Brahmamudi serial today Episode: మెడలో పొట్లకాయలు.. భుజాల మీద గుమ్మడి కాయలు చేతిలో కూరగాయల సంచితో లోపలికి వచ్చిన రాజ్ ను చూసి భయపడుతుంది. రుద్రాణి ఏయ్ అంటూ గట్టిగా అరుస్తుంది. దీంతో అందరూ బయటకు వచ్చి.. ఏమైందని అడుగుతారు. వెజిటేబుల్ బండి లోపలికి వచ్చిందనుకున్నాను అంటూ రుద్రాణి జాలిగా రాజ్ ను చూస్తూ.. కంపెనీకి సీఈవో అయ్యుండి. ఇంటి నౌకరి లాగా ఈ కూరగాయలు తేవడం ఏంట్రా..? చూడ్డానికి నాకే అదోలా ఉంది. ఈ పనులు చేయడానికి నీకేం ఇబ్బందిగా లేదా? అని అడుగుతుంది రుద్రాణి.
నాకెందుకు అత్తా ఇబ్బంది అంటూ కన్నతల్లికి, తండ్రికి లేని ఇబ్బంది నేనెందుకు పడాలి అంటుంది. దీంతో అపర్ణ నువ్వు ఎందుకు ఈ పనులు చేస్తున్నావో నాకు అర్థం అయింది అనగానే మీరెందుకు ఈ పనులన్నీ చేయిస్తున్నారో నాకు బాగా తెలుసు మమ్మీ అంటాడు రాజ్. దీంతో ఇప్పుడేంటి ఆఫీసు నుంచి కావ్యను బయటకు పంపించి నిన్ను నీ స్థానంలో కూర్చోబెడితే తప్పా ఆఫీసుకు వెళ్ళవా..? అని ప్రశ్నిస్తుంది అపర్ణ. మీరేంటి కావ్యను ఆఫీసులోనే ఉంచి నన్ను మేనేజర్ పోస్టులోనే పడేస్తారు. కాదంటే ఇలాంటి ఇంటి చాకిరి చేయిస్తారు అంతేనా అంటాడు రాజ్.
ఇంతలో ఇందిరాదేవి కల్పించుకుని నీకు బాగానే అర్థం అయిందిరా నా చిట్టి మనవడా..? అంటుంది. దీంతో రాజ్ అయితే ఇప్పుడు చెప్తున్నాను విను నాన్నమ్మా.. మీరు కళావతి కోసం కంపెనీ నుంచి నన్ను తొలగించాలని చూస్తున్నారు. కంపెనీ అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీసినా నేను బాధ్యుడిని కాదు అనగానే అయితే సరే రాజ్ ఇదిగో నా కారు కీస్ అంటూ నువ్వు ఖాళీగానే ఉంటావు కదా? వాష్ చేయించుకురా అంటాడు. దీంతో ఈ పనులన్నీ నువ్వు చేయలేవు రాజ్.. హ్యాపీగా ఆఫీసుకు వెళ్లు అంటూ సలహా ఇస్తుంది. నో నేను చేస్తాను అంటూ రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కళ్యాణ్ అమ్మ మీద సెంటిమెంట్ సాంగ్ రాయడానికి ట్రై చేస్తుంటాడు. బాగా రాక పేపర్స్ అన్ని చించివేస్తుంటాడు. ఇంతలో అప్పు భోజనం తీసుకుని అక్కడికి వస్తుంది. ఏంటి కూచి ఇది అప్పుడెప్పుడో పాత సినిమాల్లో చూసినట్టు ఉంది అంటుంది. పాట సరిగ్గా రాయలేకపోతున్నాను పొట్టి. రాస్తుంటే ఆర్టిఫిషియల్ లా అనిపిస్తుంది అని చెప్తాడు కళ్యాణ్.
ఎందుకలా..? అని అప్పు అడగ్గానే ఎందుకు అంటావేంటి అమ్మ మీద పాట రాయాలి. దాని గురించి ఆలోచిస్తుంటే అమ్మ గుర్తుకు వస్తుంది. మనకు చేసిన అవమానం గుర్తుకు వస్తుంది. అంటూ కళ్యాణ్ ఎమోషన్ అవ్వగానే అమ్మ అవమానమే చేసిందని ఎందుకు అనుకుంటావు. అది ఒకరకమైన ప్రేమే అయ్యుండొచ్చు కదా? అంటూ అప్పు కళ్యాణ్ కు అమ్మ ప్రేమ గురించి చెప్తుంది. నిన్ను అవమానించిన వ్యక్తిని కూడా నువ్వు అభిమానిస్తున్నావంటే నువ్వెంత మంచిదానికి పొట్టి అంటాడు కళ్యాణ్.
రుద్రాణి దీర్ఘంగా ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. అపర్ణ, ఇందిరాదేవి గమనిస్తారు. ఇంతలో ఇందిరాదేవి ఏంటి విలక్షణ నటి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దీంతో మీరు చేస్తుంది చాలా అన్యాయం అమ్మా.. అంటుంది రుద్రాణి. అన్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అంటూ ఆశ్చర్యంగా నవ్వుతుంది ఇందిరాదేవి. అమ్మా అసలు రాజ్ ఏంటి మన కంపెనీ సీఈవో అమ్మా.. ఈ కూరగాయలు తేవడం ఏంటి..? సిటీ బస్సులో వెళ్లడం ఎంటి? అంటూ అడగడంతో ఇందిరాదేవి సరే ఓ పని చేయ్. వాడి బదులు నువ్వు వెళ్లు.. అని చెప్తుంది. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఎందుకులే అమ్మా వాడు చూసుకుంటాడులే.. రాజ్ చూసుకుంటాడులే అంటుంది. దీంతో ఇందిరాదేవి మరి నోర్మూసుకో అంటూ తిడుతుంది రుద్రాణిని.
ఆలోచిస్తూ.. కూర్చున్న అపర్ణ దగ్గరకు సుభాష్ వెళ్లి ఏంటి అపర్ణ ఎన్ని పనులు చెప్పినా వాడిలో మార్పు రావడం లేదు అని టెన్షన్ పడుతున్నావా? వాడు తప్పక మారతాడు. నువ్వు ఏం ఎక్కువగా ఆలోచించకు అంటాడు. దీంతో అపర్ణ కోపంగా ఈ వంకతో నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నారా..? మరోసారి మోసపోవడానికి నేనే సిద్దంగా లేను. మిమ్మల్ని జీవితంలో క్షమించను అంటూ తిట్టి వెళ్లిపోతుంది. సుభాష్ బాధపడుతుంటాడు. ఇందిరాదేవి అక్కడకు వచ్చి ఎందుకురా అలా బాధపడతావు. ఒకప్పుడు నువ్వు తప్పు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పశ్చాతాప పడుతున్నావు. ఏదో ఒక రోజు అపర్ణ నిన్ను క్షమిస్తుంది అని ఓదారుస్తుంది. అయితే ఆ ఆశ, నమ్మకం రెండూ లేవమ్మా.. నేను చేసిన తప్పుకు ఈ శిక్ష అనుభవించాల్సిందే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఆఫీసులో ఉన్న కావ్య దగ్గరకు పాత క్లయింట్స్ ఒక్కొక్కరుగా వస్తుంటారు. వాళ్లను చూసిన శృతి అసలు వీళ్లు నాతో మాట్లాడటానికి ఇంట్రెస్టే చూపించలేదు మేడం. అలాంటిది మీరు పిలవగానే ఎలా వచ్చారు అని అడుగుతుంది. దీంతో మన కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏదైన కారణాలతో కంపనీతో బ్రేకప్ చేసుకుని మరోక కంపెనీతో బిజినెస్ చేయాలి అనుకుంటే అది ఇద్దరి వైపు అంగీకారంతో జరగాలి. లేదంటే పెనాల్టీ కట్టాలి.
ఆ విషయమే నేను గుర్తు చేశాను. అందుకే వచ్చారు అని కావ్య చెప్తుంది. అయితే మీరు అగ్రిమెంట్ లో రూల్స్ మాట్లాడారు కాబట్టి వాళ్లు వచ్చారు. కానీ తిరిగి మనతో వాళ్లు బిజినెస్ చేస్తారా? మేడం అని శృతి అడగ్గానే.. చేస్తారో చేయరో తెలియదు కానీ కచ్చితంగా వాళ్లను మార్చాలి. మనతో బిజినెస్ చేయాలి చూడాలి అంటుంది కావ్య. ఇది తప్పా మనకు వేరే దారి లేదు అంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.