Podarillu Today Episode September 28th : చక్రీ గోపిక ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయదు.. ఏమైంది చక్రికి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. చక్రి తను ఫోన్ చేస్తుంది తనని ఇంకాస్త బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని చక్రి మనసులో అనుకుంటాడు. కస్టమర్లు ఉన్నా సరే గోపిక వరుసగా ఫోన్ చేయడంతో నేను తర్వాత మాట్లాడుకుంటాను అని కష్టమర్ తో అంటాడు. ఇక కారు దిగిన తర్వాత ఏమైంది అని గోపికకు ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఎందుకు ఎన్నిసార్లు ఫోన్లు చేసావు ఏమైనా జరిగిందా అని చక్రి అడుగుతాడు. నువ్వు రాత్రి ఎందుకు వెళ్లిపోయావు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఏమనుకోవాలి అని గోపిక చాలా చాలా ఫీల్ అవుతుంది. కానీ చక్రీ మాత్రం ఎలాగైనా సరే తనకు నిజం చెప్పి దూరం అవ్వాలి అనుకుంటాడు..
చక్రి గోపిక పదే పదే ఫోన్ చేస్తుంది అని ఏమైందో తెలుసుకోవాలి అని ఫోన్ చేస్తాడు. ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసావు ఏమైనా అయిందా ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేశావు అని అడుగుతుంది. అయితే రాత్రి ఎందుకు నువ్వు ఇలా చేశావు నేనంటే నీకు ఇష్టం లేదా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని గోపిక చాలా ఫీల్ అవుతూ చక్రిని అడుగుతుంది. చక్రి ఏమైంది ఇప్పుడు అని అడుగుతాడు. రాత్రి నువ్వు పార్టీ అవ్వకుండానే ఎందుకు వెళ్లిపోయావు? ఎందుకు నన్ను ఇలా దూరం పెట్టేస్తున్నావు అని గోపిక అడగగానే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వి కదా నాకు కాబోయే భర్త వి కదా.. మరి నా ఫ్రెండ్స్ అందరు ముందర నా పరువు తీస్తావా పార్టీ అయ్యే వరకు వెయిట్ చేయాలి కదా అని గోపిక అడుగుతుంది. అయితే గోపిక మాత్రం చక్రి మాటలకి షాక్ అవుతూనే ఉంటుంది. ఏరోజైనా నేను నిన్ను గర్ల్ ఫ్రెండ్ గా అన్నానా? నువ్వు నా ఫ్రెండ్ గా అనుకున్నాను అందుకే ఫ్రెండ్ గానే మాట్లాడుతున్నాను అని గోపికతో అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది.
నేను ఏ రోజైనా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా..? లేదు అంటే ఏ రోజైనా నిన్ను ఆ దృష్టితో చూసానా అని చక్రి అనగానే గోపిక ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతుంది.. ఏంటి నువ్వు నన్ను ప్రేమించట్లేదా ఎందుకు నువ్వు నా వెంట పడ్డావు. నాతో ఎందుకు ప్రేమగా మాట్లాడావు అని చక్రిత్తో గోపిక అడగగానే ఏ రోజు నేను మిమ్మల్ని వేరే దృష్టితో చూడలేదు అని చక్రి అనగానే గోపిక ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చేస్తుంది. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను అసలు ఊహించలేదు ఇది నేను భరించలేకపోతున్నాను అని గోపిక అనడంతో చక్రి కూడా చాలా ఫీల్ అవుతాడు. అనవసరంగా అమ్మాయి మనసులో లేనిపోని ఆశలు పెట్టినట్టున్నాను అని చక్రి బాధపడతాడు.
నారాయణ బయట పడుకునే అలానే ఉండడం చూసిన మహాలక్ష్మి ఇంట్లో దున్నపోతులాంటి కొడుకులు ఉన్నారు కదా.. ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదా..? అయితే ఇంత జ్వరం ఉంది నా బాడీ ఉక్కు అది ఇది అన్నావు అని మహాలక్ష్మి అంటుంది ఎలాగైనా సరే.. నిన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాను పదాన్ని ఎంత చెప్పినా సరే నారాయణ మాత్రం తర్వాత వెళ్దాం అని అంటారు. ఇక చక్రి వచ్చేలోగా ఫోన్ స్విచాఫ్ ఉంది ఏమైంది అని.. అడుగుతుంది. ఇక చక్రి నారాయణ కోసమే ఏదైనా తీసుకు రమ్మంటే మీకోసం నేను ఏదైనా చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సస్పెన్స్ గా మారుతూ వస్తుంది.
ఇక మాధవ్ సైట్ దగ్గర ఉండగా మనీషా అక్కడికి వస్తుంది మనిషి అని చూసి చాలా సంతోషంగా మాధవ్ బయటికి వస్తాడు. అయితే అక్కడికి వచ్చిన మాధవ్ ఏంటి మనిషా ఇలా వచ్చావ్ నాకోసమే వచ్చావా ఏం తీసుకొచ్చావు అని ప్రేమగా అడుగుతాడు. ఇక వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ కాస్త ఎపిసోడ్ కి హైలైట్ గా మారుతుంది. మనీషా చేసిన రసగుల్లా మాధవ్ మనసుని దోచుకుంటుంది. మొత్తానికి ఇద్దరు కలిసి చాలా సంతోషంగా కనిపించడం ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ తీసుకొచ్చినట్లే ఉంటుంది. వాళ్ళిద్దరూ సైకిల్ మీద సరదాగా బయటికి వెళ్లడం చూసి అభిమానులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి పెద్దోడు లవ్ ట్రాక్ గాడిలో పడుతుంది వాళ్ళిద్దరు అలా సరదాగా సైకిల్ మీద వెళ్లడం చూసిన ఎవ్వరైనా సరే జంట బాగుంది అని అంటున్నారు.
ఇక అందరూ సరదాగా ఉంటే చక్రి మాత్రం బాధపడిపోతూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి ఏంట్రా గోపిక బస్టాండ్ కి రోజు రాలేదేమో.. మొహం అలా పెట్టారేంటి అంటూ కన్నాతో అంటుంది. అర్జెంటుగా గోపికకు ఫోన్ చేసి బస్టాండ్ కి అస్సలు మిస్ అవ్వకుండా రమ్మని చెప్పమను లేకపోతే మీ అన్నయ్య మొహం చూడలేకపోతున్నాము అని మహాలక్ష్మి అంటుంది. అయితే మహా మాటతో ఒక్కసారిగా చక్రీ షాక్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Illu Illalu Pillalu Today Episodes: అయ్యో శ్రీవల్లి.. ధీరజ్ కు టెన్షన్.. చింతామణికి షాక్..