Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థును వెతుక్కుంటూ వెల్లిన మనోహరికి జెంట్స్ సెక్షన్‌లో పార్థు కనిపిస్తాడు. కోపంతో రగిలిపోతున్న మనోహరి పార్థును మళ్లీ చంపేస్తుందా అన్నట్టుగా చూస్తూ దగ్గరకు వెళ్లబోతుంది. అయితే మనోహరి, పార్థు కోసం వెతుకుంతుందన్న విషయం తెలుసుకున్న మిస్సమ్మ, రాథోడ్ ఇద్దరూ కలిసి సీసీటీవీ ఆపరేటర్ దగ్గరకు వెళ్లి పార్థు ఉన్న సెక్షన్ తెలుసుకుంటారు. పార్థు వెనకే కోపంగా పార్థుకు దగ్గరకు వెళ్తున్న మనోహరిని చూసి షాక్ అవుతారు. రాథోడ్ భయంతో వణికిపోతూ.. మిస్సమ్మ. ఆ మనోహరి పార్థు సార్‌ను మళ్లీ ఏదో చేయబోతుంది అంటాడు.
మనోహరి దగ్గరకు వెళ్లే లోపే అమర్ వస్తాడు. ఏంటి మనోహరి జెంట్స్ సెక్షన్‌లో ఉన్నావు అని అడిగితే.. నా షాపింగ్ అయిపోయింది అమర్ మీరు ఇక్కడున్నారేమోనని వచ్చాను అంటూ అమర్‌కు పార్థు కనిపించకుండా ఉండేదుకు అడ్డుగా నిలబడుతుంది. అమర్ కూడా తమ షాపింగ్ అయిపోయిందని అందరూ బిల్లింగ్ దగ్గర ఉన్నారని తాను మాత్రం మనోహరిని వెతుక్కుంటూ వచ్చినట్టు చెప్తాడు. మనోహరిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అంతా సీసీటీవీలో గమనిస్తున్న రాథోడ్, మిస్సమ్మ హ్యాపీగా ఫీలవుతారు. పార్థు గారు మనోహరి నుంచి తప్పించుకున్నారు. ఇక మనోహరికి పార్థు గారు దొరక్కుండా చూడాలని అంటూ రాథోడ్‌ను తీసుకుని బయటకు వెళ్తుంది.
బిల్లింగ్ దగ్గర ఆనంద్, ఆకాష్ బిల్స్ వేయిస్తుంటారు. రామ్మూర్తి, మంగళ వెళ్లి తమ బట్టలకు బిల్స్ వేయించమని ఇస్తారు. అమర్, మనోహరి వస్తారు. బిల్స్ అయ్యాయా అని అమర్ అడిగితే.. వేయిస్తున్నామని ఆనంద్ చెప్తాడు. మిస్సమ్మ వాళ్లు ఎక్కడ ఉన్నారని అమర్ అడిగితే.. ఇందాకే రాథోడ్ ఎక్కడికో తీసుకెళ్లాడు అని రామ్మూర్తి చెబితే.. మీరు బిల్స్ వేయించండి నేను వెళ్లి వాళ్లను తీసుకొస్తాను అంటూ అమర్ వెళ్తాడు. అమర్ వెళ్లగానే.. మంగళ పార్థు గురించి రామ్మూర్తిని అడుగుతుంది. ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఆ మనిషి మొత్తం షాప్ తీసుకుంటున్నాడా ఏంటి..? అని అడుగుతుంది. ఎవరని మనోహరి అడిగితే.. మాకు ఓ తలనొప్పి బేరం ఉందని చెప్తుంది మంగళ. ఏంటా నొప్పి అని మనోహరి అడిగితే.. అదో పెద్ద కథ అంటుంది మంగళ. ఏంటా కథ అని మనోహరి అడిగితే.. ఇప్పుడా కథ నీకు అవసరమా అంటూ రామ్మూర్తి తిట్టి పార్థు కోసం వెళ్తాడు.
సీసీటీవీ కెమెరా రూంలోంచి బయటకు వచ్చిన మిస్సమ్మ, రాథోడ్ ఇద్దరూ పార్థు ఉన్న సెక్షన్‌లోకి వెళ్తారు. అక్కడ పార్థు కనిపించడు.. రాథోడ్, మిస్సమ్మ షాక్ అవుతారు. ఎక్కడికి వెళ్లాడు అని ఆలోచిస్తుంటారు. అమర్ వెళ్లి ఇక్కడేం చేస్తున్నారు..? ఇందాక మనోహరి కూడా ఇక్కడే ఉన్నది అంటూ అమర్ అడిగితే.. మనోహరి మేడం ఎందుకు ఉన్నారో మాకు తెలియదు సార్ కానీ మేము మీకు కర్చీప్ కొందామని వచ్చాము అని చెప్పగానే.. అవి నచ్చలేదు అందుకే కొనకుండా వస్తున్నామండి అంటూ మిస్సమ్మ చెప్తుంది. అమర్ సరే పదండి అందరూ కింద బిల్లింగ్ దగ్గర ఉన్నారు అంటూ రాథోడ్, మిస్సమ్మలను తీసుకుని వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.