BigTV English

Satyabhama Serial Today September 17th: ‘సత్యభామ’ సీరియల్‌: తండ్రిని చంపేందుకు రుద్ర ప్లాన్‌ – శోభనం గదిలోంచి వెళ్లిపోయిన హర్ష

Satyabhama Serial Today September 17th: ‘సత్యభామ’ సీరియల్‌: తండ్రిని చంపేందుకు రుద్ర ప్లాన్‌ – శోభనం గదిలోంచి వెళ్లిపోయిన హర్ష

Satyabhama serial today Episode : తమ శోభనానికి అన్ని ఆటంకాల వస్తున్నాయని ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదని ఇప్పుడు కూడా ఏదైనా గండం అడ్డుపడుతుందోనని నందిని మైత్రికి చెప్తుంది. దీంతో గండం ఎందుకు ఉంటుంది అని మైత్రి అడగ్గానే నీకు తెలియదులే.. అంటూ మా ఇద్దరి చుట్టు నెగటివ్‌ ఎనర్జీ చక్కర్లు కొడుతుందని హర్ష దాన్ని దాటి వస్తేనే శోభనం జరుగుతుందని పాలు గ్లాసు మైత్రి చేతిలో పెడుతుంది నందిని. పాల గ్లాస్‌ నాకు ఇస్తున్నావేంటి అని మైత్రి అడగ్గానే నా చేత్తో ఇస్తే తాగడం లేదని నువ్వు ట్రై చేయ్‌ అని చెప్పి వెళ్లిపోతుంది నందిని. హర్ష మాత్రం నందిని మాటలు పట్టించుకోవద్దని మైత్రి చెప్తాడు. సరేనని పాలు హర్షకు ఇచ్చి వెళ్లిపోతుంది మైత్రి.


తన తండ్రిని చంపేస్తున్నానన్న రుద్ర

రుద్ర, నర్సింహ్మకు ఫోన్‌ చేసి ఈరోజే మర్డర్‌ చేయడానికి ప్లాన్‌ చేశానని చెప్తాడు. దీంతో నీ మాటలు నమ్మి నా మనుషులను పంపిస్తున్నాను అని చెప్పి దండ రెడీ చేసుకో మీ నాన్న ఫోటోకు వేయడానికి అంటాడు నర్సింహ్మ. సరేనని ఫోన్‌ కట్‌ చేసిన రుద్ర ఒక్కటి కాదు రెండు దండలు రెడీ చేసుకుంటాను. నీ ఫోటోకు కూడా వేయాలి కదా అనుకుని వెళ్లిపోతాడు.


శోభనం చెడగొట్టేందుక భైరవి ప్లాన్‌

మరోవైపు భైరవి స్వీట్లు రెడీ చేస్తుంది. పని మనిషి వచ్చి ఏం చేస్తున్నారు అమ్మా అని అడుగుతుంది. చిన్నా గాడికి ఇష్టమని స్వీట్లు చేసిన అంటుంది. అంటే ఇవి శోభనం కోసమేగా అంటుంది. దీంతో భైరవి అవునని చెప్తుంది. ఏంటోనమ్మా మిమ్మల్ని చూసి జాలి పడాల్నో.. బాధపడాల్నో అర్థం కావడం లేదు. చిన్న కొడలిని అది చేస్తా.. ఇది చేస్తా.. నరికేస్తా.. పొడిచేస్తా.. అంటూ పూనకం వచ్చినట్లు ఊగిండ్రు. చివరకు చిన్న కోడలి శోభనానికి స్వీట్లు చేస్తుండ్రు.. అదేదో పాత సినిమాల్లో చెప్పినట్లు విధి బలీయమైంది అంటారు కదమ్మా .. అని పనిమనిషి చెప్పగానే విధి బలీయమైందే కావచ్చు కానీ ఈ బైరవి బలం ముందు అదేంత.. గెలిచే దాకా యుద్దం చేస్తాను అంటుంది. అసలు ఆ శోభనమే జరగకపోతే.. అని తాను తయారు చేస్తున్న స్వీట్లలతో నిద్రమాత్రలు కలిపానని జరగాల్సింది జరగకుండా చేసిన అని చెప్పి వెళ్లిపోతుంది.

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోతానన్న అపర్ణ – తాను పట్టించుకోనన్న చెప్పిన రాజ్‌

శోభనానికి రెడీ అవుతున్న సత్య

తర్వాత శోభనం రూం బ్యూటిఫుల్‌ గా డెకరేట్‌ చేసి ఉంటుంది. సత్యను వాళ్ల అక్క బాగా రెడీ చేస్తుంది. దీంతో ఇంత సింగారం అవసరమా? అని సత్య అడగ్గానే అవునులే నువ్వు బంగారానివి.. బంగారానికి సింగారం అవసరమే లేదులే.. గంటల తరబడి ఇలా అలంకరించుకునేది ఎందుకో తెలుసా..? గదిలోకి వెళ్లగానే పదినిమిషాల్లో తీసి పక్కన పెట్టడానికి అంటూ మస్త్‌ ముద్దు వస్తున్నావు సత్య అంటుంది. ముద్దు రావాల్సింది నీకు కాదు నీ మరిదికి.. అని సత్య అనగానే ముద్దు రాకుండానే లవ్‌ చేసిండా? అని అడుగుతుంది. ఇంతలో వాళ్ల అమ్మమ్మ వచ్చి శోభనం గది ఇదా అవతలి గదా? అని అడుగుతుంది. ఇంతకీ ఆ వెధవ ఎక్కడ అని అడగ్గానే ఏ వెధవ అని సత్య నాలిక కరుచుకుంటుంది. పొరపాటుగా వచ్చింది అని ఆ గదిలో ఉన్నాడు అని చెప్పగానే అమ్మమ్మ ఆ గదిలోకి వెళ్తుంది.

సత్య అనుకుని నానమ్మను హగ్‌ చేసుకున్న క్రిష్‌

శోభనం గదిలో క్రిష్‌ అద్దంలో చూసుకుంటూ.. పాల గ్లాసుతో సంపంగి వస్తున్నట్లు ఉంది. రెగ్యులర్‌ గా కాకుండా వెరైటీగా స్వాగతం చెప్తాను అని డోర్‌ దగ్గరకు వెళ్తాడు. ఇంతలో లోపలికి వాళ్ల నాన్నమ్మ రాగానే సత్య బిగ్గరగా ముసలామెను కౌగిలించుకుంటాడు. దీంతో ముసలామె విదిలించుకుని క్రిష్‌ ను తిడుతుంది. నీకు ముహూర్తం ఎన్ని గంటలకు అని చెప్పాను అని అడగ్గానే రాత్రి ఒంటిగంటకు అని చెప్పడంతో మరి ఇప్పుడే శోభనం చేసుకుంటావా? అని తిడుతుంది. దీంతో ఇద్దరి మధ్య కామెడీగా గొడవ జరుగుతుంది. తర్వాత ముసలామె ఎమోషనల్‌ అవుతుంది. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్తుంది. అమ్మాయి రాత్రి ఒంటి గంటకే వస్తుందని చెప్పి వెళ్లిపోతుంది.

తర్వాత రుద్ర వాళ్ల నాన్న ఇంట్లో తన మనుషులకు ఇవాళ పండుగ ఉందని పోయి ఎంజాయ్‌ చేయండని డబ్బలు ఇస్తాడు. ఇంతలో రుద్ర వచ్చి నీ చావుకు నువ్వే ముహూర్తం పెట్టుకుంటున్నావు బాపు. ఇంకెంతసేపు పది నిమిషాల్లో నువ్వు చావడం కాయం అనుకుంటాడు.

శోభనం గదిలోంచి వెళ్లిపోయిన హర్ష

మరోవైపు శోభనం గదిలో ఎదరుచూస్తున్న హర్ష దగ్గరకు నందిని పాల గ్లాసుతో వస్తుంది. ఆ పాలల్లో సగం నీకు సగం నాకంటా అని ఇంకో గ్లాస్‌ తీసుకుని సగం పాలు హర్షకు ఇస్తుంది. దీంతో సగం సగం అంటే ఇలా కాదు సగం పాలు నువ్వు తాగి సగం నాకివ్వు అని చెప్తాడు హర్ష. అట్లయితే ఎంగిలి అవుతుందేమో అని అడుగుతంది నందిని. ఇంతలో హర్ష, నందిని కిస్‌ చేయబోతుంటే నాకు ఒక డౌట్‌ అంటూ ఇంతకు ముందు కూడా మైత్రికి ఇలాగే ముద్దు పెట్టావా? అని అడుగుతుంది. దీంతో హర్ష కోపంగా నందిని దూరంగా తోసేసి నీ బుద్ది మారదు అంటూ శోభనం గదిలోంచి బయటకు వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి సత్యభామ సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×