E-Paper
Advertisement

ముఖేష్ కెప్టెన్సీ ఉష్.. కొత్త కెప్టెన్ గా అపూర్వ.. అప్పుడే మొదలుపెట్టేసిందే?

ముఖేష్ కెప్టెన్సీ ఉష్.. కొత్త కెప్టెన్ గా అపూర్వ.. అప్పుడే మొదలుపెట్టేసిందే?
Advertisement

Bigg Boss 10:వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన అపూర్వ (Apoorva).. ముఖేష్ (Mukhesh)తో కలసి గేమ్ ఆడగా.. ముఖేష్ కెప్టెన్ గా నిలవగా, సేమ్ హక్కులను అపూర్వ కూడా అందుకుంది. అయితే అనూహ్యంగా అపూర్వను హోస్ట్ నాగార్జున (Nagarjuna ) కెప్టెన్ గా పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ముఖేష్ ను కెప్టెన్ పదవి నుంచి ఎందుకు తీసేసారు ? అనే విషయానికి వస్తే.. నిన్నటి ఎపిసోడ్ లో వర్షిణి , వంశీ కోసం ముఖేష్ తన కెప్టెన్సీని త్యాగం చేశాడు. దీంతో ఆటలో ముఖేష్ తో పాటూ గెలిచిన అపూర్వ నెక్స్ట్ ఇంటి కెప్టెన్ గా ఉంటుందని నాగార్జున ప్రకటించడం గమనార్హం. ఇకపోతే కెప్టెన్ గా బాధ్యతలు అలా చేపట్టిందో లేదో అప్పుడే అపూర్వ తన అధికారాన్ని చూపించినట్టు తాజా ప్రోమోలో చూపించేశారు. ముఖేష్, త్రిగుణ్ లతో కెప్టెన్ అపూర్వ గొడవ పడినట్టుగా కూడా ఆ ప్రోమోలో చూడవచ్చు.

వర్షిణి కోసం ముఖేష్ కెప్టెన్సీ త్యాగం..

విషయంలోకి వెళ్తే.. టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ లో భాగంగా ముఖేష్ తో మూడో వారాన్ని స్టార్ట్ చేసి ఎండ్ చేశాడు బిగ్ బాస్. స్టార్ ప్లేయర్ గా, కెప్టెన్ గా నిలిచిన ముఖేష్ కి బిగ్ బాస్ చివర్లో ఒక టెస్ట్ పెట్టాడు. వర్షిణి, వంశీ లో నుంచి ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. నువ్వు నీ పవర్ వాడుతావా? ఒకవేళ వాడితే ఆ ఇద్దరు ఎలిమినేట్ కాకుండా సేఫ్ అవుతారు.. ఎలిమినేషన్ ఉండదు.. అని నాగార్జున చెబుతాడు. అయితే నీ కెప్టెన్సీ పోతుంది. ఇమ్యూనిటీ ఉండదు . డైరెక్ట్ గా నామినేట్ అవుతావని కూడా నాగార్జున కండిషన్ పెడతాడు. అయితే అన్నింటిని ఒప్పేసుకొని వర్షిణి , వంశీల కోసం తన కెప్టెన్సీని, పవర్ ని కూడా త్యాగం చేశాడు ముఖేష్.

కొత్త కెప్టెన్ గా అపూర్వ..

Advertisement

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చెప్పిన ప్రకారం.. తన కెప్టెన్సీ బ్యాడ్జును అపూర్వకి పెట్టేస్తాడు. కెప్టెన్ గా నిలిచిన అపూర్వ ఈ వారం తన అధికారాన్ని చూపించేలా కనిపిస్తోంది. ముఖేష్ తో ఇప్పటికే మొదటి గొడవ జరిగినట్టుగా ఇందులో చూపించారు. అందరికీ ఏ ఏ పని అసైన్ చేయాలి అన్నది అందరితో డిస్కషన్ చేస్తున్న సమయంలోనే ఈ గొడవ జరిగినట్టుగా కూడా ప్రోమోలో చూపించారు. ముఖేష్ మీరు ఏం పని చేస్తారని అపూర్వ అంటే.. డిష్ వాష్ అని దేబ్జానీ చెబుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా.. వినలేదా? అని ముఖేష్ అంటాడు. వినలేదు అని అపూర్వ అంటుంది. మీరు బయట చూసి వచ్చారు కదా అని ఏదో టాపిక్ గురించి ముఖేష్ మాట్లాడతాడు. ఇవే తగ్గించుకోవాలి అంటూ అపూర్వ అంటుంది. నీ దగ్గర నేను తగ్గించుకోనని ముఖేష్ చెబితే.. కచ్చితంగా తగ్గించుకోవాలి అని అపూర్వ అంటుంది. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం రాజుకుంటుంది.

also read:ఫేక్ అకౌంట్..మోసపోవద్దు..ఫ్యాన్స్ కు దుల్కర్ రిక్వెస్ట్!

అపూర్వ హుకూం జారీ..

Advertisement

వారమంతా మూడు పూటలా డిష్ వాష్ చేస్తారు. ముఖేష్ వెంటనే కెప్టెన్ రూమ్ వెకేట్ చేయండి అంటూ చెబుతుంది. రెండు పనులు ఒకేసారి ఎవరూ చేయలేరు అంటూ ముఖేష్ అంటాడు . దీంతో అపూర్వ కెప్టెన్ కి రెస్పెక్ట్ ఇవ్వండి.. నేను చెప్పినట్టు వినాలి. మీరు ఇప్పుడు కెప్టెన్ అపూర్వ అని పిలవాలి అంటూ హుకుం జారీ చేస్తుంది అపూర్వ. మధ్యలో త్రిగుణ్ వచ్చి మిమ్మల్ని నేను అలా పిలవను.. ఏం చేస్తారో చేసుకోండి .. అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మొత్తానికైతే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే తన అధికారం చెలాయిస్తోంది అపూర్వ.

Related News

అలాంటి అమ్మాయే భార్యగా రావాలంటున్న బిగ్ బాస్ పవన్.. గొప్ప కోరికే!

Telugu Serials : ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్.. అస్సలు ఊహించలేదు కదా..

భార్యాభర్తల్లో ఎవరు గొప్ప.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన సోనియా భర్త!

Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా.. బాలు ప్లాన్ అదిరిపోలే.. ఇది కదా అసలు ట్విస్ట్..

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Podarillu Today Episode : గోపికకు దిమ్మతిరిగే షాక్.. నారాయణకు మహా సేవలు.. పెద్దోడు ఫుల్ ఖుషి..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో శ్రీవల్లి.. ధీరజ్ కు టెన్షన్.. చింతామణికి షాక్..

Big Stories

Advertisement
×