E-Paper
Advertisement

కోట్ల రూపాయల కార్లు కొనడంపై క్లారిటీ ఇచ్చిన అషు రెడ్డి..

కోట్ల రూపాయల కార్లు కొనడంపై క్లారిటీ ఇచ్చిన అషు రెడ్డి..
Advertisement

Ashu Reddy:సోషల్ మీడియాలో ఎప్పుడూ బోల్డ్ కామెంట్స్, గ్లామర్ ఫోటోలతో హల్‌చల్ చేసే అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టిక్‌టాక్‌తో పాపులర్ అయ్యి, బిగ్ బాస్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ లైఫ్‌స్టైల్‌పై నెటిజన్లకు ఎప్పుడూ బోలెడు సందేహాలు ఉంటాయి. సినిమాలు పెద్దగా చేయకపోయినా ఖరీదైన కార్లు, ఫారిన్ ట్రిప్‌లు ఎలా వేస్తుందని చాలామంది కామెంట్ చేస్తుంటారు. తాజాగా సుప్రీత హోస్ట్ చేస్తున్న పాడ్‌కాస్ట్ షోలో ఈ విషయంపై అషు రెడ్డి ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చింది. ఆ విశేషాలేంటో చూద్దాం.

సుప్రీత పాడ్‌కాస్ట్‌లో బోల్డ్ ప్రశ్నలు:

నటి సురేఖా వాణి కూతురు సుప్రిత కొత్తగా మొదలుపెట్టిన టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్‌కు అషు రెడ్డి గెస్ట్‌గా వచ్చింది. షో మొదలవ్వగానే సుప్రీత ఎలాంటి మొహమాటం లేకుండా, “ఇన్ని లగ్జరీ బ్యాగ్‌లు, ఫారిన్ ట్రిప్‌లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?” అని జనాల్లో ఉన్న డౌట్‌ను నేరుగా అడిగేసింది. నిజానికి ఇదే ప్రశ్న సుప్రీతకు కూడా సోషల్ మీడియాలో ఎదురవుతుంటుంది.

కోటి రూపాయల కారు వెనుక అసలు సీక్రెట్ ఇదే:

Advertisement

ఈ ప్రశ్నకు అషు రెడ్డి తనదైన స్టైల్లో గట్టి సమాధానం ఇచ్చింది. “జనాలు ఏమనుకుంటారంటే కోటి రూపాయల కారు కొన్నామంటే, ఆ కోటి రూపాయలు ఒకేసారి బ్యాగ్‌లో తీసుకెళ్లి కట్టేస్తాం అనుకుంటారు. కానీ అలా కాదు, ముందు ఐదు లేదా పది లక్షలు డౌన్ పేమెంట్ కట్టి, మిగిలిన అమౌంట్ నెలనెలా కట్టుకోవాలి. దానినే ఈఎంఐ అంటారు” అంటూ క్లారిటీ ఇచ్చింది.

21 ఏళ్లకే ఫస్ట్ కారు, ఆ బొమ్మ టాటూగా:

అంతేకాకుండా తన కష్టార్జితం గురించి చెబుతూ, తాను కేవలం 21 ఏళ్ల వయసులోనే తన మొదటి కారు కొనుక్కున్నానని అషు రెడ్డి తెలిపింది. ఆ కారుపై ఉన్న ఇష్టంతో దాని బొమ్మను తన చేతిపై టాటూగా కూడా వేయించుకున్నానని చూపించింది. తనకు అన్నీ ఉన్నాయని, తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని ఘాటుగా బదులిచ్చింది.

హరికి బైక్ కొనిచ్చినా ఒక్కసారి కూడా ఎక్కించుకోలేదు..:

Advertisement

ఇదే ఇంటర్వ్యూలో ఎక్స్‌ప్రెస్ హరితో తనకున్న స్నేహం గురించి కూడా అషు రెడ్డి ఓపెన్‌గా మాట్లాడింది. హరి తనకు చాలా మంచి ఫ్రెండ్ అని, అయితే ఇద్దరం తక్కువగా మాట్లాడుకుంటామని చెప్పింది. తాను హరికి ఒక బైక్ కొనిచ్చానని, కానీ ఇప్పటివరకు ఆ బైక్ మీద కనీసం ఒక్కసారి కూడా ఎక్కించుకోలేదని సరదాగా ఫిర్యాదు చేసింది. “పోనీ బైక్ ఇచ్చినందుకు ఒక్క రౌండ్ అయినా తిప్పురా అని అడిగినా నన్ను ఎక్కించుకోలేదు.. మరి ఎవరిని ఎక్కించుకుని తిరుగుతున్నావో తెలియదు కానీ హరి” అంటూ అషు రెడ్డి నవ్వుతూ చేసిన కామెంట్స్ చేసింది.

also read: సర్జరీ గురించి మొదటిసారి మాట్లాడిన అషు రెడ్డి!

ఈ ఇంటర్వ్యూలో కేవలం డబ్బు, కార్ల గురించే కాకుండా తనకు ఎదురైన హెల్త్ ఇష్యూస్, బ్రెయిన్ సర్జరీ సమయంలో పడిన నరకం, సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ థంబ్‌నెయిల్స్ గురించి కూడా అషు రెడ్డి ఎమోషనల్‌గా మాట్లాడింది. ఎప్పుడూ సరదాగా కనిపించే అషు రెడ్డి జీవితంలో ఇంత కష్టం ఉందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Related News

సర్జరీ గురించి మొదటిసారి మాట్లాడిన అషు రెడ్డి!

ఇదేనా పెద్దరికం.. సంస్కారం లేదా.. నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్!

అబ్బబ్బా.. ఏం పాటరా బాబు! ఈశ్వర్ సాయి, మధురి రాథోడ్ రచ్చ!

వచ్చే ఏడాది పెళ్లి.. బిగ్ బాంబ్ పేల్చిన సుప్రీత!

అలీ వైఫ్ జుబేదా యూట్యూబ్ ఆదాయం ఎంతో తెలుసా?

వెయిటింగ్ ఈజ్ ఓవర్.. వెండితెరపై కలుద్దాం: యాంకర్ శివ జ్యోతి!

సుదీర్ లక్షలు సంపాదిస్తున్న రూపాయి కూడా లేదా?అంతా అతని చేతుల్లోనే ?

Big Stories

Advertisement
×