BigTV English
Advertisement

Bigg Boss 18 : హిందీ బిగ్ బాస్ 18 ప్రోమో సూపర్.. ఈ సారి హౌస్లోకి వచ్చే కంటెస్టెంట్స్ వీళ్లే ..!

Bigg Boss 18 : హిందీ బిగ్ బాస్ 18 ప్రోమో సూపర్.. ఈ సారి హౌస్లోకి వచ్చే కంటెస్టెంట్స్ వీళ్లే ..!

Bigg Boss 18 : బుల్లి తెర పై ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షోలో బిగ్ బాస్ ముందు వరసలో ఉంటుంది. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ షోను చూసేందుకు జనాలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో బిగ్ బాస్ మేకర్స్ కొత్త కొత్త టాస్క్ లతో ఆడియన్స్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు, తమిళ్లో సీజన్ 8 మొదలైంది. హిందీ లో ఇంకా షో ప్రారంభం కాలేదు. తాజాగా హిందీ బిగ్ బాస్ 18 ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. అలాగే ఈ సీజన్ అక్టోబర్ 6 నుంచి మొదలు కాబోతుందని అధికారికంగా తెలిపారు. ఎప్పుడూ సెన్సేషనల్ అవుతూ వార్తల్లో నిలిచే హిందీ బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ ఈ సారి ఎవరు వస్తారో చూడాలని తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు..


సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 18 కోసం ప్రేక్షకుల నిరీక్షణ దాదాపు ముగిసింది. ఈ లేటెస్ట్ షో ప్రీమియర్ దగ్గర పడుతుండంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. మొన్నటివరకు తెలుగు బిగ్ బాస్ కోసం ఎలా అయితే ఎదురు చూసారో ఇప్పుడు హిందీ బిగ్ బాస్ కోసం కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ షోలో ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారో తెలియలేదు కానీ ఈ సీజన్ లో హౌస్ లో సందడి చేయబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరు పేర్లు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి.. ఆ సెలెబ్రేటీలు ఎవరో ఓ లుక్ వేద్దాం పదండీ..

Bigg Boss 18 Promo Super.. These are the contestants who will enter the house this time..!
Bigg Boss 18 Promo Super.. These are the contestants who will enter the house this time..!

ప్రతి సీజన్‌ లోనూ కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. పారితోషికంతో పట్టింపు లేకుండా కాస్త ఎక్కువ పాపులారిటీ ఉన్న హీరోయిన్స్ ను, హీరోలను, ఇతర సెలబ్రిటీలను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈసారి ఇప్పటికే కంటెస్టెంట్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఈసారి హౌస్ లో పాల్గొనే వారు ఎవరంటే.. సమీరా రెడ్డి, అనిత లను ఈ సీజన్ కోసం ఎంపిక చేయడం జరిగిందట. సమీరా రెడ్డి ని భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సీజన్‌ కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. సమీరా రెడ్డి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. బిగ్ బాస్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..


టీవీ సీరియల్స్ తన పాత్రలకు మంచి గుర్తింపు తెచ్చుకున్న షోయబ్ ఇబ్రహీం బిగ్ బాస్ 18 షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్.. టీవీ నటుడు ధీరజ్ ధూపర్. ఈ 2024 ఏడాదికి అధికారికంగా కంటెస్టెంట్స్ లిస్టులో చేరాడు. అయితే, అతను ఆడే ఆటకు 4-5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్. కోల్‌కతా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రసిద్ధి చెందిన నటిగా దేబ్ చంద్రిమా సింఘా రాయ్ ఒకరు. ఆమె కూడా కంటెస్టెంట్స్ లిస్టులో అధికారికంగా ప్రకటించబడింది.టెలివిజన్ నటి చాహత్ పాండే. ఈమె ఇపుడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టనున్నారు. కేదార్ ఆశిష్, నియాతి ఫత్నానీ, జన్నత్ జుబైర్, మిస్టర్ ఫైసు మరియు మాక్స్‌టర్న్ వంటి సోషల్ మీడియా స్టార్‌లతో సహా పలువురు ఈ షోలో చేరనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో రాబోతున్న కంటెస్టెంట్స్ గురించి త్వరలోనే అనౌన్స్ చెయ్యనున్నారు.

Related News

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Big Stories

×