BigTV English

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వినాయకుడి పూజలో పాల్గొన్న రాజ్‌, కావ్య – అప్పుకు అనుకోని గిఫ్ట్‌ ఇచ్చిన కళ్యాణ్‌

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వినాయకుడి పూజలో పాల్గొన్న రాజ్‌, కావ్య – అప్పుకు అనుకోని గిఫ్ట్‌ ఇచ్చిన కళ్యాణ్‌

Brahmamudi serial today Episode :  వినాయక చవితిరోజు నీ ముఖం చూశాను ఇక ఎన్ని గొడవలు వస్తాయో ఏమో అని కావ్యను వెటకారంగా మాట్లాడతాడు రాజ్‌. దీంతో కావ్య కోపంగా తన సైకిల్‌ మరింత అడ్డగా కారుకు పెడుతుంది. దీంతో రాజ్‌ ఏయ్‌ సైకిల్‌ తీస్తావా? లేదా? అంటాడు. తియ్యకపోతే ఏం చేస్తావు.. నువ్వే నీ డొక్కు కారును పక్క నుంచి తీసుకెళ్లు అంటుంది. దీంతో రాజ్‌ గణపతి విగ్రహం కొనడానికి వచ్చి దీనితో గొడవెందుకు అని కారును పక్క నుంచి తీసుకెళ్తాడు. విగ్రహాల షాపు వెళ్లిన రాజ్‌ అక్కడ ఏ విగ్రహం తీసుకోవాలా..? అని చూస్తుంటాడు.


ఇంతలో కావ్య స్పెషల్‌ గా చేసిన విగ్రహాన్ని చూసి ఇది చాలా బాగుంది అనుకుని తీసుకోబోతాడు. అక్కడి అతను వచ్చి ఇది వేరే వాళ్ల కోసం స్పెషల్‌ గా డిజైన్‌ చేయించాము సార్‌ అని చెప్తాడు. దీంతో రాజ్‌ నాకు ఇదే కావాలి అని నొక్కి చెప్తాడు. షాపు అతను ఇవ్వనని చెప్తాడు. దీంతో ఇగో హర్ట్‌ అయిన రాజ్‌ నాకు ఇదే కావాలి అంటాడు. షాపు అతను వీడెవడో పట్టిన పట్టు వదలని మెంటల్‌ గాణిలా ఉన్నాడు. ఇంకెంచెం బెట్టు చేసి ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేద్దాం అని మనసులో  అనుకుంటాడు. మీరు ఎంత అడిగినా ఇవ్వను సార్‌ అంటాడు. దీంతో రాజ్‌ ఈ విగ్రహం రేటుకు డబుల్‌ ఇస్తాను అని చెప్పగానే సరే అయితే పదివేలు ఇచ్చి తీసుకెళ్లండి అని చెప్తాడు షాపు అతను. సరే అని పది వేలు ఇచ్చి విగ్రహం తీసుకెళ్తాడు రాజ్‌.

ఇంటికి వెళ్లిన రాజ్‌ పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అదే విషయం అందరికీ చెప్తాడు. దీంతో ఇందిరాదేవి సరే అయితే కావ్యకు ఫోన్‌ చేయ్‌ అంటుంది. షాక్‌ అయిన రాజ్‌ ఎందుక నాన్నమ్మ అని అడుగుతాడు. ఏ పూజలోనైనా పెళ్లి అయిన వాళ్లు ఇద్దరూ అంటే దంపతులు కూర్చోవాలి అని చెప్తుంది. దీంతో ఇదంతా నాకు ముందే చెప్పొచ్చు కదా అంటాడు. ముందే చెప్పడం ఏంటి రాజ్‌ నీకు తెలియదా? పెళ్లైన వాళ్లు భార్య బతికి ఉండగా పూజ ఒంటరిగా చేయకూడదు. అని చెప్పగానే ఓహో నన్ను ఎందుకు ముందుకు తోశారో..   నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అంటాడు రాజ్‌.


అయితే  అర్థమైంది కదా? పూజకు అన్ని సిద్దం చేసి భార్య లేకుండా పూజ చేస్తే.. ఆ లోటు లోటుగానే ఉంటుంది. ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటే నీకు కావ్య గుర్తుకు రాలేదా? పెళ్లి అయినప్పటి నుంచి ఏ పూజైనా తన చేతుల మీదుగానే ఏర్పాట్లు మొదలయ్యేవి కదా అంటుంది అపర్ణ. దీంతో సుభాష్‌ కూడా కావ్యకు ఫోన్‌ చేసి రమ్మని చెప్పు చాలు నేను కారు పంపిస్తాను. అంటాడు. కావాలంటే నేను వెళ్లి తీసుకొస్తాను అంటుంది అపర్ణ.

వీడు అన్నమాటలకు కావ్య రాకపోతే ఏంటి వదిన అంటాడు ప్రకాష్.  బ్రతిమిలాడి తీసుకొస్తాను అంటుంది అపర్ణ. ఎవరెన్ని చెప్పినా.. రాజ్‌ వినడు. పూజలో కూర్చోవడం మానేస్తాను కానీ కావ్యకు మాత్రం ఫోన్‌ చేయను అని భీష్మించుకు కూర్చుంటాడు. దీంతో రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. వీడు దేవుడికి కూడా భయపడట్లేదంటే ఇక ఎవరు చెప్పినా వినడని మనసులో అనుకుంటుంది. ఇక ఇదంతా కాదు కాని మన శాస్త్రం  ప్రకారం భార్య అందుబాటులో లేని కాలంలో రాముడంతటి  మహోన్నత వ్యక్తి బంగారు సీతను పక్కన పెట్టుకుని యాగం చేశారు. మనం అలా చేయలేం కాబట్టి కావ్య చీరను పక్కన పెట్టుకుని పూజ చేయ్‌ రాజ్‌ అని ఇందిరాదేవి చెప్పి.. స్వప్నను కావ్య చీర తీసుకురమ్మని చెప్తుంది.

స్వప్న అలాగే అని పైకి వెళ్తుంది. ధాన్యలక్ష్మీ వచ్చి గణపతి విగ్రహాన్ని ఓపెన్‌ చేస్తుంది. విగ్రహం చూసిన ఇందిరాదేవి రాజ్‌ ను మెచ్చుకుంటుంది. మంచి విగ్రహం తెచ్చావు. జీవకళ ఉట్టిపడుతుంది అంటుంది. ఇంతలో అపర్ణ ఈ విగ్రహం చూస్తుంటే నాకెందుకో కళావతే చేసినట్టు ఉంది అత్తయ్యా అంటుంది. కళావతి అనే పేరు వినగానే రాజ్‌ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు. నువ్వు ప్రతి కళలోనూ కళావతిని వెతక్కు మమ్మీ అంటాడు. ఇంతలో స్వప్న, కావ్య శారీ తీసుకురావడంతో ఆ చీరను రాజ్‌ పక్కన పెట్టి పూజ మొదలు పెడతారు. అయితే పక్కనే ఉన్న చీరను చూసిన రాజ్‌ ఉలిక్కిపడి కావ్య వచ్చిందనుకుంటాడు. భయంభయంగా పూజ చేస్తుంటాడు. అపర్ణ కూడా కావ్య వచ్చి రాజ్‌ పక్కన పూజ చేస్తున్నట్టు ఊహించుకుని ఎమోషనల్‌  అవుతుంది.

కళ్యాణ్‌, అప్పుల ఇంట్లో బంటి గణపతి పూజ చేస్తాడు. పూజ పూర్తయిన తర్వాత కళ్యాణ్‌, బంటికి థాంక్స్‌ చెప్తాడు. నువ్వు లేకపోయుంటే.. మేము పూజ చేసుకునేవాళ్లమే కాదు అంటాడు. దీంతో అప్పు కళ్యాణ్‌ ని తిడుతుంది. వాడు లేకపోతే యూట్యూబ్‌ లో చూసి పూజ చేసేవాళ్లం అంటుంది. తర్వాత కళ్యాణ్‌ ఖాకీ డ్రెస్‌ తీసుకొచ్చి నీ యాంబిషన్‌ చేరుకోవడానికి ఈరోజే నీ ప్రయత్నం మొదలుపెట్టు అంటాడు.

అపర్ణ వాళ్ల ఇంటికి కనకం వస్తుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. గణపతి పూజలో ఉన్న కావ్య చీరను చూసి కనకం కూడా హ్యాపీగా పీలవుతుంది. ఇంతలో రుద్రాణి పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. దీంతో కనకం ఇది నా కూతురి అత్తిల్లు  అంటుంది. కూతురే ఇక్కడ లేనప్పుడు అత్తిల్లు ఎలా అవుతుందని రుద్రాణి అడగుతుంది. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Tags

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×