E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode November 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: షాపింగ్‌ మాల్‌లో పార్థు కోసం వెతుకుతున్న మనోహరి

Nindu Noorella Saavasam Serial Today Episode November 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: షాపింగ్‌ మాల్‌లో పార్థు కోసం వెతుకుతున్న మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  పండుగ షాపింగ్‌ కోసం అమర్‌ ఫ్యామిలీతో పాటు పార్థు, ట్రాఫిక్‌ కంట్రోల్ రూం ఎస్సై రామ్మూర్తి అందరూ ఒకే షాపింగ్‌ మాల్‌లో ఉంటారు. ఎవరికి నచ్చింది వాళ్లు తీసుకుంటుంటారు. అప్పుడే మనోహరి ఇంకో సెక్షన్‌లోకి వెళ్లిపోతుంటే.. ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం ఎస్సై ఎదురుపడతాడు. మనోహరి షాక్‌ అవుతుంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు..? మీకు ఇంతకు ముందే చెప్పాను కదా మేము షాపింగ్‌కు వెళ్తున్నాము తిరిగి వచ్చాక ఎంక్వైరీకి రమ్మని మేము ఎక్కడికి వెళితే అక్కడకు వచ్చేస్తారా.. అయినా నేను చెప్పాను కదా ఇంటికి రమ్మని మళ్లీ ఇక్కడకు ఎందుకు వచ్చారు అని మనోహరి  ప్రశ్నిస్తుంది.

అదేంటి మేడం నేను షాపింగ్‌కు వచ్చాను మీరేమో ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు మీ నెంబరే నా దగ్గర లేదు నేను మీకు ఫోన్‌ చేయడం ఏంటి..? అసలు మీరు కేసు కూడా ఫైల్‌ చేయలేదు కదా..? మీ చైన్‌ మీరే వెతుక్కుంటానని చెప్పారు.. ఇక ఎంక్వైరీ ఏముంటుంది అని ఎస్సై చెప్పగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. అంటే నేను కంట్రోల్‌ రూంకి వెళ్లింది రాథోడ్‌కు తెలుసు.. రాథోడ్‌, భాగీకి చెప్పి ఉంటాడు. అందుకే ఈ ఫోన్‌, ఎంక్వైరీ నాటకం ఆడారు అన్నమాట అని మనసులో అనుకుంటుంది. అప్పుడే ఎస్సై, మనోహరికి డబుల్‌ షాక్‌ ఇస్తాడు. పార్థు గురించి చెప్పి అతన్ని నేను ఇదే షాపింగ్‌ మాల్లో చూశాను అంటాడు. ఎస్సై మాటలకు మనోహరి కాళ్ల కింద భూకంపం వచ్చినట్టు ఫీలవుతుంది.

Advertisement

ఏంటి సార్‌ మీరు చెప్పేది ఎవరిని చూశారు అంటూ క్లారిటీ కోసం మళ్లీ అడుగుతుంది. అదేనండి సీసీటీవీ ఫుటేజీలో మీ పనిమనిషి ఎవరో వ్యక్తిని చూసి భయపడి పారిపోయింది కదా ఆ వ్యక్తిని నేను ఇదే షాపింగ్ మాల్‌లో చూశాను. అతన్ని చూసినప్పుడు నాకు గుర్తుకు రాలేదు.. అదే విషయం అతనికి చెబితే.. ఎక్కడ చూశారని అడిగారు.. నాకు గుర్తుకు రాలేదు.. ఆయన లాగా నాకు మెమెరీ లాస్ అయిందేమో.. ఈసారి ఆయన ఎదురుపడితే చెప్తాను .. ఎక్కడ చూసింది అనుకుంటూ ఎస్సై వెళ్లిపోతాడు. మనోహరి మాత్రం కంగారు పడుతుంది. అందరూ ఇదే షాపింగ్‌ మాల్‌లో ఉన్నారు. ఎవరికీ పార్థు కనిపించనా నా పని అయిపోతుంది. చచ్చాడు అనుకున్న పార్థు తిరిగి వచ్చి నాకు చావు తెప్పించేలా ఉన్నాడు అని మనోహరి అనుకుంటూ ఇప్పుడు పార్థును వెంటనే వెతికి పట్టుకోవాలి అనుకుంటూ వెళ్తుంది.

మంగళ కాస్లీ చీర తీసుకుంటుంటే.. రామ్మూర్తి వెళ్లి మన తాహత్తుకు తగ్గట్టు తీసుకో అని చెప్తాడు. అల్లుడు గారు, భాగీ ఎంత రేటు అయినా సరే మంచి చీర తీసుకొమన్నారు అంటూ మంగళ చెబితే.. వాళ్లు అలాగే చెప్తారు కానీ నీ రేంజ్‌ కు ఈ చీర చాలు అంటాడు రామ్మూర్తి. అది చూసిన మంగల ఇది ఆరు వందలేనండి ఇది చూడండి పదివేలు అంటుంది. అందుకే ఇది తీసుకో అంటాడు రామ్మూర్తి. మంగళ కోపంగా బిల్లు మీరు కడుతున్నారా..? అల్లుడు గారే కదా కడుతున్నారు అంటే చెప్పింది చెయ్యవే అంటూ కోపంగా తిడతాడు రామ్మూర్తి.

Advertisement

అక్కడే ఉండి అంతా గమనిస్తున్న అమర్‌ అత్తయ్యగారికి నచ్చిందే తీసుకోనివ్వండి మామయ్య అని చెబితే.. తనకు అదే నచ్చిందట బాబు.. నేను మాత్రం ఇదిగో ఇది తీసుకోమన్నాను  అంటూ చెప్తాడు. అప్పుడే ఒక చీర తీసుకుని మిస్సమ్మ వచ్చి అమర్‌కు చూపిస్తూ.. ఏవండి మీరు సెలెక్ట్‌ చేసిన ఈ చీర కట్టుకుని చూశాను చాలా బాగుందండి అంటుంది. మరోవైపు మనోహరి, పార్థు కోసం వెతుకుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే…

రూ.2 వేలతో అర్ధరాత్రి ట్రైన్ ఎక్కి వచ్చేసా.. జబర్దస్త్ నటి కష్టాలు మామూలుగా లేవుగా!

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీ విద్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అదే నా అర్హత అంటూ!

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్… 3 అపార్ట్మెంట్లు కొన్న బాబు?

జబర్దస్త్ లో దర్శనమిచ్చిన ‘అగ్నిపరీక్ష’ రాజకుమారి!

నాగవ్వ పాట..వైష్ణవి సోనీ డ్యాన్స్.. ఫోక్ లవర్స్‌కు పూనకాలే!

బైక్ కాదు బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ అడగాల్సింది.. ఒక్క హిట్ కే రేంజ్ మార్చిన జబర్దస్త్ బాబు!

Big Stories

Advertisement
×