Kissik Talks: కిస్సిక్ టాక్స్ 75వ ఎపిసోడ్ సెలబ్రేషన్ చాలా సరదాగా సాగింది. సిద్ధార్థ్ వర్మ -విష్ణు ప్రియ, ఫైమా – ప్రవీణ్, స్టెల్లా -యాదమ్మ రాజు, సోనియా ఆకుల – యష్.. ఇలా నాలుగు జంటలు కిస్సిక్ టాక్స్ 75వ సెలబ్రేషన్స్లో భాగంగా వచ్చి సందడి చేశారు. ఈ నాలుగు జంటలతో హోస్ట్ గా వ్యవహరించిన వర్ష , డెమోన్ పవన్ అందరూ కూడా తమ పెర్ఫార్మన్స్ తో షోకి మరింత ఆకర్షణగా నిలిచారు. ఇకపోతే భార్య గొప్ప? భర్త గొప్ప? అనే టాపిక్ లో భాగంగా డెమోన్ పవన్ తనకు ఎలాంటి అమ్మాయి భార్యగా రావాలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఫైనల్ గా అమ్మాయిలు గొప్ప?.. అబ్బాయిలు గొప్ప? అని వర్ష అడగగా.. ఇద్దరు సమానమే. భార్య బాధ్యతలు భార్య నిర్వర్తిస్తే, భర్త బాధ్యతలు భర్త మోస్తారు.. కాబట్టి ఇక్కడ ఎవరు గొప్ప అనేది లేదు అందరూ సమానమే అంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. పెళ్లి చేసుకోవాలి.. ఇద్దరు మంచిగా, రెస్పాన్సిబుల్ గా, లవ్ గా ఉండాలి అంటూ చెబుతుండగానే విష్ణు ప్రియ మాట్లాడుతూ.” ఇంత గొడవ పడ్డాక నీకు అర్థం అయిందా?” అంటూ నవ్వులు పూయించింది . ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భార్యలు గ్రేట్ , ఆ తర్వాత భర్తలు గ్రేట్ అంటూ పవన్ చెబితే.. యాదమ్మ రాజు మాట్లాడుతూ వెళ్లి మీ అమ్మ దగ్గర ఇలా చెప్పకు.. లేదంటే చంపకేసి కొడుతుంది అంటూ చెబుతాడు.
also read:భార్యాభర్తల్లో ఎవరు గొప్ప.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన సోనియా భర్త!
పవన్ మాట్లాడుతూ..”మా మమ్మీ బంగారం. మా డాడీనే గొప్ప అని చెబుతుంది. కాబట్టి మా అమ్మ లాంటి భార్య నాకు కావాలి “అంటూ “భర్త గొప్పవాడు అని చెప్పే భార్య కావాలి” అని ఇండైరెక్టుగా పవన్ చెప్పేశాడు . మరి అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి దొరకాలని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఈ కాలంలో అలాంటి అమ్మాయి దొరుకుతుందా.. పవన్ నీది చాలా పెద్ద కోరికే అంటూ సరదాగా సెటైర్లు వేస్తూ ఉండడం గమనార్హం.అలా సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది.
ఇకపోతే తన తల్లి లాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి భార్యగా రావాలని పవన్ చెప్పగా యాదమ్మ రాజు కష్టమే అంటూ నవ్వులు పూయించారు.
బిగ్ బాస్ సీజన్ 9 లో కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన డెమోన్ పవన్ తనదైన పెర్ఫార్మన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకొని, టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రీతు చౌదరితో కలిసి పలు స్పెషల్ షోలు చేస్తున్న ఈయన ఇటీవల బంగారం అనే ఒక ఆల్బమ్ సాంగ్ కూడా చేసిన విషయం తెలిసిందే.