Big Tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం వెండి తెరపై సినిమా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో ఒకప్పుడు కేవలం అబ్బాయిలు మాత్రమే ఉండేవారు అమ్మాయిల పాత్రలలో కూడా అబ్బాయిలే లేడీ గెటప్స్ వేస్తూ నటించేవారు కానీ ఇటీవల కాలంలో లేడీ కమెడియన్స్ కూడా జబర్దస్త్ వేదికపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీవిద్య ఒకరు.
జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్న ఈమె ఇటీవల బాబు డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Least Eligible Bachelor) సిరీస్ లో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సిరీస్ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా శ్రీవిద్య కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన స్వస్థలం గురించి తన కెరియర్లో ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిపారు. విజయవాడకు చెందిన శ్రీవిద్య (Sri Vidya)బిటెక్ పూర్తి చేసి ఇంస్టాగ్రామ్ వీడియోలు చేస్తూ ఉండేవారు అయితే ఈమె రీల్స్ చూసి జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం రావడంతో హైదరాబాద్ వచ్చేసానని తెలిపారు.
ఇంట్లో ఉన్న 2000 తీసుకుని అర్ధరాత్రి ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసానని తెలిపారు. దారిలోనే 500 పోగొట్టుకున్నానని, తనకు హైదరాబాద్లో ఎవరు కూడా తెలియదు, ఇక్కడికి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డానని ఈమె తెలిపారు. ఇలా తాను హైదరాబాదులో ఉండడంతో ఊర్లో మా అమ్మను చాలామంది చాలా రకాలుగా బాధపెట్టారని శ్రీవిద్య గుర్తు చేసుకున్నారు. తండ్రి లేని పిల్లని అలా హైదరాబాదులో పెట్టారు అక్కడ ఏం చేస్తుందో. ఎక్కడ తిరుగుతుందో ఎవరికి తెలుసంటూ మాట్లాడుతూ బాధపెట్టారని శ్రీవిద్య తెలిపారు.
ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన ఫ్యామిలీ గురించి అలాగే ఇండస్ట్రీలో పడిన కష్టాల గురించి కూడా ప్రస్తావించారని తెలుస్తుంది. అయితే ఎలాంటి విషయాల గురించి ఇంకా శ్రీవిద్య మాట్లాడారనేది తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవిద్యతో పాటు జబర్దస్త్ బాబు (Jabardasth Babu) కూడా పాల్గొనే సందడి చేశారు. ఇక బాబు సైతం ఆయన ఇండస్ట్రీలో సక్సెస్ కోసం పడిన ఇబ్బందుల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారని తెలుస్తోంది.
Also Read: ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..