Brahmamudi serial today Episode: మంచి చేసే వాళ్లను తప్పు పట్టడం వచ్చు కానీ సిగ్గుపడటం, ఎదుటి వాళ్ల మీద జాలి పడటం రుద్రాణికి రాదని ఇందిరాదేవి తిడుతుంది. దీంతో రుద్రాణి కోపంగా అమ్మా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం అంటుంది. దీంతో స్వప్న కలగజేసుకుని నిన్ను నీ కొడుకును నమ్మడం ఈ ఇల్లు ఎప్పుడో వదిలేసింది అత్తా అంటుంది. చెప్పాల్సింది చెప్పేశారు కదా..? మా కావ్యను తిడుతూనే తను చేసిన వంటను మెక్కేయండి. మళ్లీ ఉదయాన్నే లేచి ఎవరి మీదైనా అరవాలంటే శక్తి కావాలి కదా..? అంటుంది. దీంతో మాకేం అవసరం లేదు. అంటూ రుద్రాణి భోజనం చేయకుండా వెళ్లిపోతుంటే.. సుభాష్ చేసిన ఘనకార్యం చాలు కానీ ఇక తినండి అంటాడు. దీంతో అందరూ భోజనం చేస్తుంటే.. కావ్య మాత్రం మనసులో హమ్మయ్యా మా ఆయన విషయం గుర్తుకు రాలేదు. కృష్ణయ్య మా ఆయన్ని దాచిపెట్టడానికి చిన్న అబద్దం ఆడాను. ఇంతకీ ఆయన నేను చేసిన చికెన్ తిన్నారో లేదో.. అనుకుంటుంది.
రాజ్ భోజనం చేస్తుంటాడు. కావ్య చేసిన చికెన్ తిని పొగుడుతుంటాడు. దీంతో యామిని కోపంగా రాజ్‌ను తిడుతుంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను. అద్బుతం అంటున్నావు.. ఈ మాత్రం వంట నేను చేయలేనా..? అంటుంది. ఇంతలో వైదేహి అడ్డు వచ్చి అది కాదు బేబీ అబ్బాయి ఉద్దేశం ఏంటంటే.. అని చెప్పబోతుంటే.. షటప్ మామ్ ఇంత ఆయిల్ వేసి.. ఇంతంత ఉప్పు కారం వేసి నేను చేయలేనా..? ఇలా తింటే బావ హెల్త్ ఏమవుంది. డాక్టర్ ఏం చెప్పారు..? డాక్టర్ చెప్పినందుకే కదా నేను లైట్ ఫుడ్ వండుతున్నాను. రామ్ ఇంకొకసారి ఇలాంటి ఆయిల్ ఫుడ్ తినకు.. రేపటి నుంచి స్ట్రిక్ట్‌గా డైట్ ఫాలో అవ్వు అని చెప్పగానే.. రాజ్ ఓకే యామిని రేపటి నుంచి ఫాలో అవుతాను. ఇవాళ్టీకి ఇది తినేస్తాను. అంకుల్ ఏంటి చూస్తున్నారు. మీ కూతురు చెప్పింది రేపటి నుంచి ఇవాళ్టీకి ఇది తినండి అని చెప్తాడు.
భోజనం చేసిన తర్వాత రూంలోకి వెళ్లిన రాజ్ కావ్య వంటను మనసులోనే మెచ్చుకుంటాడు. నేను చేసిన చిన్న సాయానికి ఇంత కష్టపడి నాకోసం టేస్టీ ఫుడ్ తీసుకురావాలా..? ఎలాగైనా తనకు థాంక్స్ చెప్పాలి అని రాజ్ అనుకుంటాడు. మరోవైపు కావ్య కూడా రాజ్ ఫోన్ చేస్తాడేమోనని ఎదురు చూస్తుంది. మరోవైపు కావ్య ఇచ్చిన కార్డు మీద నెంబర్ తీసుకుని రాజ్, కావ్యకు మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చూసుకుని కావ్య సంతోషంగో ఎగిరిగంతేస్తుంది. డోర్ చాటు నుంచి రుద్రాణి దొంగ చాటుగా వింటూ ఆశ్చర్యపోతుంది. ఏమైంది దీనికి సాయంత్రం చచ్చినోడికి వంట పంపిచాను అని చెప్పింది. ఇప్పుడేమో మెసేజ్ చేశాడని అరుస్తుంది. కొంపదీసి చచ్చిన రాజ్ దెయ్యం అయి వచ్చి దీనిలో దూరలేదు కదా..? అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రాజ్,కావ్య ఇద్దరూ మెసేజెస్ చేసుకుంటారు. రాజ్‌ను మెసేజెస్ చేయడం దూరం నుంచి చూసిన యామిని ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. నేను ఇంత కష్టపడితే.. అది ఒక్క పూట భోజనం పెట్టగానే.. ఇంతలా మెసెజెస్ చేయాలా..? కావ్య చాలా డేంజర్.. దానికే కాదు.. రామ్‌కు కూడా టైం ఇవ్వకూడదు. రామ్ ఇప్పటి వరకు బతిమిలాడిన యామిని మాత్రమే చూశావు.. రేపటి నుంచి అసలైన యామినిని చూస్తావు అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది.
ఫోన్ లో మెసేజెస్ చేస్తున్న కావ్య దగ్గరకు అప్పు వస్తుంది. ఏంటక్కా ఫోన్ చూస్తూ మురిసిపోతున్నావు.. అంటూ నిలదీస్తుంది. ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా..? అని అడగ్గానే.. కావ్య ఇప్పుడు ఏమైంది అప్పు.. ఎందుకలా కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. దీంతో అప్పు నువ్వు ఉన్నంట్టుంది అన్నదానం చేయడం ఏంటి..? ఆ రుద్రాణి నువ్వు బావకు పంపించావేంటి అని అడుగుతుంది. దీంతో మీబావ గారికి పంపించాను. నువ్వుఅడ్రస్ తీసుకొచ్చి ఇచ్చావు. నేను ఆ అడ్రస్‌కు వెళితే అక్కడ కనిపించారు. ఆయనకు గతం గుర్తు లేదు. నన్ను కూడా గుర్తు పట్టలేదు. అని చెప్తుంది. దీంతో అప్పు కోపంగా ఇంత జరుగుతున్నా..? నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు అక్కా…? అంటుంది. కావ్య ఎవరిని నిలదీయాలి అని అడుగుతుంది. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది. అసలు ఇదంతా ఆ హాస్పిటల్ లోనే మొదలైంది. ఆ డాక్టర్ మాటలు కూడా తేడాగా కనిపిస్తున్నాయి. రేపు హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్ తో మాట్లాడి అన్ని తెలుసుకుందాము అంటుంది.
జాగింగ్ కు వెళ్లి వచ్చిన యామిని వాళ్ల డాడీకి స్ట్రోక్ వస్తుంది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. హాస్పిటల్ లో డాక్టర్ ఏ ప్రాబ్లమ్ లేదని.. కానీ మరోసారి ఇలా జరిగితే ప్రాణానికే ప్రమాదం అని చెప్తాడు. తర్వాత అందరూ ఐసీయూలోకి వెళ్లి పలకరించగానే.. యామిని పెళ్లి గురించి మాట్లాడతాడు ఆయన. రాజ్ అది నీ చేతుల్లోనే ఉంది. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని మేము చాలా సార్లు అనుకున్నాము అని చెప్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?