పిన్ని అంటూ వస్తాడు. ఎవరిని అడిగి పెట్టావని రేఖ అడగ్గానే.. కంపెనీ ఫౌండర్‌ అయిన ఆయన ఫోటో పెట్టడానికి ఒకరిని అడగాలా..? మా తాత ఫోటో నేనే పెట్టాను అంటూ చెప్పగానే..

మీ తాత అంటూ అందరూ ఆశ్చర్యంగా అడగ్గానే.. అదే ఇందుకు తాతయ్య అయితే నాకు తాతయ్యే కదా అంటూ రాజు చెప్పగానే.. రేఖ కోపంగా భ్రమరాంబను పిలిచి వదిన ఆ ఫోటో అక్కడి నుంచి తీసేయ్‌ ఎవరు వస్తారో నేను చూస్తాను అంటుంది. దీంతో భ్రమరాంబ ఫోటో తీసేయడానికి వెళ్తుంటే. రాజు అడ్డు పడతాడు. దీంతో భ్రమరాంబ భయంగా వెనక్కి వెళ్లిపోతుంది. రాజు మాత్రం ఇప్పుడు ఇక్కడికి క్లయింట్స్‌ అందరూ వస్తున్నారు.. వాళ్లందరికీ సీతారామయ్య ఫోటో చూపిస్తే.. మనకు డీల్స్ వస్తాయి.. ఈ విషయం కూడా మీకు తెలియదా..? అంటూ రాజు చెప్పగానే.. ఇందు కూడా ఆంటీ నాకెందుకో రాజు చెప్పిందే కరెక్ట్‌ అనిపిస్తుంది. మన బిజినెస్‌ రన్‌ అవ్వాలంటే తాతయ్య ఫోటో ఈ పార్టీలో ఉండాలనిపిస్తుంది అని చెప్తుంది.

Advertisement

ఉండాలనిపించడం కాదు ఉండాల్సిందే.. అంటూ చెప్తుండగానే.. ఒక క్లయింట్‌ వచ్చి సీతారామయ్య ఫోటోకు దండం పెడుతూ.. మీ వల్లే ఇవాళ అందరూ ఈ పొజిషన్‌లో ఉన్నాము అంటూ మొక్కి వెళ్లిపోతాడు. దీంతో రాజు ఇప్పటికైనా తాతయ్య ఫోటో తీసేయాలా..? చెప్పండి.. అని అడగ్గానే.. రేఖ ఫోటో ఉండాలని చెప్తుంది. రాజు వెంటనే పిన్ని వెళ్లి ఫోటో మీద పూలు జల్లి దండం పెట్టుకో అప్పుడు నీ మీద పాజిటివ్‌ అభిప్రాయం వస్తుంది అని చెప్తాడు. భ్రమరాంబ, శేషు కూడా బలవంతం చేస్తారు. దీంతో రేఖ వెళ్లి దండం పెట్టుకుంటుంది. అంతా చూస్తున్న అపర్ణ, సుభాష్‌ హ్యాపీగా పీలవుతారు. రేఖ వాళ్ల అక్కడి నుంచి వెళ్లిపోయాక. అపర్ణ వెళ్లి రాజుతో ఎమోషనల్‌ అవుతుంది. సుభాష్‌ కూడా బాధపడతాడు. ఇలా అందరిలో ఆయన ఫోటో చూస్తుంటే.. చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన కూడా ఎమోషనల్ అవుతాడు.

రూంలో కూర్చున్న ఐశ్వర్య తాను తీసుకొచ్చిన వీడియోను ల్యాప్‌టాప్ లో మళ్లీ చూస్తూ.. ఒసేయ్‌ ఇందు మా రేఖ ఆంటీనే మోసం చేస్తావా..? ఈ వీడియోఒ అందరి ముందు ప్లే చేస్తే ఉంటుంది.. ఓసేయ్‌ ఇందు నీ గుట్టు రట్టు చేయడానికి వస్తున్నా అనుకుంటుంది. మరోవైపు పార్టీలో కూర్చున్న బ్రమరాంబ ఏమో అనుకున్నాను కానీ ఇందు మంచి ప్లానే ఇచ్చింది. ఇప్పుడు అందరూ నిన్ను నమ్మకస్తురాలు మంచిది అనుకుంటారు అంటూ పొగుడుతుంది. ఇక ఇందు, రాజు క్లయింట్స్‌లో ఎవరు రేఖ వైపు ఉన్నారో కనిపెట్టే పనిలో ఉంటారు. ఎవరెవరో తమకు సపోర్టుగా ఉన్నారో తెలుసుకుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఒక్క సీరియల్‌తోనే స్టార్‌లైపోయిన నటులు వీళ్లే!

మెడలో తాళిబొట్టుతో కనిపించిన జబర్దస్త్ ప్రియాంక.. వీడియో వైరల్ !

Gundeninda GudiGantalu Today episode: బాలు పై మీనాకు అనుమానం.. మనోజ్ కు మైండ్ బ్లాక్… దొంగలను పట్టుకున్న బాలు…

Karthika Deepam 2 Serial Today Episode August 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యో పెళ్లి చేయాలన్న సుమిత్ర 

Podarillu Today Episode : సురేష్, వరాలును ఆడుకున్న శైలు.. మహా దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. పెద్దోడికి మళ్లీ నిరాశేనా?

Illu Illalu Pillalu Today Episodes: నర్మదదకు భద్ర పై అనుమానం.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode August 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును చూసి ఎమోషనల్ అయిన అపర్ణ   

Intinti Ramayanam Today Episode: పార్క్ లో సందడి.. గేమ్స్ అదుర్స్.. అశ్విన్ ఎంట్రీ తో పల్లవి షాక్..

Big Stories

Advertisement
×