Nursing Faculty: నర్సింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత వేధిస్తుంటే.. మరో వైపు కొంత మంది ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల్లో డిప్యూటేషన్లు పొందుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన ఫ్యాకల్టీ.. ఫైళ్లు చూస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ నర్సింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత వేధిస్తుంది. కానీ ఇటీవల సిరిసిల్లా, సంగారెడ్డి ల నుంచి ఇద్దరు ఫ్యాకల్టీలు నర్సింగ్ కౌన్సిల్ లో డిప్యూటేషన్ పై వచ్చారు. నర్సింగ్ విద్యార్థినులకు పాఠాలు చెప్పాల్సిన ఆ ఫ్యాకల్టీ..ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తూ కాలం సాగదీస్తున్నారు. ప్రభుత్వం దాదాపు ఒక్కొక్కొరూ రూ. 80 వేలకు పైగా జీతం తీసుకుంటూ నర్సింగ్ కౌన్సిల్ లో రికార్డు అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు నిర్వహించే వర్క్ చేస్తున్నట్లు సమాచారం.
వీరిద్దరే కాదు. ఇలా చాలా మంది నర్సింగ్ ఫ్యాకల్టీలు జిల్లాల నుంచి సిటీ, టౌన్ లలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయాలు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. దీని వలన కాలేజీల్లో ఫ్యాకల్టీ సమస్య నెల కొన్నది. ఒక వైపు ప్రభుత్వం క్వాలిటీ నర్సింగ్ విద్యను అందించాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు కొంత మంది ఉన్నతాధికారుల జోక్యంతో ఫ్యాకల్టీలు అడ్మినిస్ట్రేషన్ లోకి అడుగులు వేయడం గమనార్హం.ఇక కొన్ని జిల్లాల్లో పేషెంట్లకు సేవలందించాల్సిన నర్సింగ్ ఆఫీసర్లు..కాలేజీల్లో కొనసాగుతున్నారు. అంతేగాక కొన్ని కాలేజీల్లో ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువ ఫ్యాకల్టీ ఉండగా,మరి కొన్ని కాలేజీల్లో అతి స్వల్ప సంఖ్యలో ఉంటున్నారు. ఈ వ్యవస్థను సెట్ చేయాల్సిన డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
Also Read: అలాంటి వివక్ష తగదు.. ఉపాసనతో ఇంటర్వ్యూ- మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
సంగారెడ్డి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 18 మంది లెక్చరర్లు, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నా…వీరికి అదనంగా టీచింగ్ హాస్పిటల్ నుంచి మరో 8 మంది నర్సింగ్ ఆఫీసర్లను డిప్యూట్ చేసుకున్నారు. ఆలెడ్రీ ఉన్న స్టాఫ్ సంఖ్యే అత్యధికంగా ఉన్న పరిస్థితుల్లో మళ్లీ డిప్యుటేషన్లపై ఆసుపత్రి స్టాఫ్ ను తీసుకోవాల్సిన అవసరం ఏమున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మహేశ్వరం, కుత్బుల్లాపూర్ నర్సింగ్ కాలేజీల్లో కేవలం ముగ్గురు చొప్పున మాత్రమే ఫ్యాకల్టీ ఉన్నారు. ఒక వైపు విద్యార్ధులకు అవసరమైన సంఖ్యలో ఫ్యాకల్టీ లేక కొన్ని కాలేజీలు సతమతమవుతుంటే, సంగారెడ్డి లాంటి కాలేజీల్లో అదనంగా స్టాఫ్ ను రిక్రూట్ చేసుకొని వ్యవస్థను నడిపించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. విద్యార్ధుల సంఖ్య, ఉండాల్సిన ఫ్యాకల్టీలపై రివ్యూ నిర్వహించి షప్లీంగ్ చేయాల్సిన డిప్యూటీ డైరెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతుంది. పైగా ప్రిన్సిపాల్స్ నియామకం, జోన్ల నుంచి ఉద్యోగులు షిప్టింగ్ వంటి విషయాల్లోనూ డీడీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని స్వయంగా ఆ విభాగపు అధికారులే చెప్తున్నారు.
నర్సింగ్ డిప్యూటీ డైరెక్టరే ప్రస్తుతం నర్సింగ్ కౌన్సిల్ ఇన్ చార్జ్ రిజిస్టార్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమెపై రెండు చోట్ల సమర్ధవంతంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో నర్సింగ్ విద్య, అడ్మినిస్ట్రేషన్ అంశాల్లో జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా ప్రమోషన్ల పై ఉద్యోగులు సీరియస్ గా ఉన్నారు. ఫైళ్లు పెండింగ్ ఉండటంతో అసిస్టెంట్ ప్రోఫెసర్ల ప్రమోషన్లు నిలిచిపోయినట్లు టాక్. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాకల్టీ కొరత, సిబ్బంది సర్దుబాటులో జాప్యం, సౌకర్యాలు లోపం వంటి సమస్యలు వేధిస్తుంటే, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ఆ అధికారిణి ఫెయిలైందనే చర్చ ఉన్నది. పైగా జూనియర్లకు కీలక పోస్టులు అప్పగిస్తూ , సీనియర్లను కావాలనే పక్కకు పెడుతున్నారని ప్రచారం ఉన్నది. ఇక కొన్ని కాలేజీలకు అర్హత లేకున్నా..తనకు నచ్చినోళ్లను ప్రిన్సిపాల్స్ గా నియమించి వ్యవస్థను గ్రిప్ లోకి తీసుకోవాలని డీడీ ప్రయత్నిస్తున్నారంటూ ఓ ఫ్యాకల్టీ తెలిపారు. ఫ్యాకల్టీ జోన్ ల మార్పిడిలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం.
Also read: భార్యాభర్తల అద్భుత ఆలోచన.. మట్టి లేకుండానే కుంకుమపువ్వు సాగు.. నెలకు రూ. 4 లక్షల సంపాదన!