Brahmamudi serial today Episode: నీ చేతుల్లో పెరిగితే కొంపలు కూల్చేదే అవుతుంది అంటూ ప్రకాష్, రుద్రాణిని తిడతాడు. ఇంద్రాదేవి కూడా ఇన్నాళ్లకు ఒక మంచి మాట చెప్పావు అంటుంది. అమ్మా నువ్వు కూడానా..? అంటుంది రుద్రాణి. ఇంతలో కావ్య పంతులు గారు పూజకు టైం అవుతుంది పదండి అంటుంది. ఇంతలో పంతులు సరే పదండి అంటూ పూజ చేయడానికి అందరూ వెళ్తారు. ఇంతలో రాజ్ కావ్యను పక్కకు పిలిచి రేవతి గురించి చెప్తాడు. అవును మీరే తీసుకొస్తానని చెప్పారు.. ఏమైంది ఇంకా రాలేదు అంటుంది. రాజ్, రేవతికి ఫోన్ చేస్తాడు. అక్క ఎక్కడున్నావని అడుగుతాడు. ఇంటి బయటే ఉన్నాను తమ్ముడు అని రేవతి చెప్తుంది. రాజ్, కావ్య బయటకు వస్తారు. ముసుగులో ఉన్న రేవతి గేటు దగ్గర ఉంటుంది.
ఇలా వస్తే మీ అమ్మ చూడకుండా ఉంటుందా..? అని అడుగుతుంది కావ్య. దీంతో అమ్మ ముసుగు తీయదు కదా..? ఒకవేళ అమ్మ ముసుగు తీయాలని చూస్తే ఇవాళ ఇలా ముసుగు వేసుకోవడం వ్రతం అని ఎవ్వరూ తీయకూడదని చెబుదాం అంటాడు రాజ్. భయం భయంగా సరే అంటుంది రేవతి. అయితే పద వెంటనే ముసుగు వేసుకో వెళ్దాం అంటాడు. అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ముందుగా జూనియర్ స్వరాజ్ పరుగెత్తుకుంటూ హాయ్ ఫ్రెండ్ అంటూ వెళ్తాడు. స్వరాజ్‌ను చూసిన అపర్ణ హ్యాపీగా దగ్గరకు తీసుకుని ముద్దు ఇస్తుంది. గడవప దగ్గర నుంచి చూస్తున్న రేవతి ఎమోషనల్ అవుతుంది. ముసుగులో వచ్చిన రేవతిని చూసిన రుద్రాణి ఏయ్ ఎవరు ఈవిడ అని అడుగుతుంది. తను ఎవరంటే.. అంటూ రాజ్ అంటుంటే.. ఎవరనే కదా మేము అడుగుతున్నాము… అంటుంది రుద్రాణి.. దీంతో ఎవరో కనుక్కోండి చూద్దాం అంటాడు రాజ్. ఆవిడమేనా క్విజ్ ఫ్రోగ్రాం నుంచి వచ్చిందా..? కనుక్కోవడానికి అయినా ముఖమే కనిపించడం లేదు ఎలా తెలుస్తుంది అంటూ రుద్రాణి చెప్పగానే..
జోక్ అదిరిపోయింది అత్తయ్య.. మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు.. తను ఎవరంటే.. స్వరాజ్ వాళ్ల అమ్మగారు అంటూ రాజ్ చెప్పగానే.. మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో మీ వాణ్ని అడుగుతున్నాను. ఒకసారి మీతో ఫోన్‌లో కూడా మాట్లాడాను గుర్తుందా..? అని అపర్ణ అడగ్గానే.. గుర్తుందండి అంటూ రేవతి చెప్తుంది. మీ వాడు చాలా తక్కువ సమయంలోనే నాకు బాగా దగ్గర అయిపోయాడండి.. తనతో ఎప్పుడు మాట్లాడినా మా ఇంటి వాడిలా అయిపోయాడు. మీ వాడికి అన్నీ మా వాడి పోలికలే వచ్చాయనుకున్నాను.. ఆ దేవుడి చిత్రం ఏంటో కానీ మీరు కూడా మా అబ్బాయి పేరే పెట్టారు స్వరాజ్ అని చెప్తుంది అపర్ణ. అవును చాలా కో ఇంన్సిడెంటల్‌గా జరిగిపోయింది అంటాడు రాజ్. ఇంతలో ధాన్యలక్ష్మీ అయినా ముసుగేంటి కొత్త పెళ్లి కూతురులా..? అని అడుగుతుంది. దీంతో రాజ్ అంటే అది వాళ్ల ఆచారం పిన్ని ఎక్కడికి వెళ్లినా వాళ్లు ఇలాగే వెళ్తారు. కానీ ఇంట్లో ఇలా ఉండరు కదా అంటాడు.
ఇలాంటి విచిత్రమైన ఆచారం నేను ఎక్కడా చూడలేదు అంటుంది రుద్రాణి.. దీంతో ప్రకాష్ వెటకారంగా అసలు నువ్వు ఇప్పటి వరకు ఎన్ని దేశాలు తిరిగావే.. అని అడగుతాడు. నా ముఖానికి దేశాలు కూడానా.? అలిగితే అరుణాచల్ ప్రదేశ్ కి ఏడిస్తే ఏడు కొండల వాడి దగ్గరకి తీసుకెళ్లారు అని రుద్రాణి చెప్పగానే.. మరేదో ప్రపంచాన్నే చదివేసిన్నట్టు ప్రపంచంలో ఉన్న ఆచారాలన్నీ తెలిసినట్టు అలా మాట్లాడతావేంటి.? ఎవరి ఆచారాలు వారివి.. అంటాడు. దీంతో రాజ్ అబ్బా కరెక్టుగా చెప్పావు బాబాయ్ నీలాంటోడు ఇంటికి ఒక్కడుంటే చాలు నాలాంటోడు ఈజీగా బతికేస్తాడు అనగానే నాకు అర్థం కాలేదురా..? అంటాడు ప్రకాష్… అయినా పండక్కి ఇంటికి వచ్చిన అతిథిని ఇలా నిలబెట్టి మాట్లాడటం కరెక్టేనా..? అని కావ్య అడగ్గానే.. అసలు అది ఎప్పుడు పద్దతిగా ఉంది ఇప్పుడు ఉండటానికి అంటాడు ప్రకాష్.
దీంతో అందరూ పూజకు వెళ్తారు.. రాహుల్ రుద్రాణిని తీసుకుని పక్కకు వెళ్తాడు. ఏంట్రా వదులు అంటుంది రుద్రాణి.. దీంతో రాహుల్ ఏంటి మమ్మీ ఆవిడ వచ్చిన్నప్పటి నుంచి అనుమానంగా చూస్తున్నావు.. అని అడుగుతాడు.. అనుమానం వచ్చింది కాబట్టే చూస్తున్నాను. పైగా ఆ రాజ్, కావ్య ఇద్దరూ ఆవిడతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు.. అంటుంది. అందులో తప్పేం ఉంది అని రాహుల్ అడగ్గానే.. ఆ బుడ్డోడు పరిచయం అయిందే ఈ మధ్య అలాంటిది వాడి తల్లితో అంత చనువుగా ఎలా ఉంటునారో నాకు అనుమానంగా ఉంది. అంతే కాదు ఆ గొంతు ఎక్కడో విన్నట్టు ఉంది అంటుంది రుద్రాణి.. ఆవిడ గురించి తీరిగ్గా ఆలోచించవచ్చు కానీ ముందు నువ్వు వేసిన ప్లాన్ గురించి ఆలోచించు అని చెప్తాడు. అదెప్పుడో సిద్దంగా ఉంది అని రుద్రాణి చెప్తుంది. సిద్దంగా ఉండటం కాదు ముందు వెళ్లి పని పూర్తి చేయ్ అని చెప్తాడు రాహుల్. అది అంత ఈజీ అనుకున్నావా..? మనం తీసుకొచ్చిన టాబ్లెట్ తీసుకెళ్లి తీర్థంలో కలపాలి అలా చేయాలంటే టైం చూసే కలపాలి వెయిట్ చేయ్ అని చెప్పి వెళ్లిపోతుంది రుద్రాణి.
కావ్య, రాజ్‌లు కలిసి రేవతి, స్వరాజ్‌లను తీసుకుని సీతారామయ్య రూంలోకి వెళ్తారు. ముసుగు తీసి రేవతిని చూపిస్తారు. రేవతిని చూసిన ఇంద్రాదేవి భయంతో రాజ్‌ను తిడుతుంది. ఎంతకు తెగించారు.. అసలు మీ అమ్మకు నిజం తెలిస్తే ఏం జరుగుతుందోనని భయం వేస్తుంది అంటుంది. అదంతా నేను చూసుకుంటాను నాన్నమ్మ నువ్వేం భయపడకు అంటాడు రాజ్. ఇంతలో స్వరాజ్‌ను వెతుక్కుంటూ అపర్ణ వస్తుంటుంది. సీతారామయ్య, రేవతి ఎమోషనల్‌గా మాట్లాడుకుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం