Bandi Sanjay Comments: బీఆర్ఎస్ అగ్రనేతకు బీదర్‌లో దొంగనోట్ల ముద్రణ ప్రెస్ ఉందని.. ఆ నకిలీ నోట్లతో ఎన్నికల్లో డబ్బు పంచారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు చర్చినీయంశంగా మారాయి. దొంగనోట్ల ముద్రణ విషయం ఢిల్లీలో ఒక పోలీసు అధికారి తనకు చెప్పారని కూడా పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్‌తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ కేంద్ర మంత్రి చెప్తున్న ఆ గులాబీనేత ఎవరు? సంజయ్ వ్యాఖ్యల వెనక రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా?
బీదర్‌లో బీఅర్ఎస్ అగ్రనేతకు ప్రింటింగ్ ప్రెస్
నిన్నటి మొన్నటివరకూ తెలంగాణలో అధికారంలో ఉన్న బీఅర్ఎస్ అంటేనే ఒంటికాలిపై లెగిసే కేంద్ర హోం శాఖసహాయ మంత్రి బండిసంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి. డైరెక్ట్‌గా కేసీఆర్ పేరు ఎత్తకుండానే బీఆర్ఎస్ అధినాయకుడు దొంగనోట్లు ముద్రిస్తున్నారనే కామెంట్స్ వెనక బండి వ్యూహం ఏంటనేది ఇప్పటి హాట్ టాపిక్‌గా మారింది.
దొంగనోట్లు ముద్రించారని బండి సంజయ్ అరోపణలు
బీదర్‌లో బీఅర్ఎస్ అగ్రనేతకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని.. ఆ ప్రింటింగ్ ప్రెస్ లో బీఅర్ఎస్ కరపత్రాలే కాకుండా దొంగనోట్లు కూడా ముద్రించారని బండి సంజయ్ సంచలన అరోపణలు చేసారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ ని సీజ్ చేయడానికి వెళ్తుంటే రాష్ట్రం లోని ఓ ముఖ్యనాయకుడు తనని అపాడని ఓ పోలీస్ అధికారి తనకి చెప్పినట్లు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉద్యమం తరువాత ఎన్నికలప్పుడు బిఅర్ఎస్ పంచినవన్ని దొంగనోట్లే అని.. అప్పుడు అ నోట్లు ఎలా చెలామణి అయ్యాయో అని అనుమానం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారాయి.
సంజయ్ తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారని ప్రచారం
కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ దొంగనోట్ల అంశం తెరపైకి తీసుకురావడం వెనక పొలిటికల్ ఎజెండా ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీకి బండి సంజయ్ మరోసారి అధ్యక్షుడిగా రాబోతున్నారనే టాక్ నడుస్తోంది. మళ్లీ సంజయ్ బీజేపీ పగ్గాలు పట్టుకోబోతున్నారనే చర్చ నడుస్తున్న తరుణంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న ఆయన బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడం పొలిటికల్ స్టంటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బండి బీజేపీ గతంలో బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ కేసీఆర్, బీఆర్ఎస్‌పై విమర్శలు చేసేవారు.
గులాబీ పార్టీని డిఫెన్స్‌లో పడేసిన కేంద్ర మంత్రి కామెంట్స్
ఆ విమర్శల తీవ్రత పెంచి కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా లెవనెత్తిన అంశం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. కేసీఆర్ టార్గెట్‌గా సంజయ్ చేసిన కామెంట్స్ గులాబీపార్టీని డిఫెన్స్‌లో పడేశాయంటున్నారు. రెండుసార్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ నాయకత్వంపై నేరపూరిత ఇమేజ్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లి…ఆ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీయడమే బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన ఈ ఆరోపణలపై ప్రజల్లో చర్చ నడిస్తే .. బీఆర్ఎస్ ప్రాధాన్యత తగ్గుతుందని.. దాన్ని బీజేపీకి ప్లస్‌గా మార్చుకోవచ్చన్నది కేంద్ర మంత్రి వ్యూహంగా చెప్తున్నారు.
Also Read: లోటస్ మార్క్ లుకలుకలు.. కేంద్రం మొట్టికాయలు
బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలకు చేరువవ్వడానికా?
దొంగనోట్ల ముద్ర.. నకిలీ పాస్ పోర్టు కేసులను ఇప్పుడు ప్రస్తావించడం ద్వారా బీఆర్ఎస్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తూ.. బీజేపీని తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లోకి తీసుకువెళ్లే యోచనలో బండి సంజయ్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, బీఆర్ఎస్ రాజకీయంగా బలహీనంగా ఉంది. ఆ స్థానంలో బీజేపీ బలపడాలనేది కమలదళం వ్యూహం. బీఆర్ఎస్ అధినేతగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌కు ఉన్న రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే క్రమంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఫోకస్ అయిన బండి సంజయ్
బండి సంజయ్ తిరిగి బీజేపీ పగ్గాలు చేపట్టనున్నారు అనే చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రిగా కంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగానే ఆయన గతంలో ఎక్కవగా ఫోకస్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆ భాధ్యతలు చేపట్టనుండటంతో పాత మాస్ ఇమేజ్ కోసం ఆయన పాకులాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చూడాలి మరి సంజయ్ లేవనెత్తిన ఈ తాజా అంశం రాజకీయంగా ఏ టర్న్ తీసుకుంటుందో.