Brahmamudi serial today Episode: ఐసీయూలోకి వెళ్లి పలకరించగానే.. యామిని పెళ్లి గురించి మాట్లాడతాడు వాళ్ళ డాడీ. రాజ్ అది నీ చేతుల్లోనే ఉంది. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని మేము చాలా సార్లు అనుకున్నాము. యామినికి కూడా నీ మీద ప్రాణాలు పెట్టుకుంది. కాకపోతే మీ అమ్మా నాన్నా నీ చిన్నప్పుడే పోవడం వల్ల వాళ్లకు నీ పెళ్లి చూసే అదృష్టం లేకుండా పోయింది. రేపు నా పరిస్థితి కూడా అలాగే అవుతుందేమోనని భయం వేస్తుంది. నువ్వు కూడా యాక్సిడెంట్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మామూలు అవుతున్నావు. నువ్వున్న ఈ పరిస్థితుల్లో నిన్ను ఇలా అడగడం కరెక్టు కాదు. కానీ నేను పోయే లోపు మీరిద్దరిని భార్యాభర్తలుగా చూడాలని ఉంది. యామినిని పెళ్లి చేసుకో బాబు అంటాడు.
దీంతో వైదేహి ఎందుకండి అల్లుడి గారిని అంతలా బతిమాలుతున్నారు. యామినిని పెళ్లి చేసుకోవాలని తనకి మాత్రం లేదా ఏంటి..? చిన్నప్పటి నుంచి వాళ్లిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారని ఎన్నిసార్లు అనుకోలేదు మనం అంటుంది. యామిని కూడా డాడ్ మీరు ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి.. మేమిద్దరం మీ కోరిక నెరవేరుస్తాము. ఏంటి బావా వాళ్ల కంటే మనకు ఏం ఎక్కువ చెప్పు. డాడ్ మీరు కోరడం బావ కాదనడం ఉంటుందా…? మీరు ఎప్పుడంటే అప్పుడు బావ నా మెడలో తాళి కడతాడు అనగానే.. లేదమ్మా.. మీ పెళ్లి చాలా గ్రాండ్‌గా చేయాలి. అదే నా కోరిక.. రామ్ వీలైనంత త్వరగా నా కూతురుని పెళ్లి చేసుకుంటానని నాకు మాటివ్వు అని అడగ్గానే.. రాజ్ కన్పీజ్‌లో పడిపోతాడు.
అప్పు, కావ్య కలిసి హాస్పిటల్‌కు వస్తారు. రాజ్‌కు ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ కోసం వెతుకుతుంటారు. డాక్టర్ నర్సుతో రొమాన్స్‌లో ఉండగా అప్పు, కావ్య చూసి వెళ్లి డాక్టర్‌ను తిడతారు. మీరెందుకు వచ్చారు అని డాక్టర్ కోపంగా అడగ్గానే.. కావ్య మీరు రాజ్ అనే పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు కదా..? అని అడగ్గానే డాక్టర్ రాజ్ ఎవరు అని అడుగుతాడు. దీంతో కావ్య యామిని బావ అని చెప్పుకునే రామ్‌కు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు కదా అంటూ చెప్పగానే.. డాక్టర్ కంగారు పడతాడు. సెక్యూరిటీని పిలవబోతుంటే.. అప్పు బ్లాక్ మెయిల్ చేస్తుంది. నర్సుతో ఉన్న వీడియో ఉందని అది డాక్టర్ పెళ్లానికి చూపిస్తానని బెదిరిస్తుంది. దీంతో డాక్టర్ భయంతో అప్పు కాళ్ల మీద పడి మేడం నా బాగోతాన్ని బయట పెట్టి నా జీవితాన్ని నాశనం చేయకండి అంటూ ప్రాధేయపడతాడు. తర్వాత డాక్టర్ రాజ్ విషయంలో మొత్తం నిజం చెప్తాడు. దీంతో కావ్య ఎమోషనల్ గా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు యామినిని పెళ్లి చేసుకుంటానని వాళ్ల నాన్నకు మాటిస్తాడు రాజ్. దీంతో యామిని హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో నర్సు వచ్చి మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నాడు అని చెప్పగానే రాజ్ బయటకు వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లగానే.. యామిని సంతోషంగా వాట్ ఏ పర్మామెన్స్ డాడ్.. రాజ్ అయితే ఫుల్లుగా నమ్మేశాడు. అసలు డౌటే రాలేదు అంటుంది. వైదేహి కూడా అవును బేబీ మీ డాడీ పర్మామెన్స్ చూసి నేనే షాక్ అయ్యాను అంటుంది. డాడ్ మీ డెడికేషన్‌కు పర్మామెన్స్‌కు థాంక్యూ డాడ్.. అంటుంది. ఇంతలో వైదేహి ఏంటండి రామ్ పెళ్లికి ఒప్పుకున్నాక కూడా మీ ముఖం ఇంకా వాడిపోయే ఉంది. నిజంగానే మీకు హార్ట్ స్ర్టోక్ వచ్చిందనుకుంటున్నారా ఏంటి..? మీరు జస్ట్ యాక్ట్ చేస్తున్నారు అంతే అంటుంది.
దీంతో ఆయన యామిని ఆనందం కోసం ఒక జీవితంతో ఆడుకుంటున్నాము అనిపిస్తుంది. అమ్మా యామిని నువ్వు అడిగావని.. నీ మాట కాదనలేక.. నువ్వు ఏమైపోతావో అన్న భయంతో రామ్‌ను మోసం చేసి ఇలా నటించాను. కానీ ఇది కరెక్టు కాదేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు అంటాడు. దీంతో యామిని డాడ్ తను ఒప్పుకున్నాడు కదా..? ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి కానీ మీరు.. అంటుండగానే.. కాదమ్మా.. ఇలా మోసం చేసి పెళ్లి చేసినా కూడా రేపు నీతో ఉండాల్సింది రామ్. తనకు పొరపాటున ఇదంతా నాటకం అని తెలిసినా ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సింది నువ్వే అదే నా భయం అంటాడు. దీంతో యామిని డాడ్ మీరేం భయపడకండి రామ్‌తో పెళ్లి అయితే చాలు మిగతాది నేను చూసుకుంటాను అంటుంది.
మరోవైపు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన కావ్య వినాయకుడి ముందు నిలబడి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన రాజ్ కూడా కావ్యకు ఎదురుగా వచ్చి నిలబడి ఆలోచిస్తుంటాడు. రాజ్‌ను చూసిన కావ్య దగ్గరకు వెళ్లబోయి డాక్టర్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. ఇంతలో అప్పు వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అక్కా అని అడగ్గానే కావ్య, రాజ్‌ను చూపిస్తుంది. రాజ్ ను చూసిన అప్పు షాకింగ్‌గా హ్యాపీగా ఫీలవుతుంది. బావ కనిపిస్తున్నా ఇంకా ఆలోచిస్తున్నావేంటి అక్కా వెళ్లి బావను ఇంటికి పిలువు అని చెప్తుంది. కావ్య దగ్గరకు వెళ్లబోతుంటే.. యామిని పరుగున వచ్చి రాజ్‌ను హగ్ చేసుకుని థాంక్యూ బావా నువ్వు ఇంత త్వరగా పెళ్లికి ఒప్పుకుంటావని అనుకోలేదు అంటుంది. యామిని మాటలు విన్న కావ్య, అప్పు షాక్ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?