Illu Illalu Pillalu Today Episode October 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి నర్మదా ప్రేమ ముగ్గురు కూడా శ్రీవల్లి ప్రవర్తనతో షాక్ అవుతారు. మీ ఆయన నీకే కదా ముద్దు పెట్టింది. అదేదో చేయకూడని పని చెప్పుకోలే నీది అన్నట్లుగా అంతగా అరుస్తున్నావ్ ఏంటి అని నర్మదా అడుగుతుంది. మా ఆయన కూడా నాకు రాత్రి ముద్దు పెట్టాడు అదేమైనా నేను చెప్పుకున్నానా? అంతెందుకు అత్తయ్యకు మావయ్య ఎన్నోసార్లు ముద్దు పెట్టి ఉంటాడు అది చెప్పిందా? మొన్న బ్యాచిలర్ పార్టీకి వెళ్ళిన ప్రేమ కు ధీరజ్ ముద్దు పెట్టాడు ప్రేమ చెప్పుకుందా? నువ్వెందుకు ఇలా చంకల గుద్దుకుంటున్నావో అర్థం కావడం లేదు అని శ్రీవల్లి పరువు తీయడంతో పాటుగా వేదవతిని ఇరికిస్తుంది నర్మదా..
వేదవతి నువ్వేంటే నా మీద పడ్డావు నన్నే ఇరికించవెంటే అడ్డంగా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. నీతో చేరితే నేను కూడా మీలాగా మారిపోతానేమో నేను వెళ్ళిపోతాను అని వేదవతి అంటున్న సరే నర్మదా కూర్చొని అత్తయ్య అని అంటుంది. ప్రేమ, ధీరజ్ కలిసిపోయారని సంతోషంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ మాత్రం ధీరజ్ పై రోజు రోజుకి ప్రేమను పెంచుకుంటుంది. ఎలాగైనా సరే ధీరజ్ ని నా సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. ప్రేమ మాత్రం ధీరజ్ని ఎలాగైనా సరే తన వైపు తిప్పుకోవాలని తన గురించి ఆలోచించేలా చేయాలని మౌనంగా ఉంటుంది. ఇక ధీరజ్ కూడా ఏమాత్రం తగ్గకుండా పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తాడు. ప్రేమకు కావాలని కోపం తెప్పించాలని ఐశ్వర్యతో మాట్లాడినట్లు నటిస్తాడు. అది నిజమేననుకునే నమ్మిన ప్రేమ వాళ్ళిద్దరు సంగతి తేలుస్తాను అని సీరియస్ అవుతుంది.
ఆనందరావు మాత్రం మేము స్వయంకృషితో పైకి వస్తాము. ఇడ్లీలతో ఫైనాన్స్ బిజినెస్ చేస్తాము అని కోతలు కోస్తాడు. రామరాజు ఎంత చెప్తున్నా సరే ఆనందరావు వినకపోవడంతో రామరాజు మీ పట్టుదలతోనే మీరు సాధిస్తారు బావగారు అని ఇవ్వాల్సిన డబ్బులు పెట్టేస్తాడు.. ఆనంద్ రావు భాగ్యం చేతిలో ఎక్కడ తన్నులు తినాలని అక్కడి నుంచి మెల్లగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ భాగ్యం మాత్రం బయటికి రాగానే ఆనందరావుని చితగ్గొట్టేస్తుంది..
ధీరజ్ కొత్తగా జాబ్ లో జాయిన్ అవుతున్నాను కదా వాడు ఏ టైం కి రమ్మంటాడు ఏ టైం కి వెళ్ళమంటాడు అని టెన్షన్ పడుతూ రెడీ అవుతూ ఉంటాడు. ఎలాగైనా సరే టైంకి వెళ్లాలని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. తన డ్రైవింగ్ లైసెన్స్ అన్ని తీసుకొని మొదటి రోజు ఉద్యోగానికి వెళ్తున్నాను అని ప్రేమతో చెప్తాడు. అసూయ అనసూయమ్మ నేను ఈరోజు కొత్త జాబ్ కి వెళ్తున్నాను. అని అనగానే ప్రేమ నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు నాకు కరుణా అదురుతుంది అని అంటుంది.
కొత్తగా ఇవాళ నేను జాబ్ లో జాయిన్ అవుతున్నాను అలాంటిది వెళ్ళొద్దని అంటావు నీకేమైనా పిచ్చా అని అంటాడు. నాకు కుడికన్ను అదురుతుంది ఏదో కీడు సంఖ్యేస్తుంది నువ్వు వెళ్ళద్దు అని బ్రతిమలాడుతుంది.. నువ్వు నీ మూఢనమ్మకాలు అని ధీరజ్ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రేమ ఎంతగా ఆపాలని ప్రయత్నించినా సరే ధీరజ్ ప్రేమని పక్కకు నెట్టేసి వచ్చేస్తాడు.
ఇంట్లోని వాళ్ళందరూ కూడా ప్రేమ చెప్పింది కూడా నీ మంచి కోసమే కదరా విను అని అంటారు. ప్రేమకు సపోర్ట్ చేస్తూ అందరూ ధీరజ్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపాలని ప్రయత్నిస్తారు. ఎదురుగా వచ్చిన రామరాజు ఏమైంది అని అడుగుతాడు. నర్మదా అసలు విషయాన్నీ చెప్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. రామరాజు ధీరజ్ ని వెళ్లమని అంటాడు. ఎవరు ఏమి చేసేదిలేక దూరంగా బయటకు పంపిస్తారు. ఒక పికప్ రావడంతో అక్కడికి వెళ్తాడు ధీరజ్. అతను నువ్వు డ్రైవర్ లాగా లేవు కదా అని అనుమాన పడతాడు. ఇక తన కూతుర్ని అతనితో పంపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని పంపిస్తాడు.
Also Read : గది కోసం రచ్చ చేసిన శ్రీయ.. ఇంట్లో పెద్ద గొడవ.. పల్లవి నెక్స్ట్ ప్లాన్ ఏంటి..?
ఆ తర్వాత షేరింగ్ కావడంతో దారి మధ్యలో మరో ఇద్దరూ అబ్బాయిలు ఎక్కుతారు. వాళ్ళు ఆ అమ్మాయిని చూసి తేడాగా ప్రవర్తిస్తారు. ఆ అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాళ్ళని చూసిన ధీరజ్ కచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. ఆ తర్వాత వాళ్లతో గొడవ పెట్టుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..