BigTV English

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆ విధంగా చేస్తే రేషన్ కట్, మంత్రి సూచన

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆ విధంగా చేస్తే రేషన్ కట్, మంత్రి సూచన

AP Ration Cards: ప్రభుత్వం పథకాలు గురించి ఏదో ఒకటి నిత్యం కొత్త సమాచారం వస్తూనే ఉంటుంది. తాజాగా ఏపీలో రేషన్ కార్డుదారులను అలర్ట్ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దుఅవుతుందని క్లారిటీ ఇచ్చారు. అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..


ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్తగా రేషన్ స్మార్ట్ కార్డులను వినియోగదారులకు అందజేస్తోంది. అయితే కొత్తగా ఇస్తున్న క్యూ ఆర్‌ ఆధారిత రేషన్‌ కార్డుల్లోని పేర్లలో తప్పులు అధికంగా ఉండడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నాయి. పిల్లలకు సంబంధించి సర్టిఫికెట్లను వాటినే ప్రామాణికంగా తీసుకోవడంతో తప్పుల మాటేంటని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ కార్డుల్లో తప్పులుంటే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ద్వారా సరిచేయించుకోవాలననారు. సెప్టెంబరు 15 నుంచి మన మిత్ర వాట్సప్‌లో మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. అలాంటివారికి కొత్తగా కార్డులు ముద్రించి ఇస్తామని క్లారిటీ ఇచ్చేశారు. తప్పుల వెనుక క్లారిటీ కూడా ఇచ్చారు.


ఈ-కేవైసీ, ఆధార్‌లో సమాచారం ఆధారంగా కొత్త రేషన్‌ కార్డులను ముద్రించినట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో మరో విషయం కూడా చెప్పారు. మూడు నెలలు వరుసగా రేషన్‌ తీసుకోకుంటే నాలుగో నెల పంపిణీ నిలిచిపోతోందని చెప్పకనే చెప్పారు. అలాంటి వారు సచివాలయాలకు వెళ్లి రేషన్ కార్డు చూపించి మళ్లీ యాక్టివేట్ చేయించుకోవాలన్నారు.

ALSO READ: ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. చిక్కుల్లో సునీల్‌రెడ్డి

నవంబరు ఒకటి తర్వాత కొత్త కార్డు కావాలంటే నామమాత్ర రుసుము చెల్లించాలన్నారు. రూ. 35 నుంచి 50 చెల్లిస్తే నేరుగా రేషన్ కార్డు ఇంటికే వస్తుందన్నారు. ఏపీ వ్యాప్తంగా వృద్ధులున్న ఇళ్లకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 29,762 షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి అన్ని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పూర్తయితే పౌరసరఫరాల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని మంత్రి ఆలోచన. ఈ కార్డులు డిజిటల్ సేవలను ఉపయోగపడనున్నాయి. తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తేల్చేశారు మంత్రి. అక్టోబర్ 31 వరకు ఉచితంగా స్మార్ట్ కార్డులను అందజేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Related News

CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరు, మంత్రులతో భేటీ

TDP Vs YCP: ఏపీలో మెడికల్ పాలిటిక్స్.. PPP పద్ధతిలో కాలేజీలు.. దశ మారుతుందా?

Telugu People from Nepal: నేపాల్ నుంచి సురక్షితంగా తిరుపతి విమానాశ్రయానికి రాయలసీమ జిల్లా వాసులు

Tirumala: తిరుమ‌ల‌లో మ‌రో ఘోర అప‌చారం.. అలిపిరి మెట్ల వ‌ద్దే నాన్ వెజ్

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. సునీల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు, జగన్‌కు సన్నిహితుడా?

Nepal Crisis: ఫలించిన లోకేష్ కృషి.. నేపాల్ నుంచి స్వదేశానికి ఆంధ్రా వాసులు

Nepal: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని.. సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం

Big Stories

×