Gundeninda GudiGantalu Today episode September 28th : మీనా వెళ్తుండగా ఒక ఆటో డ్రైవర్ ఆటోని ఆపుతాడు. ఏంటి ఎప్పుడైనా మేం ఆటోలని ఆపుతాము ఇప్పుడు మీరు ఆపుతున్నారు అని అడగగానే నా ఆటో సడన్ గా డీజిల్ లేక ఆగిపోయింది మేడం. ఆటోలో ఒక మేడం ఉన్నారు అర్జెంటుగా ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్లాలి అని చెప్పగానే ఆటోలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోకుండానే ఎలా వస్తారు తినడానికి అయితే ముందుగానే తింటారు కదా అని మీనా డ్రైవర్ కి క్లాసు పీకుతుంది. ఆ తర్వాత ఆటో నుంచి బయటికి వచ్చిన ఒక ఆవిడ ఆటో డ్రైవర్ కి నీ తప్పేమీ లేదు కదా అని డబ్బులు ఇవ్వడం చూసి మేన మీ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను అని అంటుంది. ఆమె అరుణ్ వాళ్ళ అమ్మ అని తెలియక మీనా తనతో చాలా సంతోషంగా మాట్లాడుతుంది ఇక హాస్పిటల్ కి వెళ్ళగానే అక్కడ సుమతిని చూసి ఇద్దరు సంతోషంగా ఉంటారు ఇక సుమతి కోసమే ఆవిడ ఇక్కడికి వచ్చింది అని తెలుసుకుని మీనా ఏంటే ఆవిడని చాలా కేర్ గా చూసుకుంటున్నా ఎవరు ఆవిడ అని అడుగుతుంది. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాను కదా అక్క ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అని చెప్పగానే మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది.
అయితే సుమతి అరుణ్ వాళ్ళ అమ్మకి నిజం తెలిస్తే బాగోదేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని మనం వాళ్ళకి నిజం తెలియకుండా చేస్తే బాగోదు కదా ఎలాగైనా సరే ఆవిడకి నిజం చెప్పాలి అని నేను ఆలోచిస్తూ ఉంటుంది. బయటికి రాగానే ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని అనుకుంటుంది. సుమతి అలా అబ్బాయికి తెలుసు కానీ ఎంత చెప్తున్నా సరే ఆమె కూడా నిజం చెప్పాలి కదా.. లేకుంటే నా మనసు మనసులో లేదు అనేసి అనుకుంటుంది మీనా.. అయితే ఆవిడ బయటికి రాగానే మీకు విషయం చెప్పాలి అని మీ అబ్బాయి దగ్గరికి తీసుకునే డబ్బులు పోయాయి. కానీ నేను నా డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది మాట వినగానే ఆవిడ చాలా సంతోషంగా ఉంటుంది డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు ఎందుకంటే నీ తప్పులేదు కదా అని ఎంత చెప్పినా సరే మీనా మాత్రం క్లియర్లీ ఎవరికైనా ఊరికే రావు కదా అని అంటుంది.
తనకు కాబోయే వ్యక్తి దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకున్నాను అని చెప్పగానే మీనా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే మీనా ఎలాగైనా సరే నా వల్ల సుమతి జీవితం మళ్లీ పాడవకూడదు నా దరిద్రం సుమతికి అంటుకునేలా చేయకూడదు ఆ డబ్బులు ఎలాగైనా తిరిగి తీసుకురావాలి అని చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికి రాగానే బాలుకి కూడా అదే విషయం చెప్తుంది సుమతికి బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది. ఆ డబ్బులు వెంటనే వాళ్ళకి ఇవ్వకపోతే మాట పోతుంది కదా.. అని అంటుంది నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఆ డబ్బులు వెంటనే తిరిగేసి ఇస్తావు ముందూరు రవి శృతిలను అలాగే రాజేష్ ని కూడా పిలుస్తాను అప్పుడు ఆ డబ్బులు ఎలా వస్తాయో నీకు చెప్తాను అని బాలు చాలా సంతోషంగా చెప్తాడు మీనా మాత్రం టెన్షన్ పడిపోతూనే ఉంటుంది..
మీనా శృతి వాళ్ళందరిని తీసుకొని పైకి వస్తారు. బాలు రాజేష్ ఇద్దరు కలిసి చేసిన ప్లాన్ గురించి అందరికీ వివరిస్తారు. మనమందరం కలిసి ఒక మంచి పని చేయబోతున్నాము ఎలాగైనా సరే మీరందరూ దీనికి సపోర్ట్ చేయాలి అని చెప్పగానే అందరూ ఓకే అని అంటారు అయితే అందరూ కూడా చింతామణి ఇంటికి ఆఫీసులో లాగా వెళ్లాలి అని బాలు ప్లాన్ చేస్తాడు. ఇక తను ప్లాన్ చేసినట్టుగానే అందరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లుగా మారిపోతారు. అంత కలిసి చింతామణి ఇంటి మీద రైట్ చేయాలి అని వెళ్తారు.. అయినా మాత్రం ఇలా చేయడం తప్పండి అని ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం అస్సలు వినకుండా తప్పేమీ లేదు అని అంటాడు. ఒక వైపు రవి మీనా వదిన కష్టాన్ని గుర్తించాను కాబట్టే నేను కూడా వస్తాను అని చెప్పినా కూడా చాలా భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటాడు..
ఇక చింతామణి కామాక్షి పూజ కోసం పిలిచింది అని చెప్తుంది. అయితే వాళ్లంతా కూడా పూజకు వెళుతుంది అని అనుకుంటారు.చింతామణి కూడా పూజకు వెళ్తున్నా అని అందరికీ చెప్తుంది. అయితే తన అసిస్టెంట్ చేసిన పప్పు తినడం వల్ల తన కడుపులో ఏదో తేడాగా ఉంది అని బాధ పడిపోతూ ఉంటుంది.. ఇక కామాక్షికి ఫోన్ చేసి బాలు చింతామణి బయలుదేరిందని చెప్తాడు ఇక అందరూ కూడా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లుగా లోపలికి వెళ్తారు రవి కంగారు వల్ల ఎక్కడ దొరికిపోతాము అని ఆలోచిస్తారు.. కానీ ఏదో ఒకటి మేనేజ్ చేసి వాళ్లందర్నీ నమ్మించేస్తుంది. మొత్తానికి బాలు ప్లాను సక్సెస్ చేయాలా కనిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చింతామణి సడన్గా ఇంటికి రావడంతో అందరూ పరిగెడుకుంటూ వచ్చేస్తారు. ఆ ఏం జరుగుతుందో చూడాలి..