Brahmamudi serial today Episode: కావ్య ముఫ్పై రోజుల్లో రాజ్‌ను తీసుకువస్తానని అంత కాన్ఫిడెంట్‌గా చెప్పింది అంటూ రాహుల్ కంగారుపడుతుంటే. అయితే రాజ్ బతికే ఉన్నాడు అంటావా..? అని డౌటుగా అడుగుతుంది రుద్రాణి. దీంతో రాహుల్ సరిపోయింది. నిన్నటి వరకు నేనే రాజును నువ్వే రాజమాతని అంటూ డైలాగులు చెప్పావు. అప్పుడే నా కలలన్నీ కూల్చేశావా..? అనగానే.. అలా అవ్వాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి.. ఆ రాజ్ నిజంగా బతికే ఉన్నాడంటే వాడెక్కడ ఉన్నాడో తెలుసుకుని వాడు శాశ్వతంగా ఇంటికి రాకుండా చేయాలి. వాడి సగం ప్రాణాన్ని మనం తీసేయాలి. అలా చేయాలంటే నువ్వు ఈ రోజు ఉంచి కావ్యను ఫాలో అవ్వు ఒక్కసారి రాజ్ బతికి ఉన్నాడని మనకు తెలిస్తే.. వాడిని శాశ్వతంగా పైకి పంపించేద్దాం అని చెప్తుంది రుద్రాణి. రాహుల్ సరే అమ్మా ఇప్పటి నుంచి అదో పనిలో ఉంటాను అని చెప్పి వెళ్లిపోతాడు.
కావ్య కృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది. రాజ్ పరిస్థితి ఎందుకిలా మారిపోయిందని ఎమోషనల్ అవుతుంది. అసలు ఆ యామిని ఎవరు..? నేను ఆయన బతికే ఉన్నాడని ఇంట్లో వాళ్లకు నిరూపించడానికి నాకో అవకావం ఇవ్వు.. ఆయనే నా భర్త అని నేను బలంగా నమ్ముతున్నాను. నెల రోజుల్లో ఇంటికి తీసుకొస్తానని ఇంట్లో వాళ్లకు మాటిచ్చాను. దయచేసి ఈ చీకట్లోంచి నన్ను వెలుగు వైపు నడిపించు అంటూ ప్రార్థిస్తుంది.
గార్డెన్ లో కూర్చుని ఆలోచిస్తున్న రాజ్ దగ్గరకు వైదేహి, అమె భర్త వస్తారు. ఏంటి బాబు ఇంత రాత్రి అయినా పడుకోకుండా ఏదో ఆలోచిస్తున్నారు. గతాన్ని గుర్తు చేస్తున్నావా..? నీ బాధను అర్థం చేసుకోగలను. ఈ రోజు అమ్మాయితో నిన్ను స్కూల్ దగ్గరకు తీసుకెళ్లమని చెప్పాను అనగానే.. రాజ్ మాత్రం చూపించింది అంకుల్.. కానీ అవే నా గతం అని నేను డిసైడ్ అవ్వలేకపోతున్నాను. మీరు చెప్పినట్టుగానే.. నన్ను ఓ స్కూల్‌కు తీసుకెళ్లింది. అక్కడ నా కాలేజ్ ఫ్రెండ్స్ ను పరిచయం చేసింది. వాళ్లందరూ నేను తెలిసినట్టుగానే మాట్లాడారు. ఆ తర్వాత రెండు సమాధుల దగ్గరకు తీసుకెళ్లింది. వాళ్లే నా అమ్మా నాన్నలు అని చెప్పింది. కానీ అవన్నీ నిజమైతే నేను ఎంత మర్చిపోయినా..? వాటిని చూసినప్పుడు నాకు కొంచెమైనా గుర్తు రావాలి కదా..? అని రాజ్ అడగ్గానే.. యామిని ఫాథర్ మాత్రం కోమాలోంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చారు. పైగా డాక్టర్ అవన్నీ గుర్తు రావడానికి టైం పడుతుందన్నారు కదా..? వాటి గురించి ఆలోచించడం మానేయండి బాబు అంటాడు.
దీంతో రాజ్ లేదు అంకుల్ నేను ఎంత ఆలోచించొద్దు అనుకున్నా.. ఆలోచించకుండా ఉండలేకపోయాను. మా అమ్మా నాన్నా చనిపోయాక వాళ్ల స్థానంలో మీరు ఉండి పెంచారు అంటుంది. కనీసం ఆ విషయాలైనా గుర్తుకు రావాలి కదా అంటూ మాట్లాడుతుండగానే.. యామిని వచ్చి బావ నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అంటుంది. దీంతో రాజ్ లేదు యామిని నువ్వు బావా అని పిలుస్తున్న కూడా అది నా గుండెల దాకా చేరడం లేదు అంటాడు రాజ్. దీంతో ఏం పర్వలేదు బావా.. చిన్నప్పటి నుంచి మనం ఎంత క్లోజ్‌గా ఉన్నామో.. భార్యాభర్తలుగా ఉన్నామో నీకు తెలుసు..? నిన్ను మామూలు మనిషిగా చేసుకుంటాను బావ. ఏదో ఒకరోజు నీకు అన్ని గుర్తుకు వస్తాయి అంటూ ఎమోషనల్ డైలాగ్స్ చెప్తుంది యామిని.
రాజ్‌ను తాను హాస్పిటల్ లో చూసిన విషయం అప్పుకు చెప్తుంది కావ్య. అయితే బావతో మాట్లాడావా..? అని అడుగుతుంది అప్పు. దీంతో కావ్య బాధపడుతూ..కలవలేదని చెప్తుంది. దీంతో ఎందుకు కలవలేదు అని అప్పు అడగ్గానే.. ఆయన గతం మొత్తం మర్చిపోయారు అప్పు.. ఇప్పుడు నేనెవరో కూడా గుర్తు లేదు. అందుకే రోడ్డు మీద నేను కళ్లు తిరిగి పడిపోతే హాస్పిటల్ లో జాయిన్ చేసి వెళ్లారు అని కావ్య చెప్తుంది. దీంతో అప్పు.. మరి బావ గతం మర్చిపోతే.. పక్కన ఉన్న ఆ అమ్మాయి ఎవరు..? అని అడుగుతుంది. అది కూడా తెలుసుకోవాలి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే ముందు ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవాలని యామిని కారు నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ కారు అడ్రస్ తెలుసుకో అంటుంది. సరే అని కొద్దిసేపటి తర్వాత వచ్చిన అప్పు యామిని అడ్రస్ ఇస్తుంది. కావ్య హ్యాపీగా ఫీలవుతుంది.
అప్పు ఇచ్చిన అడ్రస్ తీసుకుని కావ్య బయటకు వెళ్తుంటే.. రుద్రాణి ఆపి తిడుతుంది. దీంతో ఇంద్రాదేవి కోపంగా రుద్రాణిని తిడుతుంది. దీంతో రుద్రాణి మొగుడు దూరమై మూడు రోజులు కూడా కాలేదు. కనీసం కావ్య ముఖంలో ఆ బాధ ఎక్కడైనా కనిపిస్తుందా..? సరే నువ్వు అన్నట్టు రాజ్ బతికే ఉన్నాడు అనుకుందాం. కానీ ఎక్కడున్నాడో తెలియదు..? ఎలా ఉన్నాడో తెలియదే అంటూ ప్రశ్నించడంతో ఇంద్రాదేవి కోపంగా మళ్లీ తిడుతుంది. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. మార్చి నెలలో అడిటింగ్ ఉంటుంది ఎండీ అనేవాడు అక్కడ ఉండాలి అంటూ వెగటుగా మాట్లాడుతుంది రుద్రాణి. దీంతో కావ్య కోపంగా రుద్రాణి గారు మీరు మీ ఆయనని వదిలేసి పాతికేళ్లు అవుతుంది కదా..? ఆయన ఎక్కడున్నారో మీకు తెలుసా..? అసలు ఆయన బతికే ఉన్నారా..? అని ప్రశ్నించగానే.. నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?