Nindu Noorella Saavasam Serial Today Episode : ఇంట్లో మిస్సమ్మ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకే నువ్వు వెంటనే వెళ్లి మిస్సమ్మను తీసుకురావాలని శివరాం ఆవేశంగా అమర్ కు చెప్తాడు. దీంతో అమర్ నేను వెళ్లను కానీ అమ్మ మీరు వెళ్లి తీసుకురండి అని చెప్తాడు అమర్. ఇంట్లోంచి పంపించింది నువ్వు. నువ్వు వెళ్తే బాగుంటుందని శివరాం చెప్తాడు. కింద నుంచి అంతా వింటున్న మనోహరి ఎలాగైనా అమర్ మిస్సమ్మ ను తీసుకురావడానిక వెళ్లకుండా ఆపాలని పరుగెత్తుకుంటూ పైకి వెళ్తుంది మనోహరి. కాలు జారి కింద పడినట్టు నటిస్తూ నొప్పిగా ఉందని ఏడుస్తుంది.
అమర్, మనోహరిని రూంలోకి తీసుకెళ్తాడు. వెనకే వెళ్లిన ఆరు, గుప్త ఈ ఘోరం నేను చూడలేనని వెళ్లిపోతడు. ఆరు మాత్రం మనోహరిని తిట్టుకుంటూ అక్కడే ఉంటుంది. పెయిన్ ఎక్కువగా ఉంది అమర్ నొప్పి భరించలేకపోతున్నాను అంటూ ఏడుస్తుంది మనోహరి. అయితే డాక్టర్ కు కాల్ చేస్తాను ఉండు మనోహరి అంటూ అమర్ కాల్ చేయబోతుంటే.. ఆమర్ ఆగు ఇంత చిన్న దెబ్బకు డాక్టర్ ఎందుకు..? పెయిన్ కిల్లర్ ఆయిట్‌మెంట్ రాసుకుంటే సరిపోతుంది. కదా..? అంటుంది మనోహరి. దీంతో అమర్ చిన్న దెబ్బ ఏంటి మనోహరి నడవలేకపోతున్నావు కదా..? ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకూడదు అంటూ కాల్ చేయబోతుంటే.. అమర్‌ను ఆపి.. అయ్యో అమర్ పర్వాలేదు. ఒకసారి పెయిన్ కిల్లర్ ఆయిట్‌మెంట్ రాసి చూద్దాం అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్ కు కాల్ చేద్దాం అని చెప్పగానే సరే అంటూ అమర్ ఆయిట్‌మెంట్ తీసుకొస్తాను అని బయటకు వెళ్తాడు.
అమర్ వెళ్లిపోగానే మనోహరి సంతోషంగా అయ్యో మను నీకు మంచి టైం వచ్చిందే అనుకుంటూ ఇదే అదనుగా అమర్ లో ప్రేమ పుట్టేలా చేయాలి అనుకుంటుంది. అక్కడే ఉండి అంతా గమనిస్తున్న ఆరు మాత్రం మనోహరిని తిడుతూ ఒసే మను వద్దే ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నావు అంటూ నీ చెప్తా ఉండు అని మనోమరి కాలు పట్టుకుని విరగొట్టడానికి ప్రయత్నింస్తుంది. దీంతో మనోహరి గట్టిగా అరుస్తూ .. ఒసేయ్ ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు అర్తం అయింది. అటూ తిడుతుంది. ఇంతలో ఆయిట్‌మెంట్ తీసుకుని అమర్ వస్తాడు. అమర్ తన చేతితో మనోహరి కాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. ఆరు కాలును విరగొట్టినట్టు చేస్తుంది. దీంతో మనోహరి గట్టిగా అరుస్తూ అమర్ ఆయిట్ మెంట్ నాకు ఇవ్వు నేను రాసుకుంటాను అని అడుగుతుంది. అమర్ ఆయిట్‌మెంట్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆరు కూడా అక్కడి నుంచి బయటకు వెళ్తుంది.
మిస్సమ్మతో ఫోన్ మాట్లాడుతూ వస్తుంది కరుణ. లోపలికి రాగానే స్కూటీ దిగి వీడియో కాల్ ఆన్ చేసి ఒసే మిస్సమ్మ మీ ఆయన్ని తలుచుకుంటేనే నాకు భయంగా ఉందే.. నీ మీదే అంత అరిచివాడు నన్ను కరుస్తాడేమోనే.. అంటుంది.ఇంతలో ఇంట్లోంచి బయటకు వస్తున్న ఆరును వీడియో కాల్ లో చూస్తుంది మిస్సమ్మ. అరే అక్క వచ్చింది అని కరుణను కెమెరా సరిగ్గా పెట్టమని చెప్తుంది. అక్క ఎక్కడుందని కరుణ అడుగుతుంది. అదిగో నీకు ఎదురుగా ఉంది కదా..? నువ్వు కెమెరా సరిగ్గా పెట్టవే అంటూ మిస్సమ్మ కోపంగా కరుణను తిడుతుంది. ఇంతలో గుప్త, ఆరు దగ్గరకు వెళ్లి ఆక్కడా ఆ బాలిక తన చరవాణిలో నిన్ను మిస్సమ్మకు చూపిస్తుంది. అని చెప్పగానే ఆరు కంగారుగా పక్కకు వెళ్లిపోతుంది. ఇంతలో కరుణ కూడా మిస్సమ్మను తిడుతూ.. అక్క ఎక్కడుందే.. చూడు మీ ఆయన్ని చూపించాలా..? పక్కంటి వాళ్లను చూపించాలా నీకు అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ లేదు మా ఆయన్నే చూపించి అని చెప్పగానే కరుణ లోపలికి వెళ్తుంది.
కరుణ లోపలికి వెళ్లితే హాల్ లో ఎవ్వరూ కనిపించరు. దీంతో కరుణ భయంగా అటూ ఇటూ చూస్తుంది. ఇంతలో శివరాం వచ్చి కరుణను పలకరించి పాపం మిస్సమ్మ కోసం వచ్చినట్టు ఉంది. ఇక్కడ జరిగిన విషయం తెలియదు అనుకుంటాను అని మనసులో అనుకుంటుంటే.. నాకు అంతా తెలుసు అంకుల్ ఇదిగో మిస్సమ్మ వీడియో కాల్ లో ఉంది అని చెప్తుంది కరుణ. దీంతో శివరాం, మిస్సమ్మను చూసి హ్యాపీగీ పలకరిస్తాడు. ఇంతలో అమర్ రావడం చూసి.. బాధగా ఇంకెక్కడి మిస్సమ్మ.. ఇక్కడి నుంచి ఎప్పుడో వెళ్లిపోయింది. తను ఈ ఇంటి కోసం ఎంత కష్టపడ్డా అందరూ కలిసి మిస్సమ్మను ఇంట్లోంచి తరిమేశారు అని బాధపడ్డట్టు నటిస్తుంటాడు. అమర్ దగ్గరకు వచ్చి నాన్నా ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ గద్దించగానే కరుణ భయపడిపోతుంది. ఇంతలో వీడియోలో అమర్ ను చూసి మిస్సమ్మ ఎమోషనల్ అవుతుంది. అమర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. శివరాం మాత్రం ఈ దెబ్బతో మా అబ్బాయి వెళ్లి మిస్సమ్మను తీసుకొస్తాడు అని రాథోడ్, కరుణకు చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.