Kissik Talks:కిస్సిక్ టాక్స్ 75వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్, వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ప్రముఖ న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా సెలబ్రిటీలతో నిర్వహించిన ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ స్పెషల్ ఎపిసోడ్లో బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేశారు. ఫైమా(Faima), యాదమ్మ రాజు(Yadamma raju), బిగ్ బాస్ సోనియా ఆకుల (Sonia aakula) , సీరియల్ యాక్ట్రెస్ సిద్ధార్థ్ వర్మ వారి వారి భాగస్వామ్యులతో ఈ షో కి హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్లో సెలబ్రిటీలు నవ్వుల వర్షం కురిపించారు. తాజా ఎపిసోడ్లో వర్షతోపాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ డెమోన్ పవన్ (Demon Pawan)కూడా హోస్ట్ సందడి చేశారు.
అందులో భాగంగానే భార్యాభర్తల్లో ఎవరు గొప్ప? అనే టాస్క్ లో భాగంగా.. భార్యాభర్తల్లో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు వర్ష.. విష్ణు ప్రియ తో మాట్లాడుతూ.. “విష్ణు నువ్వు గొప్ప?మీ ఆయన గొప్ప?” అని ప్రశ్నించగా. “మేమిద్దరం గొప్పోళ్ళం” అంటూ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత ఫైమా మాట్లాడుతూ..” భార్యలే గొప్ప.. పొద్దున్నే ముగ్గు వేస్తాము.. సాయంత్రం కల్లాపు జల్లి మళ్ళీ ముగ్గు వేస్తాం.. మీరు చేస్తారా?” అని ప్రశ్నించింది. దానికి ఫైమా భర్త ప్రవీణ్ మాట్లాడుతూ..” అది నువ్వు చేయవు కదరా” అని చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు.. ఇక్కడ గొప్ప గురించి టాపిక్ వచ్చింది. నన్ను మాట్లాడనివ్వు అంటూ నవ్వులు పూయించింది. స్టెల్లా మాట్లాడుతూ..” 24 గంటల్లో డే ఎండింగ్ కి భార్యే గొప్ప. ఆమె తన జీవితంలో ఎన్నింటినో సాక్రిఫైజ్ చేస్తుంది అని చెప్తుండగానే.. యాదమ్మ రాజు చర్చ పెట్టుకున్నారా? అంటూ నవ్వులు పూయించారు.
ఇక ఫైనల్ గా సోనియా ఆకుల భర్త యష్ మాట్లాడుతూ.. “భార్య గొప్ప? భర్త గొప్ప? అనే విషయానికొస్తే.. ఇద్దరూ గొప్పే ముఖ్యంగా అమ్మాయిల గురించి చెప్పాలి.. నేను ఎంత వర్క్ చేసి వచ్చినా సరిగ్గా నిద్ర లేకపోతే నాకు నెక్స్ట్ డే పని చేయలేను.. అదే సోనియా 8 నెలల బేబీతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ఆమె బాధ నాకు తెలుసు అని చెబుతుండగానే.. స్టెల్లా మాట్లాడుతూ.. నాకు నిద్ర చాలా ఎక్కువ.. కానీ గిఫ్టీ బేబీ రాగానే ఒక దగ్గర నేను స్టిక్ అయిపోయాను” అని తన బాధ చెబుతుండగానే.. ఐ అగ్రి విత్ దట్ అంటూ యాదమ్మ రాజు మళ్ళీ తన స్టైల్ లో నవ్వుల వర్షం కురిపించారు.
also read:అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!
యష్ మగవారి గురించి మాట్లాడుతూ.. “ఆడవారే కాదు మగవారు కూడా గొప్ప.. వాళ్ళు వాళ్ళ కుటుంబాల కోసం, ఆర్థిక కష్టాలను అధిగమించడానికి విదేశాలకు వెళ్లి సంవత్సరాల తరబడి అక్కడే ఉద్యోగం చేస్తూ ఎన్నో కష్టాలు పడతారు. ఈ బతుకు మాకు ఎందుకు.. ఈ ఉద్యోగం వదిలేసి ఇండియాకు వెళ్దాం.. అనుకుని వెళ్లాలనుకుంటారు.. కానీ మరుసటి రోజు కుటుంబం కోసం మళ్లీ కష్టపడడం మొదలుపెడతారు. కాబట్టి భార్యాభర్తల్లో ఎవరు గొప్ప అనే టాపిక్ రాకూడదు.. ఇద్దరూ సమానమే ” అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మొత్తానికైతే ఈ కాన్వర్జేషన్లో యాదమ్మ రాజు , స్టెల్లా, ఫైమా ఎపిసోడ్ కి హైలెట్గా నిలిచారు.