Illu Illalu Pillalu Today Episode November 14th: రామరాజు షాప్ లోకి రాగానే ధీరజ్ నాన్న మీరు ఈ కుర్చీలో కూర్చోవాలి అని చెప్తాడు. కానీ ధీరజ్ మాత్రం రామ రాసిన కూర్చోబెట్టాలని అనుకుంటే రామరాజు మాత్రం ప్రేమని కూర్చోబెడితే బాగుంటుంది అని అనుకుంటాడు. ప్రేమ ఎప్పుడూ బాధపడకుండా చూసుకోవాలి నీకు ఏ కష్టం వచ్చినా నీ భార్యతో చెప్పుకోవాలి. జీవితాంతం నీకు తోడుండేది నీ భార్య కాబట్టి అది ఏ కష్టమైనా సరే నీ భార్యతో చెప్పాలి అని రామరాజు చెప్పగానే ధీరజ్ సరే నాన్న అని అంటాడు. ప్రేమ నువ్వు కూడా నీ భర్తని ఎప్పుడూ కష్టాల్లోకి నెట్టకుండా చూసుకోవాలి అని రామరాజు చెప్తాడు.. మొత్తానికి చైర్మన్ సీట్లు ప్రేమను కుచ్చుపట్టడంతో ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. అంతేకాదు భార్యలకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ గురించి చెప్పిన రామరాజుపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్ సీన్ అని చెప్పాలి..
ఇక పూజారి గారు అక్కడ పూజ చేసిన తర్వాత ఇంటి ఆడబిడ్డలు ముందుగా దీపం వెలిగించాలి అని చెప్పగానే కామాక్షి అలాగే అమూల్య ఇద్దరు కలిసి దీపాలు వెలిగిస్తారు. ఆ తర్వాత ఇంటి కోడలు వెలిగించాలి అని చెప్పగానే శ్రీవల్లి కోసం నర్మద వెయిట్ చేస్తుంది.. అయితే వల్లి రావడం చూసి నర్మద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చందు వల్లిని చూడకుండా ఉంటాడు మళ్ళీ లోపలికి రాగానే శుభమా అంటూ పూజ చేసుకుంటూ ఉంటే ఈ శ్రీవల్లిని ఎందుకు పిలిచావు అంటూ వేదవతి ఫైర్ అవుతుంది.. మీరు రామరాజు మాత్రం తన కోడలు కూడా ఉంటే బాగుంటుంది అని సంతోషంగా ఉంటాడు.. శ్రీవల్లి దీపం వెలిగిస్తూ ఉండగా చందు వచ్చి వల్లిని అడ్డుకుంటాడు. అంతేకాదు వల్లిని దారుణంగా అవమానిస్తాడు.
అసలు వల్లిని ఎవరు పిలిచారు ఎందుకు పిలిచారు కొంచెం కూడా బుద్ధి లేదా.. అసలు ఇది ఇక్కడికి వచ్చింది అంటే దరిద్రం మన నెత్తి మీద తాండవం చేస్తుందని అర్థం అయినా కూడా మీరు దీన్ని పిలిచారు ఎవరు పిలిచారు అసలు అని సీరియస్ అవుతాడు చందు. నర్మదా నేను పిలిచాను అని చెప్పే లోపలే ధీరజ్ నేనే పిలిచాను అన్నయ్య ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు కదా ఇప్పుడు వదిన కూడా ఉంటే బాగుంటుంది కదా అనేసి అనగానే ఎందుకు పిలిచావు రా నేను బాధపడడం నీకు అంత ఇష్టమా అని అయితే చందు ధీరజ్ పై అరుస్తాడు. ఇక శ్రీవల్లి నేను వెళ్ళిపోతాను అని చెప్తే శారదాంబ నువ్వు వెళ్లడానికి వీల్లేదు ఇది శుభకార్యం కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్తుంది.. ఆ మాట వినగానే మళ్లీ అక్కడే ఉండిపోతుంది.. పూజను పూర్తి చేస్తారు..
చందు బయట కూర్చుని బాధపడిపోతూ ఉంటాడు అసలు వల్లిని మళ్ళీ ఎందుకు ఇంట్లోకి రాణిస్తున్నారు అని ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటారు. బావ గారు నేను ఒక్క నిమిషం చెప్పేది వినండి అని నర్మదా ఎంతగా చెందుతూ మాట్లాడడానికి ప్రయత్నించిన సరే చందు మాత్రం ఆ వల్లి గురించి అయితే నాతో మాట్లాడుతున్నారు కదా అని అంటాడు. మీరు వల్లి అక్క గురించి తప్పుగా అనుకుంటున్నారు బావగారు. వల్లి అక్క ఇప్పుడు పూర్తిగా మారిపోయింది మీరు కూడా తన గురించి ఆలోచించండి అని ఎంతగా చెప్పిన సరే తన గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అని ఎందుకు చెప్తాడు. అయితే మళ్లీ చెన్ను మాటలు విని బాధ పడిపోతుంది. నువ్వేం బాధపడకువల్లి అక్క చందు బావ పూర్తిగా మారిపోతాడు ఏదో ఒక రోజు నీ గురించి తెలుసుకొని నిన్ను దగ్గరికి రానిస్తాడు అని నర్మదా అంటుంది.
ప్రేమ ట్రావెల్ ఓనర్ గా ఉంటుంది అయితే ఇద్దరు భార్యాభర్తలు కలిసి పూజ చేయాలని అనుకుంటారు. ఇక పూజ చాలా సంతోషంగా పూర్తి చేస్తారు ఈ క్రమంలో రామరాజు ఇది నా మొదటి బోని అనుకొని ప్రేమకి ఆ డబ్బులు ఇవ్వమని చెప్తాడు. భార్య తర్వాతే ఎవరైనా కానీ ముందు ఈ బోనీ డబ్బులు నువ్వు ప్రేమకి ఇవ్వు. ముందు నీ భార్యని నువ్వు నమ్మాలి నీ భార్య చేతిలోనే నువ్వు వచ్చిన సంపాదనని పెట్టాలి అప్పుడే నీ జీవితం ముందుకు సాగుతుంది అని రామరాజు భార్యాభర్తల బంధం గురించి గొప్పగా చెప్తాడు. ఇక ప్రేమకి రామరాజు ఇచ్చిన డబ్బులను ధీరజ్ ఇస్తాడు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా తన భర్త భార్యకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో అని సంతోషంగా ఉంటారు. ఇప్పుడే రౌడీలు వచ్చి ఇక్కడ మాకు మామూలు ఇవ్వాలని రచ్చ రచ్చ చేస్తారు. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: రమ్య దెబ్బకు షాక్.. పాపం ప్రణతి.. రమ్యకు అన్యాయం..?