Rajendra Prasad: ఫిలిం ఇండస్ట్రీలో నట కిరీటి గా పేరు సొంతం చేసుకున్న రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) గురించి, ఆయన కామెడీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అప్పట్లోనే టాలీవుడ్ ని ఏలిన రాజేంద్రప్రసాద్ సీనియర్ ఎన్టీఆర్ నటన స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. తొలుత కామెడీ హీరోగా అడుగుపెట్టినా రాజేంద్రప్రసాద్.. చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) లాంటి కమర్షియల్ హీరోల సినిమాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు అంటే.. తన కామెడీతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా కామెడీనే నమ్ముకొని వరుస సినిమాలు చేస్తూ భారీ హిట్లు కొట్టడం అంటే కత్తి మీద సాము లాంటిది. మహా అయితే మూడు సినిమాలు.. లేదంటే ఆరు సినిమాలు.. కానీ రాజేంద్రప్రసాద్ హీరోగా.. అందులోనూ కామెడీ పండిస్తూ చేసిన సినిమాలు 100కి పై మాటే..
నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా తెలిసిన నటుడు..
‘మేడమ్’ , ‘ఎర్ర మందారం’ లాంటి ఛాలెంజ్ సినిమాలు చేసి, ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా అహ నాపెళ్ళంట, లేడీస్ టైలర్ ,అప్పుల అప్పారావు వంటి చిత్రాలు రాజేంద్రప్రసాద్ నటన సామర్థ్యానికి కేరాఫ్ అడ్రస్. కామెడీని పండించడమే కాదు ఆ నలుగురు వంటి సందేశాత్మక సినిమాలను కూడా చేసి మెప్పించగలిగిన సామర్థ్యం ఆయనది. ఇకపోతే సినిమాల పరంగా, పాత్రల పరంగా విలక్షణ నటుడిగా, నట కిరీటిగా పేరు సొంతం చేసుకున్న ఈయన కెరియర్ లో కూడా మాయని మచ్చలు ఉన్నాయట. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆ హీరోయిన్ కోసం సర్వం సమర్పించుకున్న రాజేంద్రప్రసాద్..
అప్పట్లోనే రాజేంద్రప్రసాద్, హీరోయిన్ రజిని (Rajini ) జంటకు మంచి పేరు ఉండేది. రజిని అసలు పేరు శశికౌర్ మల్హోత్రా. తమిళంలో అదే పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో మాత్రం రజిని అనే పేరుతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే తెరపై రజిని, రాజేంద్రప్రసాద్ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఇద్దరూ కొన్నాళ్లు రిలేషన్ లో కూడా ఉన్నారట. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట పరిస్థితులు అనుకూలించక ఆగిపోయారు. అయితే రజిని అంటే ఎంతో ఇష్టం ఉన్న రాజేంద్రప్రసాద్ ఆమెకు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని, తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఆమెకే ఇచ్చారనే వార్తలు కూడా అప్పట్లో చాలా వినిపించాయట. అలా ఈ విషయం టాలీవుడ్ లో బాగా హైలైట్ అయింది. ఏది ఏమైనా సినీ కెరియర్ లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రాజేంద్రప్రసాద్ వ్యక్తిగతంగా ఇలాంటి ఒక మచ్చ తన పైన వేయించుకోవడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పవచ్చు.
రమాప్రభ మేనకోడలిని వివాహం చేసుకున్న రాజేంద్రప్రసాద్..
రాజేంద్రప్రసాద్ ఆ తర్వాత కాలంలో ప్రముఖ సీనియర్ నటి రమాప్రభ (Ramaprabha) మేనకోడలు అలాగే పెంపుడు కుమార్తె అయిన విజయ చాముండేశ్వరి (Vijaya chamundeshwari )ని రాజేంద్రప్రసాద్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు , కూతురు ఉన్నారు . రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి కూడా ఇటీవలే (అక్టోబర్ 4-2024) గుండెపోటుతో మరణించింది.