E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు చెప్పిన నిజం అపర్ణను భయపెట్టిందా..?    

Brahmamudi Serial Today Episode November 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు చెప్పిన నిజం అపర్ణను భయపెట్టిందా..?    
Advertisement

Brahmamudi serial today Episode: లక్కీ వెళ్లి అనుమానంగా రఘువీర్‌ దగ్గరకు వెళ్లి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అంటే ఐశ్వర్య కోపంగా ఏదో అడుగతా అంటున్నాడు కదా తర్వాత అడగొచ్చులే వాటర్‌ ఇచ్చావు కదా ఇక వెళ్లు అంటే ఏదో అడగాలి అంటున్నాడు కదా అడగనివ్వు ఐషు అనగానే.. లక్కీ సరే అంటూ మీరు ఐశ్వర్యకు పెద్ద హెల్ప్‌ చేశారని చెప్తుంది. నిజమే కదా అంటే రఘువీర్‌ అవును అంటాడు. అయితే ఎటువంటి బిజినెస్‌ ఎక్స్‌ఫీరియెన్స్‌ సెక్యూరిటీ లేకుండా ఐషును నమ్మి అంత బిజినెస్‌ ఎలా ఇచ్చారు అంటూ లక్కీ అడగ్గానే.. ఐశ్వర్య ఇరిటేటింగ్‌గా ఇప్పుడు ఆ టాపిక్‌ అవసరమా ముందు నువ్వు బయటకు వెళ్లు అంటుంది

అందుకు రఘువీర్‌ నువ్వు ఉండు ఐషు.. సింపుల్‌ లక్కీ ఆల్ రెడీ సక్సెస్‌ అయిన వాళ్లకు బిజినెస్‌ ఇస్తే కిక్ ఏముంది..?  సక్సెస్‌ కావాలని ట్రై చేసే వాళ్లకు బిజినెస్‌ ఇస్తేనే కదా అసలైన కిక్కు. ఫర్టిక్యులర్‌గా ఐషుకే ఎందుకు ఇచ్చానంటే నాకు తనలో ఎలాగైనా గెలవాలనే తప్పన కనిపించింది. తనలో ఆ ఫైర్‌ కూడా ఉంది. నాకు అది నచ్చింది. ఇలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు అందుకే ఫిల్టర్‌ చేసి ఫైనల్‌ చేసి మరీ ఇచ్చాను బిజినెస్‌ అంటూ రఘువీర్‌ చెప్తుంటే.. ఐశ్వర్య కోపంగా విన్నావు కదా చాలా ఇక ఆయన్ని విసిగించకు ఇక వెళ్లు.. రఘు ఇక్కడి కంటే మా లాన్‌ ఇంకా చాలా బాగుంటుంది అక్కడి వెళ్దాం పద అంటూ తీసుకెళ్తుంది ఐశ్వర్య.

Advertisement

తర్వాత రఘువీర్‌ వెళ్లిపోతుంటే రాజు, ఇందు వెళ్లి వార్నింగ్ ఇస్తారు. ప్రశాంత్ మారిపోయిన విషయం చెప్పి ప్రశాంత్ వచ్చి కోర్టులో నిజం చెబితే నీ బతుకు ఏమౌంతుందో తెలుసా అంటూ బెదిరిస్తారు. దీంతో రఘువీర్‌ అక్కడి నుంచి పారిపోతాడు. అంతా టెర్రస్‌ నుంచి చూస్తున్న అపర్ణ కోపంగా కిందకు వెళ్లి ఇందును రూంలోకి తీసుకెళ్తుంది. ఇందు ఆశ్చర్యంగా ఏంటి నాన్న ఇలా లాక్కోచ్చావు ఏమైంది ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అడిగితే.. ముందు నువ్వు చెప్పు ఆ రఘువీర్ కు మీకు మధ్య పాత గొడవలు ఏమైనా ఉన్నాయా… చెప్పవే ఉన్నాయా.? లేవా..? అని అపర్ణ అడగ్గానే.. ఇంత డైరెక్టుగా అడిగింది ఏంటి..? అని మనసులో అనుకుంటుంటే.. నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను.. వాడు ఇంట్లో ఉన్నప్పుడు.. వాడు వెళ్లిపోయేటప్పుడు మీరు బయటకు వెళ్లి మాట్లాడటం కూడా చూశాను అంటూ అపర్ణ అడగ్గానే..

ఇందు అదేం అంత పెద్ద విషయం కాదు నాన్నమ్మ అంటూ ఇందు చెబితే.. అపర్ణ కోపంగా ఇందు విషయం చిన్నదా పెద్దదా అన్నది తర్వాత విషయం చెప్పు ఏం జరిగింది అంటూ అడగ్గానే.. జరిగింది చెప్తుంది ఇందు. ఇదంతా వాడు ఒక చెప్పు దెబ్బ కోసం చేస్తున్నాడు అంటే నేను నమ్మను దీని వెనక ఇంకేదో ఉంది ఇందు అంటూ అపర్ణ చెబితే… నాన్నమ్మ చీమ కుడితే కొంత మంది పట్టించుకోరు. కొంత మంది ఇలా నలిపేస్తారు. మరికొంత మంది కాలి కింద వేసి నలిపి చంపేస్తారు. వీడు మూడో రకమేమో ఎవరి పిచ్చి వాడికి ఆనందం నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటూ ఇందు నచ్చజెబితే.. అపర్ణ మాత్రం భయపడుతుంది.

Advertisement

వాడి ఆలోచన వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అలాంటి వాడిని తక్కువ అంచనా వేయడం చాలా పెద్ద తప్పు ఇందు అంటూ చెప్పగానే.. అదో చిన్న విషయం నాన్నమ్మ అంటూ ఇందు అంటే ఇదే మేము పాతికేళ్ల క్రితం చేసిన తప్పు ఇప్పుడు మీరు చేస్తున్నారు.. అంటూ అపర్ణ భయంతో ఏడుస్తుంది. అప్పుడు ఇందు షాకింగ్‌గా పాతికేళ్ల క్రితమా ఏం జరిగింది నాన్నమ్మ అంటూ అడగ్గానే.. అవును ఇందు పాతికేళ్ల క్రితం మము ధనంజయ్‌ వల్ల ఎంతో ఇబ్బంది పడ్డాము ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చిన మీ నాన్నకు ఆరోజు జరగరానిది జరిగిపోయింద అంటూ చెప్తుండగానే. ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు మాటతో షాక్.. అంజలి వెళ్ళిపోతుందా..? సాగర్ నర్మదా విడిపోతారా..?

Gundeninda Gudigantalu : బాలు ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రాజేష్ అవుట్..

Illu Illaalu Pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Telugu TV Serials: సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?

Sunday TV Movies : ఆదివారం సినిమాల సందడి.. వీటిని మిస్ అవ్వకండి..

వైష్ణవి సోనీ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా? రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!

సుధీర్, అనసూయ జబర్దస్త్ నుంచి అందుకే వెళ్లిపోయారు.. సత్య శ్రీ క్లారిటీ!

Big Stories

Advertisement
×