E-Paper
Advertisement

జీడీమెట్ల సర్కిల్‌లో దారుణం.. పారిశుధ్య కార్మికులను వేదిస్తున్న సూపర్వైజర్!

జీడీమెట్ల సర్కిల్‌లో దారుణం.. పారిశుధ్య కార్మికులను వేదిస్తున్న సూపర్వైజర్!
Advertisement

Jeedimetla Workers: జీడిమెట్ల సర్కిల్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు సూపర్వైజర్ శివ రామ్ వేధింపులు తట్టుకోలేక మంగళవారం విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. మూడుగుళ్ల దేవాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టి తమ సమస్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులు మాట్లాడుతూ సూపర్వైజర్ వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

లక్ష రూపాయలు వసూలు..

ఇష్టానుసారంగా తిడుతూ, తమతో అమర్యాదగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన వ్యవహారశైలి వల్ల విధులు నిర్వహించలేకపోతున్నామని, తమకు ఆ సూపర్వైజర్ వద్దని స్పష్టం చేశారు. విధుల్లో చేరేందుకు లక్ష రూపాయలు తీసుకున్నారని, అనంతరం పీఎఫ్ కోసం దరఖాస్తు చేయాలని కోరితే మరో రూ.10 వేలు ఇవ్వాలని, లేకుంటే పీఎఫ్ అప్లై చేయనని చెబుతున్నారని మహిళా కార్మికులు ఆరోపించారు.

పారిశుధ్య కార్మికులు డిమాండ్..

Advertisement

తమ తర్వాత విధుల్లో చేరిన వారికి మాత్రం పీఎఫ్ దరఖాస్తు చేశారని, తమకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే వారు డబ్బులు ఇచ్చారని, మీరు ఇవ్వలేదని సమాధానం చెబుతున్నారని వాపోయారు. డబ్బులు లేకుంటే మీ బతుకులు ఇంతేనని, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండంటూ తమను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సూపర్వైజర్ వ్యవహారశైలిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేశారు.

Also Read: తెలంగాణ, ఏపీ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. దీపావళి రద్దీకి ప్రత్యేక రైళ్లు!

Tags

Related News

ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదు.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్!

2014 నుంచి దేశానికి దరిద్రం.. అమిత్ షాకు ఎంపీ చామల చురకలు!

నన్ను సీఎం అనకండి.. మైక్ బంద్ చేస్తా.. సభలో కార్యకర్తలపై బండి సంజయ్ ఫైర్!

ఆ ఒక్క తప్పుతో.. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ వల్ల తెలంగాణకు లక్ష కోట్ల నష్టం?

మురసు తుఫాన్ ఎఫెక్ట్‌.. తెలంగాణలో భారీ వర్షాలు, పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్

గిరిజన మహిళపై వేటేస్తే.. మరి మీ సంగతేంటి? శ్రీధర్ బాబు టార్గెట్‌గా ఎంపీ వంశీకృష్ణ సెటైర్లు!

సుకన్య రెడ్డి పేరిట ఫేక్ ప్రొఫైల్.. ట్రేడింగ్ యాప్‌లో కానిస్టేబుల్‌కు రూ.30 లక్షల టోకరా!

Big Stories

Advertisement
×