Intinti Ramayanam Today Episode june 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ఒక వ్యక్తి ఇంటికి వస్తాడు. భానుమతి పార్వతిని పిలుస్తుంది. అటు పార్వతి శ్రీయా అని పిలుస్తుంది. అతను ఆరోగ్య సమస్య సరిగ్గా లేకపోవడంతోనే ఇక్కడ మానేసాడు.. తన కూతురు పెళ్లి చేస్తున్నాడు. తనకి పల్లవి దగ్గర తాళాలు తీసుకుని డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు అని అంటుంది. అప్పుడే పల్లవి అక్కడికి వస్తుంది. పల్లవి తాళాలు అతనికొక 50 వేలు ఇవ్వాలంటే తెచ్చిస్తాను అని శ్రియ అడుగుతుంది. ఇంకెందుకమ్మా పల్లవి వచ్చింది కదా పల్లవిని తీసుకొచ్చిందిలే అని పార్వతి అంటుంది.. మీకు పల్లవి అంటేనే ఇష్టం కదా అత్తయ్య ఎందుకంటే ఆమె మేనకోడలు కాబట్టి.. ఇంత పక్షపాతం చూపిస్తున్నారు ఎందుకు..? ఇక రెచ్చిపోయిన శ్రీయా పార్వతితో వాదిస్తుంది.. ఇంట్లోకి వెళ్ళాక రచ్చ చేస్తుంది. పార్వతికి మరో తలపోటు వచ్చిపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీయా నాకు మర్యాద లేదు.. ఈ ఇంట్లో నాకు విలువ లేదు.. అంటూ రచ్చ రచ్చ చేస్తుంది. పార్వతి ఇప్పుడు ఇదంతా గోడవెందుకమ్మా.. పల్లవి శ్రీయా అన్నది కూడా నిజమే కదా.. నువ్వు నా మేనకోడలు కాబట్టే నీకు పెత్తనం ఇచ్చానని అనుకుంటుంది ఆ తాళలేవో శ్రియాకి ఇచ్చేయమ్మా అనేసి పల్లవికే షాక్ ఇస్తుంది పార్వతి.. శ్రియ మాత్రం నాకు ఇంట్లో విలువ లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి పద మనం వెళ్దాం అనేసి బ్యాగ్స్ అద్దుకొని శ్రీకర్ దగ్గరికి వస్తుంది. శ్రీకర్ పద వెళ్లిపోదాం.. ఈ ఇంట్లో మనం ఉండాల్సిన అవసరం లేదు పల్లవిని అంటుంది.. ఇంట్లో నా మాటకే విలువ ఉంది. నీ మాటకి విలువ లేదు అని పల్లవి అన్నది..
ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్దాం పదనేసి అంటుంది.అప్పుడే కమల్ అక్కడికి వచ్చి జరాగండి అని అంటాడు.. ఏంటి ఏమైంది అనని అందరూ ఆలోచిస్తుంటారు రూమ్ లోకి వెళ్లి పల్లవి, కమల్ వస్తువులని బ్యాగ్లో సర్దుకుని తీసుకొని వస్తారు. ఇదేంటి అంటే ఇది మనిద్దరి బ్యాగు.. వదినే ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే మనం కూడా వెళ్లిపోవాలి కదా.. వదినను ఆపే వాళ్ళు లేనప్పుడు.. మనల్ని కూడా ఆపే వాళ్ళు లేరు కదా అని కమలంటాడు.. నేనైతే ఇంట్లోంచి రాను అని పల్లవి అంటుంది. వదిన వెళ్ళిపోతుంటే ఎవరు ఆపలేదు కదా మనం వెళ్ళిపోతున్న ఎవ్వరు ఆపరు నువ్వు ఎందుకు రాను అంటున్నావు? నాకు అర్థం కావట్లేదు? అని కమల్ అంటాడు.. పార్వతి ఇప్పుడు ఇంట్లో ఉన్న గొడవలు సరిపోట్లేదా? మళ్లీ కొత్త గొడవలా వెళ్ళండి అని గట్టిగా అరుస్తుంది..
దాంతో అందరూ వెళ్లిపోతారు. అటు అవని అక్షయ్ కి ఏకు మేకు లాగా తయారవుతుంది.. ఫైల్స్ అని చూపిస్తూ ఇవన్నీ ఇంకా క్లియర్ చేయలేదు కదా.. వెంటనే క్లియర్ చేయండి అని అక్షయ్ కి ఆర్డర్ వేస్తుంది.. కానీ అక్షయ్ మాత్రం నువ్వు నా పక్కన కూర్చుంటే నేను నా వర్క్ నేను చేసుకోలేకపోతున్నాను అని అంటాడు.. నేను మీ భార్యను అనే ఫీలింగ్ మీకుంటే మీరు అది మనసులోంచి తీసేయండి. నేను ఇక్కడ ఒక ఎంప్లాయ్ మాత్రమే. అది గుర్తుపెట్టుకుని మీరు పని చేయండి అని అవని అంటుంది.
కమల్ స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తాడు.. అందరు ఇక్కడే ఉన్నారా? మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటాడు.. ఏంట్రా గుడ్ న్యూస్ అని పార్వతి అడుగుతుంది.. మీరు ముందు స్వీట్ తీసుకొని తినండి ఆ గుడ్ న్యూస్ ఏంటి నేను చెప్తాను అని అంటాడు.. ఇప్పుడే అక్కడికి వచ్చిన శ్రీకర్ గుడ్ న్యూస్ ఏంటో ఇప్పటికైనా చెప్పురా అని కమల్ ని అడుగుతాడు.. అవని వదినకు మన ఆఫీసులోనే జాబ్ వచ్చింది.. అన్నయ్య కంటే పెద్ద పవర్ కూడా ఉందంట అని అనగానే అందరూ నోట్లో పెట్టుకున్న స్వీట్ ని కక్కేస్తారు.
ఇక కమల్ అవనికి వీడియో కాల్ చేస్తాడు. వదిన నువ్వు ఫ్లవర్ డెకరేషన్ నుంచి ఆఫీసులో ఫైల్స్ మీద సైన్ పెట్టే రేంజ్ కు వెళ్ళావు అంటే నువ్వు చాలా గ్రేట్ వదిన అని అవని పై పొగడ్తల వర్షం కురిపిస్తాడు.. ఇక తర్వాత పల్లవి చక్రధర్ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్తుంది. అతను మాత్రం పల్లవి కోపాన్ని క్షణంలో మాయం చేసే మాట చెబుతాడు. ఇక తర్వాత అక్షయ్ అవని ఇద్దరు కలిసి ఒకే కారులో ఇంటికి వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో అవనిని అడ్డంగా ఇరికించే ప్లాన్ చేస్తుంది పల్లవి.. ఈ వర్కౌట్ అవుతుందా? లేదా బెడిసి కొడుతుందా? రేపటి ఎపిసోడ్ లో చూడాలి..