E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఎక్స్ఫో లోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య 

Brahmamudi Serial Today Episode November 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఎక్స్ఫో లోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య 
Advertisement

Brahmamudi serial today Episode: ఐశ్వర్యకు ఇందు భోజనం తీసుకెళ్తే రాజు వద్దని చెప్తాడు. ఎంతో మంది గర్భిణీలు సరైన టైంకు ఫుడ్ దొరక్క కష్టాలు పడుతుంటారు. ఐశ్వర్య మాత్రం నీ మీద గెలిచేందుకు నువ్వు సంతకం చేసేందుకు తన బిడ్డ మీద పంతం పట్టుకుని కూర్చుంది. ఐశ్వర్య కడుపులో బిడ్డకు ఏం కాదు నువ్వు  ఆ భోజనం ఇటివ్వు అంటూ తీసుకుని ఇందును అక్కడి నుంచి పంపిచేస్తాడు రాజు.

మరుసటి రోజు ఇందు రెడీ అయి ఆఫీసుకు వెళ్తుంది. అపర్ణ వెళ్లి పిలుస్తుంది. నువ్వు టిఫిన్‌ చేయడం మర్చిపోయావు అంటూ పిలిస్తే.. టిఫిన్ చేయలేదు.. నాకు లేట్‌ అవుతుంది. అంటూ వెళ్లిపోతుంటే.. లక్కీ ఎదురుగా వస్తాడు. ఏమైంది లక్కీ చెప్పు అని ఇందు అడిగితే.. ఐషు ఏమీ తినలేదని చెప్తాడు లక్కీ. నాన్నమ్మ ఐషుఉక ఏమైనా పుల్లపుల్లగా చేసి పెట్టు అంటుంది ఇందు. అదేం లేదు రాత్రి నుంచి ఐషు నీ మీద అలిగి ఏమీ తినడం లేదు అంటాడు. అపర్ణ కోపంగా భోజనం మానేసి ఏమీ సాధించలేరు ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టడం తప్పా.. ఆకలి వేస్తే అదే వచ్చి తింటుందిలే ఇందు నువ్వు వెళ్లలే ఆలస్యం అవుతుంది అన్నావు కదా అని చెప్పగానే..

Advertisement

విన్నావుగా నా మీద అలిగి భోజనం మానేస్తే ఎవరికి నష్టం.. బిజినెస్‌లో పోటీ ఉండాలి కానీ పంతం ఉండకూడదు.. పంతంతో ఎంట్రీ సంపాదించుకోవచ్చు కానీ సక్సెస్‌ సంపాదించుకోలేరు అంటూ చెప్పగానే.. లక్కీ బాధగా తన కడుపులో ఉన్న బేబీ గురించి ఆలోచిస్తున్నాను.. తను అడిగినట్టు ఆ సంతకం ఏదో పెడితే సరిపోతుంది కదా అంటూ రిక్వెస్ట్‌ చేస్తాడు. అపర్ణ కోపంగా తిడుతూ లక్కీని పంపించి బేరాలు ఆడుతుంది అంటూ చెప్పగానే.. లక్కీ బాధగా ఒక సంతకం విలువ ఏంటో నాకు తెలియదు.. కానీ ఒక ప్రాణం విలువు తెలుసు అందుకే అడుగుతున్నాను అంటాడు. ఇందు ఆలోచనలో పడిపోతుంది.

ఎక్స్‌ఫోలో అన్ని కంపెనీలు తమ ప్రాడక్ట్‌ను రెడీ చేస్తుంటారు. ప్రశాంత్‌, రాజు ఇద్దరు తమ స్టాల్ ను రెడీ చేస్తుంటారు. అప్పుడే ఐశ్వర్య, పార్వతీశం ఎక్స్‌ఫోకు వస్తుంటారు. పార్వతీశం తన మాటలతో ఐశ్వర్యను ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. వెటకారంగా నాలుగు గోడల మధ్య కాళ్లు పట్టుకున్నా సంతకం అయితే సాధించారు అంటే ఐశ్వర్య కోపంగా తిడుతుంది. అప్పుడే అక్కడ ఉన్న రిసెప్షనిస్టు డీటెయిల్స్‌ చెప్పమని అడుగుతుంది. పార్వతీశం ఓవర్‌ బిల్డప్‌ ఇస్తే.. మీ డీటెయిల్స్‌ లిస్ట్‌లో లేదని మాకు ఇచ్చిన పేర్లు మాత్రమే లోపలికి ఎంట్రీ చేయించాలి అంటుంది. అందుకు ఐశ్వర్య ఆ రిసెప్షనిస్టును తిడుతుంది. ఇందు సంతకం చేసిన లెటర్‌ చూపిస్తుంది. రాజుతో క్రాస్‌ చెక్‌ చేసుకుంటానని రిసెష్పనిస్ట్ చెప్తే ఐశ్వర్య కోపంగా తిడుతుంది. పార్వతీశం కూల్‌ చేసి మీరు వెళ్లి చెక్‌ చేసుకోండి అని చెప్తాడు. రాజు వచ్చి ఇందుకు సంతకం పెట్టొద్దని నేను చెప్పి వచ్చాను. ఈ సంతకం మా ఇందుది కాదు.. మీ రూల్స్‌ ప్రకారం మీరు ఏం చేస్తారో అదే చేయండి అంటాడు.

Advertisement

రిసెప్షనిస్ట్‌ ఐశ్వర్యను పక్కకు తప్పుకోమని చెప్తుంది. ఐశ్వర్య కోపంగా తిడుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. రిసెప్షనిస్ట్‌ కోపంగా ఐశ్వర్యను తోసేస్తుంది. కింద పడబోతున్న ఐశ్వర్యను ఇందు పట్టుకుంటుంది. ఇందు కోపంగా ఏం చేస్తున్నారు మీరు అంటూ వాళ్లను తిడుతుంది. మీ హస్బెండే ఆ సంతకం పోర్జరీ అని చెప్పాక మేము లోపలికి ఎలా పంపించగలం అంటుంది. ఈ సంతకం నేను చేస్తున్నట్టు మా హస్బెండ్‌కు తెలియదు. ఈ సంతకం చేసింది నేనే.. ఈరోజు ఎక్స్‌ఫోలో స్వరాజ్‌ గ్రూఫ్‌ ఆఫ్‌ కంపెనీతో పాటు నా సిస్టర్‌ ఐశ్వర్య కూడా పాల్గొంటుంది అని ఇందు చెప్పగానే.. రిసెప్షనిస్ట్‌ సారీ చెప్పి ఐశ్వర్యను లోపలికి వెళ్లమని చెప్తుంది. ఐశ్వర్య లోపలికి వెళ్తుంది. ఇందు వెళ్లి సారీ చెబితే.. నీ ప్లాన్‌ బాగా వర్కవుట్‌ అయింది కదా అంటూ తిడుతుంది. అసలు ఐడియా మీ ఇద్దరిలో ఎవరిది…? మీరు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు అంటూ తిడుతుంటే..

ఇందు నీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకు అంటే.. మరి నువ్వు సంతకం పెట్టినా సెక్యూరిటీతో రాజు ఎందుకు అబద్దం చెప్తాడు.. అంటూ తిడుతుంటే.. ఐశ్వర్యతో తాను మాట్లాడతనని రాజు అంటే. మీరిద్దరూ కలిసి ఆడిన పెద్ద డ్రామా అంటుంది ఐశ్వర్య. తర్వాత రాజు, ఇందు తమ స్టాల్‌ దగ్గరకు వెళ్తారు. ఐశ్వర్య తన స్టాల్‌ దగ్గరకు వెళ్తుంది. ఆ సంతకం నువ్వు చేయలేదు కదా ఫోర్జరీ అంటే ఐశ్వర్య పరువు పోతుందని అబద్దం చెప్తున్నావు కదా అంటే లేదు నేనే చేశాను సంతకం అని చెప్తుంది ఇందు. రాజు కోపంగా ఎందుకు చేశావు తను చేసిన ఫస్ట్‌ డీల్ లో ఎం చేసిందో తెలుసా..? అంటూ రాజు అంటే.. అన్ని గుర్తు ఉన్నాయి రాజు తనకు సెన్స్‌ లేదు మనకు ఉంది కదా వదిలేయ్‌ అంటుంది ఇందు. అయితే సంతకం ఎందుకు చేశావో చెప్పమని రాజు అడిగితే తాను సంతకం ఎందుకు చేసింది చెప్తుంది ఇందు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Yashmi Gowda: నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda Gudigantalu Balu : బాలు షాకింగ్ నిర్ణయం..? నిర్మాతలకు చుక్కలే…!

Gundeninda GudiGantalu Today episode: నిజం చెప్పేసిన శృతి.. పాపం మీనా.. ఇది కదా ట్విస్ట్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: షాపింగ్‌ మాల్‌లో పార్థు కోసం వెతుకుతున్న మనోహరి

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే…

రూ.2 వేలతో అర్ధరాత్రి ట్రైన్ ఎక్కి వచ్చేసా.. జబర్దస్త్ నటి కష్టాలు మామూలుగా లేవుగా!

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీ విద్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అదే నా అర్హత అంటూ!

Big Stories

Advertisement
×