E-Paper
Advertisement

హరీష్ రావును ఓడించడం పెద్ద విషయం కాదు.. సిద్దిపేటలో జెండా ఎగురవేస్తాం!- కవిత సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావును ఓడించడం పెద్ద విషయం కాదు.. సిద్దిపేటలో జెండా ఎగురవేస్తాం!- కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement

Kalvakuntla Kavitha: తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కల్వకుంట్ల కవిత పర్యటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సిద్దిపేటలో నూతనంగా నిర్మించనున్న ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ కార్యాలయ భూమిపూజ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కవిత మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు, అవినీతి ఆరోపణలు గుప్పించారు. సిద్దిపేట నుంచే తన కొత్త రాజకీయ ప్రస్థానం ప్రారంభమవుతుందని కవిత ప్రకటించారు.

సిద్దిపేట మున్సిపాలిటీ నుంచే రాజకీయ ప్రస్థానం

Advertisement

సిద్దిపేట తన సొంత ప్రాంతమని, తాను ఈ గడ్డ బిడ్డనని కల్వకుంట్ల కవిత భావోద్వేగంతో పేర్కొన్నారు. ఇక్కడి నుంచే సామాజిక తెలంగాణ సాధన కోసం అడుగులు వేస్తున్నామని చెప్పారు. సిద్దిపేట ప్రజలు ఎన్నో ఏళ్లుగా హరీష్ రావుకు అవకాశం ఇచ్చారని, కొత్తగా వచ్చిన తమ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట మున్సిపాలిటీ నుంచే తమ రాజకీయ ప్రస్థానం మొదలవుతుందని, ఇక్కడ తమ జెండా ఎగురవేసి తీరుతామని కవిత ధీమా వ్యక్తం చేశారు. హరీష్ రావును ఓడించడం పెద్ద విషయం కాదని, ప్రజా జీవితం నుంచి ఆయన్ను తరిమేసే వరకు తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందని కవిత హెచ్చరించారు.

ఆస్తులు, కుంభకోణాలపై తీవ్ర ఆరోపణలు

Advertisement

హరీష్ రావు ఆస్తులు 2004 నుంచి ఇప్పటివరకు ఎలా పెరిగాయో ప్రజలందరికీ తెలుసని, అప్పటి, ఇప్పటి ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించాలని కవిత డిమాండ్ చేశారు. సిద్దిపేటలో బొగ్గు కూడా దొంగతనం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆసుపత్రులను బెదిరించి పాల వ్యాపారం చేశారని విమర్శించారు. అంతేకాకుండా, గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా, ఉద్యోగులతో చర్చించకుండా రూ.25 కోట్ల ఈపీఎఫ్ నిధులను వేర్వేరు ఖాతాలకు మళ్లించారని కవిత ఆరోపించారు.

విచారణకు డిమాండ్.. నిర్వాసితులపై ఆవేదన

ఆరోగ్యశాఖలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని కవిత ఆరోపిస్తూ.. దీనిపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ముఖ్యమంత్రికి సంబంధం లేకపోతే తక్షణమే విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. మరోవైపు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్వాసితులకు ఇంతవరకు సరైన పరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద కార్పొరేట్లను తీసుకొచ్చి పద్మశాలీలను, కూలీలను కేవలం కార్మికులుగా మార్చారని, విశ్వబ్రాహ్మణుల ఫోన్లు ట్యాప్ చేసిన ఘనత హరీష్ రావుదేనని కవిత విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు గ్యాస్ నూనె పోసుకుని అగ్గిపెట్టె దొరకలేదని నాటకాలాడితే, శ్రీకాంతాచారి మాత్రం ప్రాణాలు కోల్పోయారని కవిత వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలు పంచ జన్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.

Also Read:తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ని ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ముప్పు! 

Tags

Related News

వీసీ సజ్జనార్ విషయంలో ఏం జరిగింది? 14 నెలలకే బదిలీ ఎందుకు? పోలీసు శాఖలో తీవ్రమైన చర్చ

తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ని ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ముప్పు!

మోదీకి భజన చేసుకో.. అమిత్ షాకు పూజ చేసుకో..! కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ సెటైర్లు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి.. నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

చేవెళ్లలో ఘోర ప్రమాదం.. ఆర్మీ వాహనం బోల్తా, 8 మంది జవాన్ల పరిస్థితి విషమం

రాహుల్‌ను రీలాంచ్ చేయాల్సిన అవసరం లేదు.. ఆయనో గొప్ప జననేత: మహేష్ కుమార్ గౌడ్

యూనిఫాంలోవున్న నేరస్థుడు.. సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు ఆగ్రహం, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×