E-Paper
Advertisement

వర్షిణికి షాక్ ఇచ్చిన హౌస్ మేట్స్.. ఫ్రెండ్ అంటూనే ముంచేశారుగా!

వర్షిణికి షాక్ ఇచ్చిన హౌస్ మేట్స్.. ఫ్రెండ్ అంటూనే ముంచేశారుగా!
Advertisement

Bigg Boss 10:ఒకప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో కి రావాలంటేనే ఇష్టపడని వర్షిణి.. ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 10 లోకి అడుగు పెట్టింది. ఇక్కడ తనదైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను మెప్పిస్తుంది అనుకుంటే.. కంటెస్టెంట్స్ చేత విమర్శలు ఎదుర్కొంటూ అభిమానులను సైతం హర్ట్ చేస్తోంది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిజానికి గేమ్లో పెద్దగా ఎఫర్ట్ చూపించకపోయినా.. ఈమె గ్లామర్ హౌస్ కి సరికొత్త అందాన్ని తీసుకొచ్చిందనే కామెంట్లు ఎప్పటికప్పుడు వినిపిస్తూ వచ్చాయి దీనికి తోడు ముఖేష్ కారణంగా సేవ్ అవుతోంది అనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.

వర్షిణి మెడలో జీరో కార్డ్..

ఇకపోతే రాంప్రసాద్, నరేష్, త్రిగుణ్ వీళ్లంతా కూడా బయట వర్షిణికి మంచి స్నేహితులే. కానీ హౌస్ లోకి వచ్చాక అసలైన రంగు బయటపడిందని, ఫ్రెండ్ అంటూనే ఆమెను పూర్తిగా ముంచేశారు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. సరదాగా ఫ్యామిలీ వీక్ గడిచింది. ఇక శని, ఆదివారాలకు సంబంధించి ఎపిసోడ్ ప్రోమోలను నిర్వాహకులు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా 69వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మూడవ ప్రోమోలో వర్షిణి పై హౌస్ మేట్స్ అందరూ పగ బట్టారా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఫ్రెండ్ అంటూనే ఆమెను నిండా ముంచేశారు అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వర్షిణి అసలు గేమ్ ఆడడం లేదా?

Advertisement

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ..” ఈ హౌస్ లో జీరో గేమర్ మీ దృష్టిలో ఎవరు?” అని ప్రశ్నించారు. ఇక రాంప్రసాద్ మొదట ఆ కార్డును వర్షిణి మెడలో వేసి, వర్షిణి అని చెప్పాడు. తన గేమే హౌస్లో లేదనుకుంటున్నావా? అని నాగార్జున ప్రశ్నించగా.. ప్రస్తుతానికైతే లేదు సార్ అని ఆమె మెడలో జీరో కార్డ్ వేశారు . ఆ తర్వాత వంశీ కూడా వర్షిణి మెడలో మరో జీరో కార్డు వేసి నిన్న కూడా చూసుకుంటే ఆమె ఆట ఆడే అవకాశం ఉన్నా ఆడలేక పోయింది అంటూ కామెంట్ చేశారు.

వారందరికీ జీరో కార్డ్స్..

ఆ తర్వాత అమన్ సుధీర్ మెడలో జీరో కార్డు వేసి అతడు ఆడుతున్నాడని అనుకుంటున్నాడేమో కానీ ఆ ఎఫర్ట్ నాకైతే కనిపించలేదు అంటూ తెలిపాడు. ఇక తర్వాత త్రిగుణ్ మెడలో జీరో కార్డు వేసిన శివ మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలకి కూడా గొడవ చేస్తున్నాడు. ఆ గొడవలు అవసరం లేదు అని నాకు అనిపిస్తోంది. అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఆ తర్వాత ముఖేష్.. సుదీర్ మెడలో జీరో కార్డ్ వేసి.. పర్సనాలిటీ వైజ్ గాని గేమ్ విషయంలో కానీ ఎక్కడ కనిపించలేదు అని చెప్పాడు. నాగార్జున మాట్లాడుతూ నీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా అనిపించలేదా ? అని ప్రశ్నించారు నాగార్జున. ఇక తర్వాత నీతూ మాస్టర్ త్రిగుణ్ మెడలో జీరో కార్డు వేసి.. తను మాటలు వదిలేస్తున్నాడు. అది మంచిది కాదని నా అభిప్రాయం అంటూ తెలిపింది.

Advertisement

also read:సేవ్ వైజాగ్ అంటూ పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్!

వర్షిణి ఇంటికెళ్ళక తప్పదా?

అలా మొత్తానికి వర్షిణి మెడలో జీరో కార్డ్స్ ఏకంగా 6 పడ్డాయి. నాగార్జున మాట్లాడుతూ ..వర్షిని ఈ హౌస్ నిన్ను పెద్ద జీరో అని డిసైడ్ చేసింది. అక్కడ ఉన్న రెండు పిల్స్ లో ఏదో ఒకటి తీసుకోమని చెప్పగా.. ఆమె బ్లూ కలర్ ఎంపిక చేసుకుంది. ఇక అందులో ఆమె ఎలిమినేషన్ కి సంబంధించిన విషయం ఉందా ? లేదా మరి ఏదైనా ఉందా అనే విషయం చెప్పకుండానే ప్రోమో కట్ చేశారు. మరి ఈ వారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

 

Related News

కాబోయే భర్త కోసమే కన్యగా ఉన్నా.. బిగ్‌బాస్‌లో లవ్ గిల్ సంచలన వ్యాఖ్యలు!

ఏంటి.. ప్రేమకు పెళ్ళైందా..? ఊహించని ట్విస్ట్ మావా..

Karthika Deepam 2 Serial Today Episode November 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  పెళ్లి చేసుకున్న సూరజ్, జ్యోత్స్న   

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ కు కొత్త టెన్షన్.. దీపావళి పండగ హడావిడి..

దేవిశ్రీ ప్రసాద్ తో స్టేజ్ షో చేస్తే అవమానాలా? దైవిక్ బయటపెట్టిన షాకింగ్ నిజం!

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి ఘోర అవమానం.. చందు మాటతో షాక్.. రౌడీలు రచ్చ..

Brahmamudi Serial Today Episode November 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఎక్స్ఫో లోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య 

Big Stories

Advertisement
×