BigTV English
Advertisement

Brahmamudi Serial Today May 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: పార్టీకి బయలుదేరిన రాజ్‌ – కావ్యకు వార్నింగ్‌ ఇచ్చిన యామిని

Brahmamudi Serial Today May 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: పార్టీకి బయలుదేరిన రాజ్‌ – కావ్యకు వార్నింగ్‌ ఇచ్చిన యామిని

Brahmamudi serial today Episode: యామిని వెడ్డింగ్‌ కార్డ్స్‌ ఇవ్వగానే.. వాటిని చూస్తూ.. రాజ్‌ అలాగే ఉండిపోతాడు. దీంతో యామిని ఎందుకు బావ అలా ఉన్నావు అని అడుగుతుంది. దీంతో ఏమీ లేదని కొంచెం హెడేక్‌గా ఉందని చెప్తాడు. మామూలు హెడేక్‌ అయితే టాబ్లెట్‌ వేసుకుంటే పోతుంది కానీ నా వల్లే హెడేక్‌ వస్తే అది తగ్గదు బావ అంటుంది యామిని. ఎందుకు అలా మాట్లాడుతున్నావు.. ఇప్పుడు ఏమైందని అని అడుగుతాడు రాజ్‌. దీంతో కొద్ది రోజులుగా నీ ప్రవర్తలో ఏదో తేడగా ఉంది బావ. నీ మనసులో ఏముందో మన పెళ్లి గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలియదు బావ కానీ ఒక్కటి మాత్రం నిజం నువ్వే నా జీవితం.. నువ్వు లేకపోతే నా జీవితమే లేదు అంటూ వెళ్లిపోతుంది.


మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటారు. ఆ రుద్రాణికి ఎట్టి పరిస్థితుల్లో రాజ్‌ గురించి నిజం తెలియకూడదు.. ఇక రాజ్‌కు గతం గుర్తు వచ్చే వరకు మనం ఆగకూడదు. అసలే ఆ యామిని పెళ్లి అంటుంది అని అపర్ణ చెప్పగానే.. కావ్య ఆ యామిని తొందర పడ్డట్టు మనం పడలేం అత్తయ్యా అని చెప్తుంది. దీంతో కళ్యాణ్‌ అలా అని ఊరుకుంటే కూడా తప్పే అవుతుంది కదా వదిన. పెద్దమ్మ చెప్పింది కూడా నిజం అన్నయ్యకు గతం గుర్తుకు వచ్చేలా మనం ఏమైనా చేస్తే బాగుంటుంది అంటాడు. అలా చేయాలని నాకు మాత్రం లేదా కవిగారు. ఎప్పుడొప్పుడు ఆయనకు గతం గుర్తుకు వస్తుందా..? ఎప్పుడెప్పుడు ఆయన్ని ఇంటికి తీసుకురావాలా..? అని ఎదురు చూస్తున్నాను అంటుంది కావ్య.

అయితే వాడంతట వాడే గతం గుర్తు చేసుకుంటే సమస్య అవుతుంది. కానీ వాడి చుట్టు అలాంటి పరిస్థితులు మనం తీసుకురాగలితే వాడికి తప్పకుండా గతం గుర్తుకు వస్తుంది కదా అంటుంది అపర్ణ. దీంతో కావ్య మీరేం అంటున్నారో నాకు అర్థం కావడం లేదు అత్తయ్యా అంటుంది. గతంలో మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు వాడి చుట్టు మళ్లీ జరిగేలా చేస్తే… అని అపర్ణ చెప్పగానే.. ఈ ఐడియా ఏదో బాగుంది కావ్య అంటుంది స్వప్న. రాజ్‌కు ఎటువంటి డేంజర్‌ లేకుండా దీన్ని మనం ఫాలో అవ్వచ్చు అంటుంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు కావ్య అని అపర్ణ అడగ్గానే.. మీరన్నట్టు నాకు ధైర్యం రావడం లేదు అత్తయ్య అంటూ భయపడుతుంది. మరేం చేద్దాం అని అందరూ అడగ్గానే.. నాకో ప్లాన్‌ ఉంది. ఆయన చిన్నప్పటి ఫ్రెండ్‌ సందీప్‌ వాళ్లది రేపు యానివర్సరీ అంట రిసార్ట్స్‌ లో పార్టీ ఇస్తున్నారు అందరినీ రమ్మని ఫోన్‌ చేశారు. టుడేస్‌ మనం అక్కడే ఉండొచ్చు దానికి మీ అన్నయ్యను అక్కడికి తీసుకురాగలిగితే మన ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుంది. అని చెప్పగానే అందరూ ప్లాన్‌ బాగుందని చెప్తారు. వెంటనే ఫోన్‌ చేసి రమ్మను అని అపర్ణ చెప్తుంది.


మరోవైపు వెడ్డింగ్‌ కార్డ్‌ పట్టుకుని కూర్చుని ఆలోచిస్తుంటాడు. యామినితో పెళ్లి అంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. కళావతిని కలిసినప్పుడు కానీ తనతో మాట్లాడినప్పుడు వచ్చిన ఎగ్జైట్‌ మెంట్‌ యామినితో రావడం లేదు. రోజు కళావతి నా పక్కన లేకపోయినా రోజంతా తన గురించి ఆలోచిస్తున్నాను. నాకు మాత్రమే ఇలా అనిపిస్తుందా..? లేక కళావతి గారికి కూడా అలా అనిపిస్తుందా..? ఒకవేళ తనకు కూడా అలాగే అనిపిస్తుందంటే వీళ్లకు వీలైనంత త్వరగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి అనుకుంటాడు. వెంటనే తనతో మాట్లాడాలి అనుకుంటూ ఫోన్‌ చేస్తాడు. హాయ్‌ కళావతి గారు బిజీగా ఉన్నారా..? అని అడుగుతాడు. అవునండి నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్తుంది కావ్య. ఏంటండి అంత బిజీ అని రాజ్‌ అడగ్గానే.. నా ఫ్రెండ్‌ సందీప్‌ వెడ్డింగ్‌ యానివర్సరీ సందర్భంగా ఫ్రెండ్స్‌ అందరం గెట్‌ టు గెదర్‌ అవుతున్నాం.. అందరిని పిలవాలి కదా అందుకే బిజీగా ఉన్నాను అంటుంది. దీంతో రాజ్‌ మరి మీరు ముఖ్యమైన ఫ్రెండ్‌ను పిలవరా..? అని అడుగుతాడు. దీంతో కావ్య నాకు తెలియకుండా నా ముఖ్యమైన ఫ్రెండ్‌ ఎవరబ్బా అని అడుగుతుంది. రాజ్‌ నేనే కదా అంటూ నన్ను పిలవవా..? నేను కూడా మీతో పాటు పార్టీకి వస్తున్నాను. అని ఫోన్‌ కట్‌ చేస్తాడు. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రేపు రిసార్ట్‌ లో మొదలెడదాం మన నాటకం అని కళ్యాణ్‌ చెప్తాడు.

మరుసటి రోజు రాజ్‌ బ్యాగ్‌ సర్దుకుని రిసార్ట్‌కు వెళ్లిపోతుంటే యామిని వచ్చి ఏంటిది బావ ఎందుకు బ్యాగ్‌ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ అది చెప్పడం మర్చిపోయాను నేను బయటకు వెళ్తున్నాను. అని చెప్తాడు. దీంతో ఈరోజు మనిద్దరం వెళ్లి మన వెడ్డింగ్ కార్డ్స్‌ పంచుదామనుకున్నాం కదా అంటుంది. ఇప్పుడు మీరు బయటకు వెళితే పత్రికలు పంచడం లేట్‌ అవుతుంది బాబు అంటూ వైదేహి చెప్పగానే.. చెప్పగారు కానీ నా ప్రెండ్‌ వెడ్డింగ్‌ యానివర్సరీ పార్టీకి రమ్మన్నాడు అక్కడికే వెళ్తున్నాను అని రాజ్‌ చెప్పగానే.. నాకు తెలియకుండా నీకు ఫ్రెండ్స్‌ ఎవరు బావ. నీకు ఇన్విటేషన్‌ వస్తే.. నాకు రావాలి కదా అంటూ యామిని అడగ్గానే.. యామిని నన్ను అర్థం చేసుకో అంటూ రాజ్ వెళ్లిపోతాడు. రాజ్‌ వెళ్లిపోయాక ఇంతలా అబద్దం చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడు అని వైదేహి అడుగుతుంది. దీంతో కావ్య దగ్గరకు వెళ్తున్నాడు. అది తన మాటలతో బావను తనవైపు లాక్కుంటుంది. ఇప్పుడు ఇది కూడా అదే ప్లాన్‌ చేసింది. చెప్తాను దాని సంగతి అంటూ కావ్యకు ఫోన్‌ చేస్తుంది యామిని. ఎందుకిలా చేస్తున్నావు అంటూ అడుగుతుంది. దీంతో అది అడగాల్సింది నేను అని కావ్య చెప్తుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Big tv Kissik Talks: పృథ్వీతో లవ్ ఓపెన్ అయిన విష్ణు..నేను ఆ టైప్ కాదంటూ!

Big tv Kissik Talks: సుధీర్ లేకపోతే జీవితమే లేదు… విష్ణు ప్రియ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Kissik Talks Vishnu Priya: నన్నూ కమిట్మెంట్ అడిగారు.. మూడు బ్రేకప్‌లు అయ్యాయి.. డిప్రెషన్‌తో..

Kissik Talks Vishnu Priya: బెట్టింగ్‌ యాప్స్‌తో లగ్జరీ ఫ్లాట్లు, కార్లు.. ఆస్తులపై విష్ణు ప్రియ రియాక్షన్‌!

Kissik Talks Vishnu Priya: బిగ్‌ బాస్‌కి వెళ్లినందుకు చెప్పుతో కొట్టుకోవాలనిపిచ్చింది.. విష్ణు ప్రియ షాకింగ్‌ కామెంట్స్‌

Kissik Talks Vishnu Priya: ఆ యాంకర్లు నన్ను చూసి కుళ్లుకునేవారు.. అందుకే పోవే పోరాకు గుడ్ బై చెప్పా!

Illu Illalu Pillalu Today Episode: జైలు నుంచి ధీరజ్ రిలీజ్.. పండగ చేసుకున్న సేన, భద్ర.. కోడళ్ల పై రామరాజు ప్రశంసలు..

Intinti Ramayanam Today Episode: కూతురు కోసం వచ్చిన మీనాక్షి.. చక్రధర్ ను అవమానించిన పల్లవి.. నిజం బయటపడుతుందా..?

Big Stories

×