Gundeninda Gudigantalu TRP RRating : బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్స్ కు మంచి టిఆర్పి రేటింగ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నీ కూడా టాప్ రేటింగ్తో దూసుకుపోవడంతో పాటుగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా డిఫరెంట్ స్టోరీ తో రావడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత కొంతకాలంగా టీవీ చానల్స్ లలో వచ్చే సీరియల్స్ కి డిమాండ్ కూడా పెరగడంతో ప్రతి ఛానల్ కూడా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. గత నెలతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో ఈ సీరియల్కు మంచి రేటింగ్ కూడా నమోదయింది ఎప్పుడు టాప్ లో ఉంటున్న కార్తీకదీపం సీరియల్ పోటీగా నిలవడం విశేషం. సెప్టెంబర్ నెలలో ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ అలాగే హైలెట్ ఎపిసోడ్స్ ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..
తెలుగు బుల్లి తెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ టాప్ ప్లేస్ లో కొనసాగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ నటనకు 100% న్యాయం చేస్తూ వస్తున్నారు. సెప్టెంబర్ నెలలో మంచి టిఆర్పి రెడ్డిని నమోదు చేసుకోవడంతో పాటుగా హైలెట్ ఎపిసోడ్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ వస్తున్నాయి. రోహిణి బండారం బయటపడడం, మీనా తో పాటుగా బాలు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే మన రోహిణి కలపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ రోహిణి మాత్రం తన తప్పును కప్పిపుచ్చుడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అయితే ఈ క్రమంలో బాలుకి మళ్లీ దొరికిపోవడంతో బాలు ఆ విషయాన్ని ఇంట్లో చెప్పేస్తాడు. ఆ తర్వాత చింతామణికి ప్రభావతికి మధ్య ఉన్న సాన్నిత్యం మరోసారి బయటపడుతుంది మీనా తీసుకెళ్తున్న 5 లక్షల డబ్బులు గురించి ప్రభావతి చింతామణి చెప్తుంది. ఇక చింతామణి ఆ డబ్బులు నీ మీనా నుంచి కొట్టేసి మీనాన్ని తోసి కింద పడేలా చేస్తుంది. ఇక మొత్తానికి మీనాకి రావాల్సిన ఆర్డర్ ని చింతామణి పోయేలా చేస్తుంది.. ఆ డబ్బులు ని ఎలాగైనా కొట్టేయాలి అని బాలు పక్కాగా ప్లాన్ చేస్తాడు. ఇవాళ ఎపిసోడ్లు ఆ ప్లాను అమలు చేస్తాడు. అయితే ఏం జరుగుతుందో అన్నది చూడాలి..
మీనాని తోసేసి ఆ డబ్బులు కొట్టేసి ఆర్డర్ ని తనకే వచ్చేలా చేస్తుంది అని చింతామణి గురించి కాపీ లాగేందుకు బాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం మీనా సంతోషాన్ని నేను చూడాలి అని బాలు చేసిన ప్రయత్నాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అయితే బాలు చేసిన ప్రయత్నం ఫలించేలా కనిపిస్తుంది కానీ మీనా సుమతి వాళ్లకు కాబోయే అత్తగారి దగ్గర డబ్బులు తీసుకున్న విషయం ఎలాగైనా చెప్పాలి అని అనుకుంటుంది. దానికోసం టెన్షన్ పడుతుంది. కానీ బాలు మాత్రం నేను చెప్పబోయే ప్లాన్ వల్ల ఆ డబ్బులు నీకే తిరిగి వస్తాయ్ నువ్వు వెంటనే ఆ డబ్బులు ఇవ్వచ్చు అని బాలు చెప్తాడు. కానీ అందరూ టెన్షన్ పడుతున్న సరే మీనా కోసమని ధైర్యం చేసి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లుగా చింతామణి ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఆ డబ్బుల్ని కొట్టేస్తారా లేదా చింతామణి దొరికిపోతారు అన్నది చూడాలి…
Also Read :Podarillu Today Episode : గోపికకు దిమ్మతిరిగే షాక్.. నారాయణకు మహా సేవలు.. పెద్దోడు ఫుల్ ఖుషి..