BigTV English

Brahmamudi Serial Today June 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: యామిని కి షాక్‌ ఇచ్చిన రాజ్‌ – కావ్య రూంలోకి వెళ్లిపోయిన రాజ్‌  

Brahmamudi Serial Today June 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: యామిని కి షాక్‌ ఇచ్చిన రాజ్‌ – కావ్య రూంలోకి వెళ్లిపోయిన రాజ్‌  

Brahmamudi serial today Episode: యామిని, రాజ్‌ కారులో వెళ్తుంటారు. ప్రేమగా మాట్లాడుకోవడానికి పులిస్టాపులు ఎందుకు కామాలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ప్రేమలో ఉన్న వాళ్లు మాట్లాడుకోవడనికి లిమిటే ఉండదు. నీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే ఏమీ మాట్లాడద్దులే బావ అంటుంది యామిని. నువ్వు చెప్పింది నిజమే యామిని నాకు కూడా కళావతి గారితో మాట్లాడుతుంటే నా మాటలకు పులిస్టాప్‌ ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే నా గుండె నా కోసం కళావతి గారి కోసమే కొట్టుకుంటుంది అనిపిస్తుంది. చెప్పేస్తాను. కళావతి గారు రిసార్ట్‌ కు రాగానే నా గుండెల్లో ఉన్నది నువ్వే అని చెప్పి నా మనసులోని ప్రేమను కళావతి గారికి ఎక్స్‌ప్రెస్‌ చేసి తన ప్రేమను గెలుచుకుంటాను. తను నా హర్ట్‌లో బంధించి లవ్‌లప్‌ చేసేస్తాను అని మనసులో అనుకుంటాడు. లేదు బావ నిన్ను ఎలాగైనా  ఆ కావ్యకు దగ్గర కానివ్వను ఏది ఏమైనా సరే నిన్ను ఈరోజు పూర్తిగా నా సొంతం చేసుకుని ఆ కావ్య మళ్లీ నీ జీవితంలోకి రాకుండా చేస్తాను అని మనసులో అనుకుంటుంది.


మరోవైపు రాహుల్‌ బంగారు నకిలీ నగలు చేయించి స్వప్న రూంలో పెట్టేయాలని వెళ్లి లాకర్‌ ఓపెన్‌ చేస్తాడు. ఇంతలో స్వప్న వచ్చి  ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. పవర్‌ బ్యాంక్‌ కోసం వెతుకుతున్నాను అని చెప్తాడు. నీ పవర్‌ బ్యాంక్‌ నా లాకర్ లో ఎందుకు ఉంటుంది. అంటూ నిలదీస్తుంది. నిన్ను చూస్తుటే ఎందుకో డౌటుగా ఉంది. అంటూ అనుమానం వ్యక్తం చేయగానే.. రాహుల్‌ నీ మీద ఒట్టు స్వప్న నీ ముందు మళ్లీ మళ్లీ కుప్పిగంతలు వేస్తానా..? అంటాడు. దీంతో స్వప్న సరే అంటూ వెళ్లిపోతుంది. ఇంతలో రుద్రాణి వచ్చి రాహుల్‌ను తిడుతూ ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది. రాహుల్‌ ఏం లేదు మమ్మీ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్తాడు. నిన్ను చూస్తుంటే అలా కనిపించడం లేదు. దొంగలా బిహేవ్‌ చేస్తున్నావు నీ బాడీ లాంగ్వేజ్‌ కూడా అలాగే ఉంది అంటుంది. దీంతో రాహుల్ షాక్‌ అవుతాడు.

రిసార్ట్‌ కు వెళ్లాక రూంలో  కూర్చున్న యామిని రాజ్ చేయి తన చేతితో తీసుకుని బావ ఎలాంటి కపుల్స్‌ కు అయినా వాళ్ల లైఫ్‌ పెళ్లి అయ్యాక స్టార్ట్‌ అవుతుంది. కానీ మనం మాత్రం పెళ్లికి ముందే మన లైఫ్‌ని మొదలు పడదాం బావ. ఈ టూడేస్‌ నీతో గడిపే ప్రతిక్షణం నాకు లైఫ్‌లాంగ్‌ గుర్తిండిపోవాలి బావ అని చెప్తుంది. రాజ్‌ అదోలా చూస్తుంటాడు. ఏమైంది బావ నేను దగ్గరకు వచ్చే సరికి నీకు రొమాంటిక్‌ ఫీలింగ్స్‌ వస్తున్నాయా..? అని అడుగుతుంది. దీంతో రాజ్‌ కాదు నా లిమిట్స్‌ నాకు గుర్తుకు వస్తున్నాయి అని చెప్తాడు.


కమాన్‌ బావ మన మధ్య లిమిట్స్ ఏంటి..?  చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. పైగా మనల్ని పంపించింది మా మామ్‌ డాడే కదా అని చెప్తుంది.  నేను అదే చెప్తున్నాను.. వాళ్లు మనల్ని నమ్మి పంపించినప్పుడు వాళ్ల నమ్మకాన్ని మోసం చేయకూడదు కదా అంటాడు రాజ్‌. దీంతో యామిని మనం కాబోయే భార్యభర్తలమే కదా బావ అంటుంది. కానీ ఇంకా పెళ్లి అయితే కాలేదు కదా అంటాడు రాజ్‌. అది ఎలాగూ అవుతుంది అంటూ రాజ్‌ మీదకు వెళ్తుంటే రాజ్‌ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. ఇంతలో కావ్య రిసార్ట్‌కు వస్తుంది. కిటికీలోంచి కావ్యను చూసిన రాజ్‌ హ్యాపీగా ఫీలవుతాడు. యామిని దగ్గరకు వచ్చి బావ ఏమైంది..? అని అడుగుతుంది.

యామిని నేను అర్జెంట్‌గా కిందకు వెళ్లాలి అని చెప్తాడు. ఏమైంది బావ అని యామిని అడగ్గానే.. నా ఫ్రెండ్‌ ఏదో ప్రాబ్లమ్‌ అని చెప్పాడు. నేను ఇక్కడకు రమ్మని చెప్తాను. వాడు వచ్చాడు అని చెప్తాడు రాజ్‌. ఇక్కడకు రమ్మని చెప్పడం ఏంటి బావ. ఈ టూడేస్ మన ఇద్దరమే కలిసి ఉండాలని అనుకున్నాం కదా..? అంటుంది. జస్ట్‌ టూ అవర్స్ యామిని  ఈ లోపు నువ్వు ఫ్రెష్ అప్‌ అవ్వు నేను వస్తాను అంటూ రాజ్‌ బయటకు వెళ్తాడు. ఇంతలో కావ్య లోపలికి వస్తుంది. కావ్యను చూసి తెలియనట్టు కళావతి గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుంటే యామిని అనుమానంగా కిందకు  వస్తుంది. యామినిని గమనించిన రాజ్‌ కావ్యను తీసుకుని తన రూంలోకి వెళ్తాడు. యామిని రిసెప్షన్‌ దగ్గరకు వచ్చి రాజ్‌ను వెతుకుతుంది.

అప్పు కిచెన్‌లో లంచ్‌ బాక్స్‌ రెడీ చేసుకుంటుంటే ధాన్యలక్ష్మీ వచ్చి మొదటి రాత్రి అయిపోయాక స్టేషన్‌కు వెళ్లడానికి రెడీ అవుతున్నట్టు ఉంది. అనుకుంటూ దగ్గరకు వెళ్లి స్టేషన్‌కు వెళ్తున్నావా..? అని అడుగుతుంది. అవునని అప్పు చెప్పగానే.. శోభనం అయిన మరుసటి రోజు పూజ పెట్టుకుంటారు తెలుసా..? అయినా మగరాయుడిలా తిరిగిన నీకు ఇలాంటివి ఎలా తెలుస్తాయి అంటూ తిడుతుంది. ఇంతలో కళ్యాణ్‌ వచ్చి అమ్మా తను స్టేషన్‌కు వెళ్తుందని నీకెవరు చెప్పారు. నువ్వు బాధపడతావని తను మూడు రోజులు లీవ్‌ పెట్టింది. నీకు నచ్చినట్టుగా పనులన్నీ చేయాలని నేను వద్దన్నా వినకుండా లీవ్‌ పెట్టింది అని కళ్యాణ్‌ చెప్తాడు.

దీంతో అబద్దం చెప్పినా అతికినట్టు ఉండాలి. కళ్ల ముందే క్యారేజ్‌ కట్టుకుంటే ఉంటే లీవ్‌ పెట్టింది అంటావేంటి అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో అప్పు అది కాదు అత్తయ్యా రోజు నాకు కావ్య అక్క లంచ్‌ బాక్స్‌ ప్రిపేర్‌ చేసేది. ఇవాళ కావ్య అక్క లేదు కదా..? రేపు ఎప్పుడైనా అక్క లేకపోతే ఎలా అందుకే లంచ్‌ బాక్స్‌ ఎలా పెట్టుకోవాలో ప్రిపేర్‌ అవుతున్నాను అని చెప్తుంది అప్పు. దీంతో ధాన్యలక్ష్మీ ఇది ప్రాక్టీస్‌ చేయడానికి ఇదేమైనా పోలీస్‌ ట్రైనింగ్‌ అనుకున్నావా… అంటూ తిడుతుంది. ఇంతలో ప్రకాష్ వచ్చి కోపంగా ధాన్యలక్ష్మీని తిడతాడు. ధాన్యలక్ష్మీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×