Intinti Ramayanam Today Episode March 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య బర్త్ డే వేడుకలు అయిపోయిన తర్వాత అవనిని ఇంట్లో వాళ్ళందరూ దారుణంగా అవమానిస్తారు. కానీ కమల్ శ్రీకర్ మాత్రం తన వదిన దేవత అంటూ అంటారు. ఇక అవని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆటోలో వస్తే ఆటో వాళ్ళు అవని పైకి అనేసి అవని బలవంతం చేయాలని అనుకుంటారు. కానీ అక్కడ గుళ్లో ఉన్న పూజారి వల్ల వాళ్ళు అక్కడ వదిలేసి పారిపోతారు. అవని గుడి దగ్గరికి వెళ్లి జరిగి జరిగిన విషయాన్ని చెప్తుంది. పూజారి ఈరోజు చాలా మంచి రోజమ్మ బ్రహ్మ ముహూర్తంలో గుడికి వచ్చావు కాబట్టి నువ్వు నాకు గుడిలో పనులకు సాయం చేస్తావా సేవ చేసుకుంటే మంచిదని అంటాడు. పూజారి మాటలు విన్నా అవని దేవుడికి సేవ చేస్తానని చెప్తుంది. గుళ్లో ఒక జంట పెళ్లి చేసుకోబోతున్నారు ఆ పనులు నాకు సాయం చేయమని అంటాడు. అవని ఆ పెళ్లి పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది. అక్షయ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. అవనిని చూసి షాక్ అవుతారు. అవని మంచితనం గురించి తెలుసుకున్న రామరాజు, వేదవతి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామ రాజు, వేదవతి పార్వతి చెప్పిన విషయాన్ని నమ్ముతారు. అయితే అమ్మాయిని చూస్తే అలా లేదు కదా అని అనుకుంటూ వెళ్తారు అప్పుడే ప్రణతి అవనితో మాట్లాడటం వింటారు. నా కడుపుకి మీ తమ్ముడికి ఏ సంబంధం లేదు. అసలు నేను మీ తమ్ముని ప్రేమించలేదు ఈ కడుపు సంగతి దాచిపెట్టడానికి మీరిద్దరూ ఈ నాటకం ఆడారని నేను అసలు విషయం బయట పెడతానని ప్రణతి అంటుంది. కానీ అవని మాత్రం అందుకు ఒప్పుకోదు ఈ విషయం ఇక్కడ చెప్తే బాగోదు సమయం చూసి మనమే చెప్దాం. నువ్వేం టెన్షన్ పడకు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి ప్రణతితో అంటుంది. ప్రణతి అవనీత చెప్పిన విషయాన్ని వేదవతి రామరాజు వింటారు. అది బుజ్జమ్మ అసలు మ్యాటరు. పాపం వీళ్ళిద్దరిని కాపాడాలని అమ్మాయి జీవితం నాశనం చేసుకుంటుందని రామ్ రాజ్ అంటాడు.
మాంగల్య ధారణ చేద్దామనేసి పంతులుగారు అందరిని పిలుస్తారు. నువ్వు ఇంటికి వెళ్లి ప్రణతి నేను వస్తానని అవని వెళ్ళిపోతుంది. అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కడతాడు.. ఆ తర్వాత ప్రణతి పైకొస్తుంటే అవని నువ్వు ఇంటికి వెళ్ళు నేను వస్తాను ఇదంతా తర్వాత మాట్లాడుకుందామని ప్రణతిని పంపిస్తుంది. వీళ్ళిద్దరి మాట్లాడుకుంటున్న సమయంలో భరత్ మండపంలోకి వెళ్తాడు. అక్షయ్ నీ కాలర్ పట్టుకుని మా అక్క ఎక్కడ రాత్రి నువ్వే తీసుకెళ్ళవని అడుగుతాడు ఇద్దరు కాసేపు వాదులు ఆడుకుంటారు.
అక్షయ్ కాలర్ పట్టుకోవడం అవని చూసి భరత్ నీ కాలగలమని చెంప పగలగొడుతుంది మీ బావ గారికి ముందు కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పు అనేసి అంటుంది. భరత్ అక్క చెప్పినట్టు క్షమాపణ కోరుతాడు. ఇక పార్వతి మీరిద్దరు నాటకాలు ఆడుతున్నారా అందరి ముందర మా పరువు తీయాలని చూస్తున్నారా అని అంటుంది. ఇంతకుముందేమో ఈ అమ్మాయి ఎవరో మీకు తెలియదు అన్నారు. ఇప్పుడు మా పరువు తీస్తుందని మాట్లాడుతున్నారని వేదవతి మాట్లాడుతుంది. అసలు మీ కోడలు చేసిన పనికి మీరు మెచ్చుకోవాలి. అసలు ఏం జరిగిందో మీకు తెలుసా అని వేదవతి అంటుంది.. అసలు మీ కోడలు ఎంత గొప్ప పని చేసిందో మీకు తెలుసా అని వేదవతి అనగానే అవని ఆపుతుంది.
అది కాదమ్మా నీ గురించి వాళ్ళందరూ తప్పుగా మాట్లాడుతున్నారు కదా.. నన్ను చెప్పనివ్వు అనంటే వద్దండి అనేసి అంటుంది అవని. అవని బయటికి వెళ్ళిపోతుంది వేదవతి కూడా బయటికి వెళుతుంది. మా ఇంటి పరువు గురించి ఆలోచించను తప్ప నేను వేరే ఉద్దేశం ఏమీ ఆలోచించలేదండి అనగానే బుజ్జమ్మ నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావ్ నీ మంచితనం నీకే చెడుగా మారకుండా చేసుకో అనేసి సలహా ఇస్తుంది. ఇక అక్షయ్ వెళ్లిపోతుంటే అక్షయనాపి అవని చాలా మంచిదని గొప్పగా చెప్తుంది బుజ్జమ్మ..
తర్వాత రోజు అవని భరత్ ప్రణతి ముగ్గురు కలిసి శ్రీధర్ ఇంటికి వెళ్తారు. అవని లోపలికి వెళ్లి చాలాసేపు అయిందని భరత్ శ్రీధర్ కోసమని లోపలికి వెళ్తాడు. ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రణతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ప్రణతిని చూసినా అక్షయ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయం అక్షయ్ కి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు చూడాలి..