E-Paper
Advertisement

Bamboo Smuggling: అశ్వారావు పేటలో జోరుగా కలప వెదురు దందా.. పట్టించుకోని అధికారులు

Bamboo Smuggling: అశ్వారావు పేటలో జోరుగా కలప వెదురు దందా.. పట్టించుకోని అధికారులు
Advertisement

Bamboo Smuggling: కమిషన్ కోసం బీట్ అధికారి కక్కుర్తి?
• లక్షల్లో దండుకుంటున్నారంటూ గుసగుసలు
• వార్తలు రాస్తున్న విలేకరులపై చిందులు
• డబ్బులిచ్చి సస్పెండ్ కాకుండా చూసుకుంటా” అంటూ ధీమా వ్యక్తం
• “అందరికీ సమాన వాటా ఉంది” అంటున్న ఫారెస్ట్ అధికారి?
• చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు

అశ్వారావుపేట, స్వేచ్ఛ: అటవీ సంపదను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అశ్వారావుపేటలోని స్థానిక పేటమాలపల్లి అటవీ ప్రాంతాల్లో ఉన్న వెదురు సంపదను కొంతమంది స్థానిక వ్యక్తులు, ఫారెస్ట్ శాఖకు సంబంధం ఉన్న వారితో కలిసి వేరే రాష్ట్రాల వ్యక్తులతో కుమ్మక్కై అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు పొగాకు వ్యాపారులకు (బ్యారన్‌కు) భారీగా వెదురు కర్రలను తరలిస్తున్నట్లు సమాచారం వెలువడుతోంది. అటవీ ప్రాంతాల్లో అక్రమంగా వెదురు నరికివేత జరుగుతున్నప్పటికీ, దీనిపై సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: Boycott SRH: బాయ్ కాట్ స‌న్ రైజ‌ర్స్ అంటూ ట్రోలింగ్‌..పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను కొనడంపై వివాదం

ఇతర రాష్ట్రాలకు కలప సంపద..

“కంచె చేను మేస్తున్నట్టుగా” వ్యవహరిస్తున్న అధికారుల తీరు కారణంగా తెలంగాణ అటవీ సంపద ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందని స్థానికులు అంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, అక్రమంగా వెదురు నరికివేత మరియు తరలింపుపై సంబంధిత బీట్ ఆఫీసర్, వాచర్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇందులో పాల్గొంటున్న వ్యక్తులు, సహకరిస్తున్న అధికారులపై కూడా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Also Read: Family Drama OTT: ముగ్గురు తండ్రులకు పుట్టిన ముద్దుల కూతురు… ఆసక్తి రేపుతున్న ఒక్కో ఎపిసోడ్

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×