E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode November 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌, మిస్సమ్మ షాపింగ్‌ మాల్‌లో పార్థును చూస్తారా..?   

Nindu Noorella Saavasam Serial Today Episode November 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌, మిస్సమ్మ షాపింగ్‌ మాల్‌లో పార్థును చూస్తారా..?   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ ఫ్యామిలీతో కలిసి దీపావళి పండగ షాపింగ్‌ చేయడానికి మాల్‌కు వెళ్తాడు. రామ్మూర్తి, మంగళను కూడా అదే షాపింగ్‌ మాల్‌కు రమ్మని చెప్తాడు. రామ్మూర్తి, మంగళ ఇద్దరూ వెళ్తూ పార్థును కూడా తమతో పాటు తీసుకెళ్తారు. ముగ్గురు కలిసి క్యాబ్‌లో వెళ్తుంటే.. షాపింగ్‌ మాల్‌ దగ్గర ఎదురుచూస్తున్న అమర్‌, రామ్మూర్తికి కాల్‌ చేస్తాడు. రామ్మూర్తి దారిలో ఉన్నామని చెప్తాడు.

అప్పుడే షాపింగ్‌ మాల్‌కు వచ్చిన ఎస్సై, అమర్‌ను చూసి దగ్గరకు వెళ్లి పలకరిస్తాడు. మనోహరి, చంభా పోలీస్‌ కంట్రోల్‌ రూంకు వచ్చారని ఏదో చైన్‌ పోయిందని సీసీటీవీ ఫుటేజీ కావాలని అడిగారని చెప్తాడు. చూపించారా..? అని అమర్‌ అడిగితే.. మీరు చెప్పాక చూపించాము సార్‌ ఇతకీ ఆ చైన్‌ దొరికిందా అని ఎస్సై అడిగితే.. లేదు దొరకలేదని అమర్‌ చెప్తాడు.  ఆ సీసీటీవీ పుటేజీలో ఒక వ్యక్తిని చూసి మీ పనిమనిషి భయంతో పరుగులు తీసింది సార్‌ అని ఎస్సై చెబితే.. ఎవరా వ్యక్తి అని అడుగుతూ మా పనిమనిషికి కాస్త కంగారు ఎక్కువ కొత్త వాళ్లను చూస్తే భయపడుతుంది అంటూ అమర్‌ చెప్తాడు. తర్వాత ఎస్సై వెళ్లిపోతాడు.

Advertisement

రామ్మూర్తి వాళ్లు షాపింగ్‌ మాల్‌ ముందు ఆగి అటూ ఇటూ చూస్తారు. ఎవ్వరూ కనిపించకపోయే సరికి ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు. లోపల చూస్తారు. ఎక్కడా అమర్‌ వాళ్లు కనిపించరు. మంగళ అనుమానంగా వాళ్లు చెప్పింది ఇదేనా..? లేక వేరే ఏదైనా చెప్పారా..? బయట లేరు.. లోపల లేరు.. అంటూ చిరాకు పడుతుంది. ఇదే షాపింగ్‌ మాల్‌ అని చెప్పారు.. ఉండు నువ్వు కంగారు పడకు నేను భాగీకి ఫోన్‌ చేస్తాను అంటూ మిస్సమ్మకు  కాల్‌ చేస్తాడు రామ్మూర్తి. ఫోన్‌ లిఫ్ట్ చేసిన మిస్సమ్మ ఎక్కడున్నారని రామ్మూర్తిని అడుగుతుంది. షాపింగ్‌ మాల్‌లోనే ఉన్నామని రామ్మూర్తి చెబితే.. మేము లోపలే ఎంట్రన్స్‌ దగ్గర ఉన్నామని మిస్సమ్మ చెప్తూ మీరు లోపల ఎక్కడున్నారు అని అడిగితే.. ఇక్కడ ఆడవాళ్ల బట్టలు ఉన్నాయమ్మా అని రామ్మూర్తి చెప్పగానే.. మిస్సమ్మ అయితే అక్కడే ఉండండి నాన్న మేము వస్తున్నాం అంటూ కాల్ కట్‌ చేసి అమర్‌ను తీసుకుని వెళ్తుంది.

కాల్‌ కట్‌ కాగారే.. రామ్మూర్తి మా అల్లుడు కూతురు వస్తున్నారు నీకు పరిచయం చేస్తాను బాబు అంటూ పార్థుకు చెబితే.. మంగళ తిడుతుంది. మొన్నోసారి వాళ్ల ఫోటోను చూసి స్పృహ తప్పి పడిపోయాడు.. మళ్లీ వాళ్లను పరిచయం చేస్తే మళ్లీ స్పృహ తప్పి పడిపోతే ఇది ఇల్లు కాదు.. అంటుంది మంగళ. ఎందుకు పడిపోతాడే అని రామ్మూర్తి అడిగితే.. ఈ బాబు ఎవరిని చూసిన అలాగే పడిపోతున్నాడు.. ఏం పరిచయం చేయోద్దులే అంటుంది మంగళ. దీంతో రామ్మూర్తి మంగళను తిట్టి సేల్స్‌బాయ్‌ని పిలిచి పార్థుకు కావాల్సిన బట్టలు ఎక్కడున్నాయో చూపించమని పార్థును వెళ్లి బట్టలు తీసుకొమని చెప్తాడు. పార్థు ఏమీ వద్దులే అంటుంటే.. పండగ కదా బాబు.. మీ నాన్నే ఇప్పిస్తున్నాడు అనుకో తీసుకో వెళ్లి అని చెప్పగానే.. పార్థు సరే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. అప్పుడే అక్కడకు అమర్‌, మిస్సమ్మ వస్తారు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

బాలు గారి గొంతు పోలికతో ఫేమస్.. దైవిక్ పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ ఇదే!

కొడుకుని చూడగానే బోరున ఏడ్చేసిన సుదీర్ తల్లి.. నీతూ మాస్టర్ కు స్పెషల్ రిక్వెస్ట్..

అవినాష్ జీవితంలో ఇంత విషాదమా.. జీవితాంతం మరువలేని నరకం అంటూ!

బంపర్ ఆఫర్ కొట్టేసిన కావ్య.. అంతా సుధీర్ దయ?

ఏ దేవివరమో నీవు సీరియల్ మనీష్ సీరియల్స్ చేయకముందు ఏం చేసేవారో తెలుసా?

రామ్ ప్రసాద్ సీక్రెట్ బయటపెట్టిన అమ్మ!

క్యాన్సర్ బారిన పడ్డ బిగ్ బాస్ బ్యూటీ.. ఆరోగ్య పరిస్థితిపై వీడియో రిలీజ్!

Big Stories

Advertisement
×