Brahmamudi serial today Episode: గార్డెన్ లో రాజ్ దగ్గరకు వచ్చిన దుగ్గిరాల కుటుంబం మొత్తం రాజ్ ఇగో హర్ట్ అయ్యేలా మాట్లాడతారు. కావ్య అంటే నువ్వు భయపడుతున్నావని ఒకరు. కావ్యతో బిజినెస్ లో పోటీ పడలేకే ఇంటికి పరిమితం అయ్యావా అంటూ మాట్లాడతారు. పెళ్లానికి భయపడి ఇంటికే పరిమితమైన దుగ్గిరాల వారసుడు అని లోకం కోడై కూస్తుందిరా అని ఇందిరాదేవి అంటే.. కావ్యకు ఉన్న తెలివితేటల ముందు నువ్వు ఎందుకు కొరగావని ఆఫీసులో అందరూ అనుకుంటారు అని అపర్ణ అంటుంది. ఆఫీలోనే కాదు వదిన బయట కూడా తెలిసిపోయింది. నాకు తెగ ఫోన్లు వస్తున్నాయి. మీ అబ్బాయి సమర్థుడు కాదా..? మీ కోడలును రంగంలోకి దింపారా అని అడుగుతున్నారు అంటూ ప్రకాష్ చెప్పగానే.. నిజం చెప్పు రాజ్ కావ్య అంటే భయపడుతున్నావా..? అని అపర్ణ అడగ్గానే..రాజ్ ఇగో అమాంతం పెరిగిపోతుంది.
కోపంగా ఆపండి అని అందర్ని తిట్టి.. నన్ను పిరికివాడు అనుకుంటున్నారా..? నేను ఆ కళావతికి భయపడేవాణ్నా అంటూ నేను తలుచుకుంటే ఆ కళావతి సీఈవోగా పనికిరాదని ఫ్రూవ్ చేయడానికి నాకు పది నిమిషాలు చాలు అంటాడు రాజ్. దీంతో అపర్ణ, రాజ్ ను తిడుతూ.. ఒకర్ని పడగొట్టడం రుద్రాణిని చూసి నేర్చుకున్నావా? అంటూ నిలదీస్తుంది. దీంతో రాజ్ ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో స్వప్న, రాజ్ నువ్విలాగే ఉంటే రాహుల్ లా ఇంటికే పరిమితం అవుతావు అంటుంది. మళ్లీ అందరూ తిట్టడం మొదలు పెట్టగానే.. రాజ్ ఆఫీసుకు వెళ్తానని చెప్పి వెళ్లిపోతాడు.
పై నుంచి అంతా చూసిన రాహుల్ స్పీడుగా లోపలికి రుద్రాణి దగ్గరకు వెళ్ళి.. మామ్ అక్కడ కొంపలు అంటుకుంటుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా మేకప్ వేసుకుంటున్నావేంటి? అని కంగారు పడుతుంటే.. నేనేం అంత మేకప్ అవ్వడం లేదురా.. లైట్ గా టచ్ అప్ అవుతున్నాను.. అయినా ఇప్పుడు ఏమైందని అంతలా మాట్లాడుతున్నావు అంటుంది రుద్రాణి. అందరూ కలిసి ఆ రాజ్‌ను ఒప్పించి ఆఫీసుకు పంపిస్తున్నారు అని రాహుల్ చెప్పగానే రుద్రాణి షాక్ అవుతుంది.
వాట్ రాజ్ ఆఫీసుకు వెళ్లడానికి ఒప్పుకున్నాడా..? అది కూడా మేనేజర్ గా.. అని షాకింగ్ గా అడగ్గానే.. ఒప్పుకోలేదు. వాడి ఈగోను రెచ్చగొట్టి మరి ఒప్పించారు. అని రాహుల్ చెప్పగానే అయితే మనం చూస్తూ ఊరుకుంటామా..? ఏదో ఒకటి చేద్దాం అంటూ ముందు ఆ మేనేజర్ గాడికి ఫోన్ చేసి కావ్య ఆఫీసులో ఏం చేస్తుందో తెలుసో అని చెప్తుంది రుద్రాణి. రాహుల్ మేనేజర్‌కు ఫోన్ చేయగానే సార్ మీరు నాకిప్పుడు హెల్ఫ్ చేయాలి అంటూ తనను కావ్య డిమోషన్ చేసిన విషయం సెక్యూరిటీ గార్డుగా చేస్తున్న విషయం చెప్పగానే రాహుల్ ఫోన్ కట్ చేస్తాడు.
ఆఫీసుకు వెళ్లిన రాజ్.. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీగా ఉన్న మేనేజర్‌ను గుర్తు పట్టకుండా నమస్తే చెప్పడం రాదా? అని కోపంగా అడుగుతాడు. మేనేజర్ సార్ మీరు నన్ను ఒకసారి బాగా చూడండి అని టోపీ తీసి ఫేస్ చూపించగానే రాజ్ షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ ఉండటమేంటని అడుగుతాడు. కావ్య మేడం నన్ను ఇలా చేసింది అని చెప్పగానే అడిగేవాళ్లు ఎవరూ లేరని ఇంతకు తెగిస్తుందా? పద నేనున్నాను నీకు అంటూ మేనేజర్ రానంటున్నా.. బలవంతంగా కావ్య చాంబర్‌లోకి తీసుకెళ్తాడు రాజ్. కావ్యతో మేనేజర్ ను ఎందుకు ఇలా చేశావని.. గొడవ పడతాడు.
కావ్య సరే ఆయన మేనేజర్ పోస్టు ఆయనకు ఇస్తాను. కానీ నువ్వు సెక్యూరిటీ జాబ్ చేయి అని రాజ్‌కు షాక్ ఇస్తుంది కావ్య. దీంతో రాజ్ భయంతో సెక్యూరిటీ గార్డా..? వద్దులే అంటూ మేనేజర్‌ను తిడతాడు. ఎవడు పడితే వాడు హక్కుల గురించి మాట్లాడితే వాడితో పాటు వెళ్లిపోతావా? అంటూ నిలదీస్తాడు. రాజ్ మాట మార్చడంతో మేనేజర్ షాకింగ్ గా చూస్తూ అక్కడి నుంచి దీనంగా వెళ్లిపోతాడు. ఇంతలో శృతి వచ్చి క్లయింట్స్ వచ్చారని చెప్పడంతో మీటింగ్ హాల్ లోకి వెళ్తారు రాజ్, కావ్య. మీటింగ్ లో అందరూ కూర్చుని ఉన్న ఫోటో ఒకటి తీసి అనామికకు పెడుతుంది కావ్య.
చూశావా అనామిక మా కంపెనీ వద్దని వెళ్లి పోయిన క్లయింట్స్ అందరూ తిరిగి వచ్చారని మెసెజ్ పెడుతుంది. ఆ మెసేజ్ చూసుకున్న అనామిక ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. ఇంతలో మీటింగ్ మొదలవగానే క్లయింట్స్ అందరూ రాహుల్ గురించి చెప్తూ ఆయన వల్లే తాము వేరే కంపెనీకి వెళ్లామని.. మీ కంపెనీలో నెల రోజుల్లో ముగ్గురు సీఈవోలు మారారు ఇప్పుడు మీరు కూడా ఇక్కడ పర్మినెంట్ గా ఉంటారన్న గ్యారెంటీ లేదు అందుకే మా దారి మేము చూసుకున్నాము అని చెప్పి అందరూ వెళ్లిపోతారు.
క్లయింట్స్ వెళ్లిపోయాక.. రాజ్ కోపంగా వెటకారంగా కావ్యను తిడతాడు. పిలిచి మరీ కంపెనీని అవమానించావు. ఇప్పుడు అర్థం అయిందా..? నువ్వేంటో నీ స్థానం ఏంటో.. ఇది బొమ్మలకు రంగులు వేసినంత ఈజీ కాదు. కోట్లలో వ్యాపారం. అంటూ రాజ్ మాట్లాడుతుంటే కావ్య కోపంగా మీ కోపం నా మీద.. కంపెనీ మీద కాదు. వాళ్ల కోపం కంపెనీ మేనేజ్‌మెంట్ మీద. నా మీద కాదు. చెప్పినా వినకుండా రాహుల్ లాంటి ఒక అసమర్థుడిని సీట్లో కూర్చోబెట్టారు. ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా.. పిచ్చోడి చేతిలో రాయిలా మారి కంపెనీ పేరు ప్రతిష్టలు పోగొట్టాడు. చూడండి అవమానం మీది. ఈ కంపెనీది. దుగ్గిరాల కుటుంబానికి. అని కావ్య చెప్తుండగానే.. కేర్‌లెస్ గా రాజ్ వెళ్లిపోతాడు. శృతి వచ్చి అరవింద్ వచ్చాడని చెప్తుంది.
అరవింద్, కావ్య దగగరకు రాగానే చెప్పండి అరవింద్ గారు ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నారు అని అడుగుతుంది. ఏం లేదు మేడం.. మీ కంపెనీతో నేను పదేళ్ల నుంచి పని చేస్తున్నాను. మధ్యలో నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నా కంపెనీ డెబ్ సీట్లోకి వెళ్లింది. ఇప్పుడు నా కంపెనీని వేలం వేయాలని చూస్తున్నారు. నాకు పది కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు వేళానికి వెళ్లినా నా ఇల్లు అమ్మినా నా అప్పు కట్టలేం అని ఏదో చెప్పడానికి సంకోచిస్తుంటే.. మీ పరిస్థితి అర్థం అయింది. కానీ ఇందులో మా కంపనీ నుంచి మీరు ఎలాంటి సాయం ఎక్స్ ఫర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని కావ్య అడుగుతుంది. దీంతో దయచేసి మీ కంపెనీ నా కంపెనీని టేకోవర్ చేస్తే నాకు హెల్ప్ అవుద్ది. మీ కంపెనీ అయితే ఈజీగా టేకోవర్ చేయగలదు మేడం అంటూ అరవింద్ అడగ్గానే కావ్య ఆలోచిస్తూ శృతిని పిలిచి రాజ్ సార్‌ను నా క్యాబిన్ లోకి రమ్మను అని చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.