Brahmamudi serial today Episode: రుద్రాణి చెప్పగానే.. కావ్య నెక్లెస్ కోసం రూంలోకి వెళ్తుంది. రూంలో మొత్తం వెతుకుతుంది. కానీ ఎక్కడా నెక్లెస్ కనిపించదు. దీంతో డల్లుగా బయటకు వస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అదేంటి కావ్య నెక్లెస్ వేసుకుంటే బాగుంటుంది కదా అలా బాక్స్‌తో వచ్చావేంటి..? అని అడుగుతుంది అపర్ణ. గిఫ్ట్ ఇచ్చింది నువ్వు కదా వదిన నీ చేతులతో వేసుకోవాలని చూస్తుందేమో అందుకే బాక్స్‌తో బయటకు వచ్చినట్టు ఉంది అని చెప్తుంది రుద్రాణి. అవునా ఇటు ఇవ్వమ్మా వేస్తాను అని అపర్ణ అడగ్గానే.. అత్తయ్యా మరి మీకొక విషయం చెప్పాలి.. అది నెక్లెస్ కనిపించడం లేదు అత్తయ్య అని కావ్య చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు.
అయ్యో పది లక్షల నెక్లెస్ పోయిందా..? అని రుద్రాణి అడుగుతుంది. అదెలా పోతుంది కావ్య ఈ ఇంట్లో తీసేవాళ్లు ఎవరుంటారు..? నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటాయి. ఒకసారి గుర్తు చేసుకో అంటుంది ఇంద్రాదేవి. లేదు అమ్మమ్మా నేను ఈ బాక్స్‌లోనే పెట్టాను.. అంటుంది కావ్య. మరి ఎలా పోయి ఉంటుంది అని అపర్ణ అడుగుతుంది. ఎలా పోయిందని కావ్యను అడిగితే ఎలా తెలుస్తుంది వదిన మనమే కనుక్కోవాలి. ఇంట్లో ఉన్న వాళ్లకు ఆ నెక్లెస్ దొంగిలించే అవసరం లేదు.. ఇక మిగిలింది మన పని మనిషి రత్తాలే.. అంటూ రత్తాలును పిలిచి నెక్లెస్ ఏమైనా తీశావా..? అని అడగ్గానే.. రత్తాలు కోపంగా అమ్మగారు నన్ను అనుమానిస్తే బాగోదు.. ధాన్యలక్ష్మీ అమ్మగారు ఎన్నో సార్లు తన నగలు పడేసుకుంటే.. నేనే తీసుకొచ్చి ఇచ్చాను కావాలంటే అడగండి అంటుంది. ధాన్యలక్ష్మీ కూడా అవును అంటుంది.
నీ మీద ఎలాంటి అనుమానం ఊరికే అడిగాను అంతే అంటుంది రుద్రాణి. ఇంట్లో ఉన్నది అందరూ మన వాళ్లే అయినప్పుడు ఇంక ఆ నెక్లెస్ ఎవరు తీస్తారు అని రాజ్ అడగ్గానే.. ఇంట్లో ఉన్నది మన వాళ్లే అయినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్లు తీసి ఉంటారు.. అని రుద్రాణి చెప్పగానే.. ఇంద్రాదేవి కోపంగా రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు.. అంటూ తిడుతుంది. రేవతి నేన అలాంటి దాన్ని కాదు.. నేను అసలు కావ్య రూంలోకే వెళ్లలేదు.. అని చెప్తుంది. దొరికిన ప్రతి దొంగ చెప్పే మొదటి మాట ఇదే అంటుంది రుద్రాణి. అందరూ కలిసి రుద్రాణిని తిడతారు.. దీంతో రుద్రాణి ఒకసారి రేవతి బ్యాగ్ చెక్ చేయండి అని చెప్తుంది. అందరూ రుద్రాణిని తిడతారు.. రేవతి కూడా బ్యాగ్ చెక్ చేసుకోండి అని ఇస్తుంది. దీంత రుద్రాణి బ్యాగ్ చెక్ చేస్తుంది. అందులో ఏమీ ఉండదు. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఏం రుద్రాణి నెక్లెస్ ఎక్కడ పోయింది… అంటూ ఇంద్రాదేవి అడుగుతుంది. దీంతో ఏమో నాకు తెలియదు అని రుద్రాణి చెప్పగానే..
నాకు తెలుసు అంటూ స్వరాజ్, కనకం వస్తారు. అపర్ణ దగ్గరకు వెళ్లి ఓరేయ్ ఫ్రెండ్ ఆ నెక్లెస్ నువ్వు చూశావా..? అని అడుగుతుంది. అవును ఫ్రెండ్ నేను చూశాను అని చెప్తాడు స్వరాజ్.. ఎక్కడ చూశావు అని అపర్ణ అడగ్గానే.. రా ఫ్రెండు నేను చూపిస్తాను.. అంటూ రుద్రాణి రూంలోకి తీసుకెళ్లి అక్కడ డ్రాలో నెక్లెస్ ఉందని చూపిస్తాడు. అపర్ణ డ్రా తెరిచి చూసి షాక్ అవుతుంది. నెక్లెస్ తీసుకుని కిందకు వస్తుంది. రుద్రాణి ఆత్రుతగా దొరికిందా..? ఎక్కడ దొరికింది అని అడుగుతుంది. నీ గదిలోనే దొరికింది అని అపర్ణ చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. రుద్రాణి మాత్రం చాన్సే లేదు.. నా గదిలో ఎందుకు ఉంటుంది అని అడుగుతుంది.
దీంతో స్వప్న రాధ గారి బ్యాగులో దొరికి ఉంటే.. తను దొంగ అయ్యేది కానీ ఇప్పుడు నీ గదిలో దొరికింది కాబట్టి అని స్వప్న చెప్తుంటే.. నేను దొంగను అంటున్నావా..? అని రుద్రాణి ప్రశ్నిస్తే.. అదే కదా నేను చెప్తున్నాను అంటుంది స్వప్న.. దీంతో రుద్రాణి కోపంగా ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి నగలు దొంగిలించాలని నేను ఎలా అనుకుంటాను.. ఒకవేళ అలా దొంగిలిస్తే పట్టుకోవాలని ఎలా అనుకుంటాను అంటుంది రుద్రాణి.. ఏమో ఎవరికి తెలుసు.. గతంలో మీ అబ్బాయి కూడా నా నగలన్నీ ఇలాగే కొట్టేయాలని చూశారు.. ఆ బుద్దులు ఎలా వచ్చాయా..? అని అనుమానం ఉండేది.. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అంటూ తిడుతుంది. ఇక అందరూ కూడా రుద్రాణిని తిట్టి భోజనం చేయడానికి వెళ్తారు.
తర్వాత రుద్రాణి రూంలోకి వెళ్లి ఆ నెక్లెస్ తన రూంలోకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తుంది. ఇంతలో స్వరాజ్, కనకం వచ్చి ఆ నెక్లెస్ తీసింది తామేనని నీ రూంలో పెట్టింది తామేనని ఇన్ డైరెక్టుగా చెప్తారు. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. అందరూ భోజనం చేస్తుంటే.. అపర్ణ, స్వరాజ్‌ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని గారాబంగా తినిపిస్తుంది. అంతా చూస్తున్న రేవతి బాధపడుతూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది.ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.