E-Paper
Advertisement

డబ్బులు ఇవ్వలేదని గరుడ పురాణం శిక్ష.. బాధితుడి పరిస్థితి ఏంటి? నెల్లూరులో షాకింగ్ ఘటన

డబ్బులు ఇవ్వలేదని గరుడ పురాణం శిక్ష.. బాధితుడి పరిస్థితి ఏంటి? నెల్లూరులో షాకింగ్ ఘటన
Advertisement

Nellore: సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందులో మంచి-చెడుల గురించి ఉంది. ప్రజలు మంచి జీవితాలను ఎలా గడపాలి అనేది సూచిస్తుంది. గరుడ పురాణం ప్రకారం.. మనుషులు చేసే పాపాలకు ఎలాంటి శిక్షలు పడుతాయో చెబుతుంది. అలాంటి శిక్ష అమలు చేసింది ఓ మహిళ. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో బయటపడింది.

నెల్లూరులో షాకింగ్ ఘటన

పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లాలో షాకింగ్ ఘటన బయట పడింది. మాదరాజు గూడూరు ప్రాంతానికి చెందిన శీనయ్య, ఆ గ్రామానికి చెందిన హసీనా వద్ద రూ.500 అప్పు తీసుకున్నాడు. హసీనా టిఫిన్ సెంటర్‌కు వచ్చిన శీనయ్య టిఫిన్ చేశాడు. ఈ క్రమంలో గతంలో తనకు ఇవ్వాల్సిన రూ.500 బాకీ ప్రస్తావన తెచ్చింది హనీసా. వాటిని ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నావని ప్రశ్నించింది.

డబ్బులు ఇవ్వలేదని బాధితుడికి గరుడ పురాణం శిక్ష

Advertisement

ఆ బాకీకి సంబంధించి నేను మీ ఇంట్లో పని చేశానని, నేను ఇవ్వాల్సిన డబ్బులకు చెల్లుబాటు అయిందన్నాడు. ఈ విషయంలో హసీనా-శీనయ్య మధ్య గొడవ కాస్త తారాస్థాయికి చేరింది.  అప్పు తీరిపోయిందని సదరు వ్యక్తి చెబుతుండగా, లేదని డబ్బులు ఇచ్చిన మహిళ చెబుతోంది. ఇద్దరి మధ్య వాగ్వాదం నేపథ్యంలో క్షణికావేశానికి గురైన సదరు మహిళ, డబ్బు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తిపై మరిగిన వేడి నూనె పోసింది.

ALSO READ: రాప్తాడు ఎన్‌కౌంటర్ కేసు.. హైకోర్టులో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!

Advertisement

బాధితుడు శీనయ్య శరీరంపై 30 శాతం తీవ్రగాయాలు కావడంతో ఒక్కసారిగా కేకలు వేశాడు. వాటిని విన్న స్థానికులు, అతడ్ని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తాను ఇప్పటికే ఆమె ఇంటి వద్ద పని చేసి అప్పును చెల్లించానని బాధితుడు శీనయ్య చెబుతున్నాడు.

ఘటన గురించి తెలియగానే నెల్లూరు రూరల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించి సదరు మహిళ హసీనాపై హత్యాతయ్నం కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.  కేవలం రూ.500 కోసం జరిగిన ఘటనలో గరుడ పురాణం శిక్షను గుర్తు చేస్తుందని స్థానికులు చెబుతున్నారు.

Related News

విశాఖ సీఐఐ సదస్సు సర్వం సిద్ధం.. 58 దేశాల నుంచి ప్రతినిధులు, సాయంత్రం హోంమంత్రి అమిత్ షా రాక

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఏపీ ప్రజలకు పండగ కానుక, మూడు నెలలపాటు అందుబాటులో

రాప్తాడు ఎన్‌కౌంటర్ కేసు.. హైకోర్టులో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!

కిర్లంపూడి పీఎస్‌లో అంబటి రాంబాబు.. పవన్ కళ్యాణ్ విడాకులపై ఎమన్నారంటే?

ఏపీ ఎంపీపీ, జడ్పీ అధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన అన్నపరెడ్డి.. జగన్ తీరుపై తీవ్ర విమర్శలు!

ఏపీ రాజకీయాల్లో న్యూ ట్రెండ్.. పవన్ విడాకుల వేళ, బాబు-జగన్ సీరియస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×