E-Paper
Advertisement

మెడలో తాళిబొట్టుతో కనిపించిన జబర్దస్త్ ప్రియాంక.. వీడియో వైరల్ !

మెడలో తాళిబొట్టుతో కనిపించిన జబర్దస్త్ ప్రియాంక.. వీడియో వైరల్ !
Advertisement

Jabardasth Priyanka:జబర్దస్త్ (Jabardasth) ద్వారా తన కెరీర్ను ప్రారంభించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక సింగ్ (Priyanka Singh) అలియాస్ పింకీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిజానికి బిగ్ బాస్ (Bigg Boss) ప్రారంభించిన కొత్తలో లేడీ కమెడియన్స్ కోసం అబ్బాయిలే లేడీ గెటప్స్ వేసేవాళ్ళు. మరి కొంతమంది ట్రాన్స్ జెండర్స్ ఇందులో తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసేవారు. అయితే కాలక్రమేనా అమ్మాయిలు కూడా తోటి మేల్ కమెడియన్స్ కి భార్యగా ,లవర్ గా నటించడానికి ముందుకొస్తున్న నేపథ్యంలో ట్రాన్స్ జెండర్స్ కి ఇప్పుడు అవకాశాలు లభించడం లేదు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. అలా ఒకప్పుడు జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మరింత గుర్తింపు సొంతం చేసుకుంది ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్.

మెడలో తాళిబొట్టుతో దర్శనమిచ్చిన ప్రియాంక సింగ్..

రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు హౌస్ లో ఏకంగా 90 రోజులపాటు సందడి చేసిన ఈమె.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదిరింది, కామెడీ స్టార్స్ వంటి షోలలో అలరించింది. ఈమె కరోనా సమయంలో ‘ఇట్స్ మీ ప్రియాంక’ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా మొదలు పెట్టింది. ఇందులో ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ భారీ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ అయిపోయిన ప్రియాంక సింగ్.. ఉన్నట్టుండి మెడలో తాళిబొట్టుతో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బ్లూ కలర్ శారీ కట్టుకున్న ఈమె మిర్రర్ సెల్ఫీ తీసుకుంటూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా అనుమానాలు రేకెత్తిస్తోంది.

అసలు విషయం ఏమిటంటే?

Advertisement

ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతూ ప్రియాంక సింగ్ రహస్యంగా పెళ్లి చేసుకుందా ? మరి ఆమె భాగస్వామి ఎవరు ?ఎప్పుడు పెళ్లి చేసుకుంది? ఎందుకు ఈ విషయాన్ని దాచి పెట్టింది? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అసలు విషయం తెలిసి ఇదా సంగతి అంటూ కామెంట్ చేయడమే కాకుండా మరికొంతమంది ఫైర్ అవుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే .. ఇది షూటింగ్ కోసం సరదాగా చేసిన వీడియో అని తెలుస్తోంది. అదే సమయంలో పవిత్రమైన తాళిని ఇలా కూడా వాడుకుంటారా? అంటూ ఆమెపై మండిపడుతున్నారు. ఏది ఏమైనా సడన్గా మెడలో తాళిబొట్టుతో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసింది ప్రియాంక సింగ్ . ప్రస్తుతం ఈమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది

ALSO READ:ఆ సెలబ్రిటీల బాటలో శృతిహాసన్.. మరీ ఇంత దారుణంగా తయారయ్యారా?

గతంలో పెళ్లి వీడియోతో సర్ప్రైజ్..

Advertisement

ఇకపోతే ప్రియాంక సింగ్ ఇలా ట్విస్ట్ ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు .గతంలో ఏకంగా ఒక పెళ్లి వీడియోని షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉన్న ఈమె పట్టుచీర కట్టుకొని, ఒంటినిండా నగలతో పెళ్లికూతురులా ముస్తాబయింది. వరుడు తో కలిసి పూలదండలు మార్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ప్రియాంక పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు అంటూ పలు రకాల కామెంట్లు చేశారు. అయితే అదంతా ఒక ప్రైవేటు జ్యువెలరీ బ్రాండ్ కోసం ఆమె చేసిన యాడ్ షూట్ మాత్రమే అని తెలిసింది. ఇలా మొత్తానికైతే పలు ప్రకటనలో భాగంగా ఇలా సడన్గా అందరిని సర్ప్రైజ్ చేస్తోంది ప్రియాంక సింగ్.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా..తనూజ షాకింగ్ స్టేట్మెంట్!

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?

ఉదయ భాను యాంకరింగ్‌కు అంత పారితోషికమా? ఒక్కో షోకు ఎంతంటే!

Big Stories

Advertisement
×