E-Paper
Advertisement

అమ్మాయి వెంటపడే ఆగంతకులు… ఆమె చేసిన పని చూస్తే బుర్ర బ్లాస్ట్

అమ్మాయి వెంటపడే ఆగంతకులు… ఆమె చేసిన పని చూస్తే బుర్ర బ్లాస్ట్
Advertisement

Cyber Crime Movie on OTT : సీరియల్ కిల్లర్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్లు చాలానే ఉంటాయి. అయితే డిజిటల్ యుగంలో జరిగే సైబర్ స్టాకింగ్, డేటా చోరీ, ఆన్‌లైన్ ప్రైవసీ వంటి అంశాల చుట్టూ తిరిగే థ్రిల్లర్లు చాలా ఇన్సెంటివ్ గా ఉంటాయి. అలాంటి ఇంటెన్స్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్లలో ‘Keedam’ సస్పెన్స్ తోనే టెన్షన్ పెట్టిస్తుంది. 2022లో విడుదలైన ఈ మలయాళ చిత్రానికి రాహుల్ రిజి నాయర్ దర్శకత్వం వహించారు. రజిషా విజయన్, శ్రీనివాసన్, విజయ్ బాబు, మణికందన్ పట్టాంబి ప్రధాన పాత్రల్లో నటించారు. నేటి డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే కథతో ఈ సినిమా రూపొందింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Keedam 2022 మే 20న థియేటర్లలో విడుదలైంది. అనంతరం 2022 జూలై 1 నుంచి ZEE5లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రస్తుతం ZEE5లో మలయాళంతో పాటు కొన్ని డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

కథలోకి వెళ్తే…

Advertisement

రాధికా బాలన్ (రజిషా విజయన్) ఓ ప్రతిభావంతమైన సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు. ఆన్‌లైన్ నేరాలను అరికట్టడంలో ఆమెకు మంచి అనుభవం ఉంటుంది. ప్రశాంతంగా సాగుతున్న ఆమె జీవితం ఒక రోజు ఊహించని విధంగా తలకిందులవుతుంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెను సైబర్ స్టాకింగ్ చేయడం ప్రారంభిస్తాడు. వ్యక్తిగత సమాచారం దొంగిలించడం, ఫోన్ హ్యాక్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లలోకి చొరబడటం, ఆమె ప్రతి కదలికను గమనించడం మొదలుపెడతాడు. దీంతో రాధికా వ్యక్తిగత జీవితం పూర్తిగా అస్తవ్యస్తమవుతుంది.

మొదట పోలీసులను ఆశ్రయించినా పెద్దగా ఉపయోగం ఉండదు. చివరకు తన సైబర్ సెక్యూరిటీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్థుడిని తానే వెతకాలని నిర్ణయించుకుంటుంది. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఇది ఒక వ్యక్తి పని మాత్రమే కాదని, దీని వెనుక మరింత పెద్ద నెట్‌వర్క్ ఉందని తెలుస్తుంది. ప్రతి కొత్త ఆధారం మరో కొత్త ప్రమాదానికి దారి తీస్తుంది. ఇంతకీ రాధికాను టార్గెట్ చేసింది ఎవరు? వారి ఉద్దేశం ఏమిటి? డిజిటల్ ప్రపంచంలో దాగి ఉన్న నేరస్థులను ఆమె ఎలా కనిపెట్టింది? చివరికి ఆమె ప్రతీకారం తీర్చుకుందా? అనేదే ఈ సినిమా ప్రధాన కథ.

ఎందుకు చూడాలి?

Advertisement

Keedam సాధారణ క్రైమ్ థ్రిల్లర్ కాదు. మన రోజువారీ జీవితంలో ఉపయోగించే మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, వ్యక్తిగత డేటా ఎంత సులభంగా దుర్వినియోగం కావచ్చో చాలా రియలిస్టిక్‌గా చూపించారు. రజిషా విజయన్ తన పాత్రలో అద్భుతంగా నటించగా, రాహుల్ రిజి నాయర్ కథను అనవసర కమర్షియల్ అంశాలు లేకుండా ఆసక్తికరంగా తెరకెక్కించారు. సైబర్ క్రైమ్, హ్యాకింగ్, డిజిటల్ ప్రైవసీ, స్లో బర్న్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి Keedam మంచి మూవీ సజెషన్. కథతో పాటు నేటి ఆన్‌లైన్ ప్రపంచంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా ఈ సినిమా గుర్తు చేస్తుంది.

Read Also : ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన సిరీసులు… ‘ధురందర్ 2’ వ్యూస్ ఎంతంటే ?

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×