E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పబ్బుకు వెళ్లిన ఇందు  

Brahmamudi Serial Today march 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పబ్బుకు వెళ్లిన ఇందు  
Advertisement

Brahmamudi serial today Episode:

స్వాతికి వాళ్ల ఫ్రెండ్‌ సంతోష్‌ ఫోన్‌ చేసి ఇందుకు జాబ్‌ ఇప్పిస్తానని చెప్తాడు. సరే అంటూ కాల్‌ కట్‌ చేసిన స్వాతి, ఈ విషయం ఇందుకు చెప్తుంది. ఇందు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇప్పుడు వెళ్దాం పద అని స్వాతి చెప్పగానే.. ఇప్పుడు ఎక్కడికి అని ఇందు అడగ్గానే.. ఎక్కడి ఏంటి…? ఆ ఎండీని కలవడానికి సంతోష్‌ ఇప్పుడే పరిచయం చేస్తాడట.. అని చెప్పగానే.. ఇందు అనుమానంగా ఈ టైంలోనా అని అడగ్గానే.. ఇందాకా నువ్వు అన్నావు కదా..? ఇప్పుడు ఉన్న అవకాశం రేపు ఉంటుందో లేదో అని ఇప్పుడు నువ్వు మిస్‌ అయ్యావు అంటే ఆ అవకాశం ఎవరికైనా వెళ్లొచ్చు అని స్వాతి చెప్పగానే.. అది నిజమే కానీ ఎవరో ఏంటో తెలియకుండా ఇంత రాత్రి పూట వెళ్లడం అంటే.. అని ఇందు అనుమానిస్తుంటే.. స్వాతి.. అక్కా నువ్వు బయట తిరగవు కాబట్టి కంగారు పడుతున్నావు.. కానీ మన హైదరాబాద్‌ రాత్రిపూటే ఎక్కువ పని చేస్తుంది అని చెప్పగానే..

ఇందు సరే ఇంత దూరం వచ్చాక ఇకేంటి.? ఇంతకీ ఎక్కడికి వెళ్లాలి అని అడగ్గానే.. వెనక నుంచి అపర్ణ కోపంగా ఏంటే వెళ్లేది..? మీ పాటికి మీరే నిర్ణయాలు తీసుకుంటారా..? అంతా మీ ఇష్టమేనా..? అంటూ కోప్పడగానే.. స్వాతి ఇంకెవరి పర్మిషన్‌ తీసుకోవాలి నాన్నమ్మ.. అక్క బయటకు వెళ్లడానికి రేఖ ఆంటీ పర్మషన్‌ ఇచ్చింది కదా..? అనగానే.. అపర్ణ కోపంగా అది ఒప్పుకుంది మార్నింగ్‌ పూట వెళ్లడానికి అది కూడా శివరాం గారి ఇంట్లో వంట పని చేయడానికి.. ఇలా రాత్రి పూట వెళితే దానికి అనుమానం రాదా..? అనగానే.. స్వాతి నవ్వుతూ రేఖ ఆంటీ డిన్నర్‌ కూడా ఫినిష్‌ చేసింది. ఇక పడుకున్నది కూడా అని చెప్పగానే.. ఒకవేళ ఏదైనా అవసరం వస్తే.. అని అపర్ణ అడగ్గానే.. అంత అవసరం అయితే మేనేజ్‌ చేయడానికి నేను ఉన్నాను కదా..? అని చెప్తుంది స్వాతి. అయితే ఇందు కూడా నాన్నమ్మ ఈ టైంలో వెళ్లడానికి నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ ఇలాంటి అవకాశం మళ్లీ రాదు కదా..? అనగానే..

Advertisement

అపర్ణ కానీ నాకెందుకో ఇదంతా ఎందుకు అనిపిస్తుంది అని చెప్పగానే.. ఇందు నాన్నమ్మ సముద్రం లోతు గురించి ఆలోచిస్తుంటే.. ఒడ్డునే ఆగిపోతాము కదా..? ప్రయత్నిస్తేనే కదా గెలవగలం అని చెప్పగానే.. అపర్ణ భయంగా మీరు గెలుపు గురించే ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఓడిపోతే.. దాని పర్యావసానాలు ఎలా ఉంటాయోనని నేను భయపడుతున్నాను.. అని చెప్పగానే.. స్వాతి రిస్క్ అనేది ప్రతి చోట ఉంటుంది నాన్నమ్మ.. అలాంటప్పుడు ఆ చేసే రిస్క్‌ ఏదో మనకు ఉపయోగపడేలా చేస్తే బెటర్‌ కదా అంటుంది. దీంతో అపర్ణ సరేలే మీరు ఇంత నమ్ముతున్నప్పుడు నేనెందుకు అడ్డు పడటం.. జాగ్రత్తగా వెళ్లి రా..? అని చెప్పగానే.. ఇందు నవ్వుతూ థాంక్యూ అపర్ణాదేవి.. అంటూ హగ్‌ చేసుకుని స్వాతిని డీటెయిల్స్‌ అడిగి తీసుకుని ఇందు వెళ్లిపోతుంది.

ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవడానికి ఐశ్వర్య పబ్బుకు వెళ్తుంది. అదే పబ్బుకు స్మగ్లర్‌ను పట్టుకోవడానిక వెళ్తుంది నందు. ఇద్దరూ ఒకరిని చూడకుండా ఒకరు డాష్‌ ఇచ్చుకుని గొడవ పడతారు.. అదే పబ్బుకు సంతోష్‌ కోసం వస్తుంది ఇందు. భయంభయంగా లోపలికి వెళ్లి సంతోష్‌కు కాల్ చేస్తుంది. సంతోష్‌ వాళ్ల బాస్‌కు ఇందును పరిచయం చేస్తాడు. ఇందుతో ఆ మేనేజర్‌ వల్గర్‌గా మాట్లాడుతూ చూస్తుంటాడు ఇందు ఇబ్బంది పడుతుంది. అదే పబ్బులో రాజు, తన ఫ్రెండ్‌ కలిసి వెయిటర్‌తో గొడవ పడతారు. మరోవైపు స్మగ్లర్ కోసం పబ్బులో ఉన్న ఇందు స్మగ్లర్‌ను చూస్తుంది. వాడికి అనుమానం రాకుండా ఉండేందుకు పక్క నుంచి వెళ్తున్న వెంకట్‌ తో డాన్స్‌ చేస్తుంది. మరోవైపు ఇందుకు మందు తాగించేందుకు సంతోష్‌ వాళ్ల బాస్‌ ట్రై చేస్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×