E-Paper
Advertisement

కోట్లు నొక్కేసిన కంపెనీ… లాయర్ వేసిన మాస్టర్ ప్లాన్ తో అడ్డం తిరిగే కథ… మెంటలెక్కించే కోర్టు రూమ్ డ్రామా

కోట్లు నొక్కేసిన కంపెనీ… లాయర్ వేసిన మాస్టర్ ప్లాన్ తో అడ్డం తిరిగే కథ… మెంటలెక్కించే కోర్టు రూమ్ డ్రామా
Advertisement

American Legal Drama Series: లీగల్ డ్రామాలు, కోర్టు రూమ్‌లో జరిగే వాదోపవాదాలు ఇష్టపడేవారి కోసం తాజాగా ఓటీటీలోకి ఓ అద్భుతమైన సిరీస్ అడుగు పెట్టింది. ‘ది రెయిన్‌మేకర్’ (The Rainmaker) అనే టైటిల్ తో రూపొందిన ఈ అమెరికన్ సిరీస్, ప్రముఖ రచయిత జాన్ గ్రిషామ్ (John Grisham) రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా రూపొందింది. కొత్తగా లాయర్‌గా కెరీర్ ప్రారంభించిన ఓ యువకుడు శక్తివంతమైన లా ఫర్మ్‌తో ఎలా పోరాడాడనేది ఇంట్రస్టింగ్ పాయింట్ తో ఈ సిరీస్ ను తెరకెక్కించారు. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? ఏ ఓటీటీలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది అంటే…

కథలోకి వెళ్తే…

రూడీ బేలర్ అనే యువకుడు లా చదువు పూర్తి చేసుకుని, పెద్ద లా ఫర్మ్‌లో తన కెరీర్‌ను ప్రారంభిస్తాడు. అయితే మొదటి రోజే అక్కడి పవర్‌ఫుల్ లాయర్ లియో డ్రమ్మండ్ తో విభేదాలు రావడంతో ఉద్యోగం కోల్పోతాడు. దీంతో చిన్న లీగల్ ఫర్మ్‌ను నడిపించే జోసెలిన్ ‘బ్రూసర్’ స్టోన్ దగ్గర పని చేయడం మొదలుపెడతాడు. అక్కడ డెక్ షిఫ్లెట్ అనే పారాలీగల్‌తో కలిసి కేసులను పరిశీలిస్తుంటాడు. ఈ క్రమంలో డాట్ బ్లాక్ అనే మహిళ తన కుమారుడు డానీ రే మరణానికి ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమని చెబుతూ వారి వద్దకు వస్తుంది.

Advertisement

తన కొడుకు మరణానికి న్యాయం జరగాలని ఆమె కోరుకుంటుంది. ఈ కేసును తీసుకున్న రూడీ, ఆసుపత్రి వ్యవహారాల్లో అనుమానాస్పద అంశాలు ఉన్నట్లు గుర్తిస్తాడు. అతను లోతుగా విచారణ జరిపేకొద్దీ, ఇది కేవలం వైద్య నిర్లక్ష్యానికి సంబంధించిన కేసు మాత్రమే కాదని, దాని వెనుక మరిన్ని కీలక విషయాలు దాగున్నాయని అర్థమవుతుంది. అయితే, రూడీ ఎదుర్కొంటున్నది చిన్నా చితకా ప్రత్యర్థిని కాదు. ఆసుపత్రికి అండగా ఉన్న పెద్ద లా ఫర్మ్‌లో అతని మాజీ బాస్ లియో డ్రమ్మండ్ పని చేస్తుంటాడు. మరోవైపు రూడీకి గతంలో సన్నిహితంగా ఉన్న సారా ప్లాంక్‌మోర్ కూడా ప్రత్యర్థి వర్గంలోనే ఉంటుంది.

దీంతో కోర్టులో జరిగే పోరాటం అతని వృత్తిపరమైన జీవితాన్నే కాకుండా, వ్యక్తిగత సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. సాక్ష్యాలను సేకరించడం, కీలక వ్యక్తులను ప్రశ్నించడం, ప్రత్యర్థుల వ్యూహాలను ఎదుర్కోవడం రూడీకి పెద్ద సవాలుగా మారతాయి. అసలు ఆసుపత్రి తప్పిదం వెనుక ఉన్న నిజం ఏంటి ? రూడీ తన ప్రత్యర్థుల కుట్రలను ఎలా బయటపెడతాడు ? సాక్ష్యాలు, న్యాయపరమైన చిక్కుల మధ్య తన క్లయింట్‌కు న్యాయం చేయగలుగుతాడా ? అన్నదే సిరీస్‌లో చూడాల్సిన ఉత్కంఠభరితమైన అంశం.

ఏ ఓటీటీలో చూడొచ్చు ?

Advertisement

‘ది రెయిన్‌మేకర్’ 2025లో విడుదలైన అమెరికన్ లీగల్ డ్రామా సిరీస్. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో మైలో కాలఘన్ (Milo Callaghan), లానా పారిల్లా (Lana Parrilla), జాన్ స్లాటరీ (John Slattery), మాడిసన్ ఐస్మన్ (Madison Iseman), పి.జె. బైరన్ (P.J. Byrne) కీలక పాత్రల్లో నటించారు. మైఖేల్ సీట్జ్‌మన్ (Michael Seitzman) రూపొందించిన ఈ సిరీస్‌లో జాన్ గ్రిషామ్ నవలలోని ప్రధాన కథాంశాన్ని నేటితరం ప్రేక్షకులకు అనుగుణంగా మార్చారు.

Read Also: విప్లవం వెనుక నవ్వుల రైడ్… ఓటీటీలోకి అడుగుపెట్టిన పీరియాడిక్ మాస్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’

Tags

Related News

క్రిస్మస్‌ వేళ కుప్పకూలే పరిస్థితుల్లో కుటుంబం… పెంపుడు కుక్క చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే భయ్యా

సుప్రీం కోర్ట్ జడ్జీల వరుస హత్యలు… ఒక్క రిపోర్ట్ తెచ్చే తుఫాన్… క్రైమ్ థ్రిల్లర్స్ లోనే మాస్టర్ పీస్ ఈ మూవీ

గర్భిణి చుట్టూ గత్తరలేపే పనులు… చేతబడులు, క్షుద్రపూజలతో వణికించే సైకలాజికల్ హారర్‌ థ్రిల్లర్

అనకాపల్లి గ్యాంగ్‌లో చేరిన కుర్రాడు… గురూజీకే ఎదురు తిరిగితే ? ఓటీటీలోకి వచ్చేసిన ఊరమాస్ గ్యాంగ్‌స్టర్ డ్రామా

OTT Movies : ఓటీటీ లవర్స్ కు పండగే.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సినవి సినిమాలు..!

20 ఏళ్ల క్రితం మాయమైన సోదరుడు… తవ్వేకొద్ది వెలుగులోకి దిమ్మతిరిగే నిజాలు… మైండ్ బెండింగ్ హారర్ మిస్టరీ

సోషల్ మీడియా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ది ట్రైటర్స్ నటి శ్రీదేవి!

Big Stories

Advertisement
×