Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున వ్యాపారాలను కూడా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ రంగంలోని ఈయన భారీ బిజినెస్ లను ట్రెండ్ చేస్తున్నారు దీంతోపాటు ఈయన రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా సినిమాలు వ్యాపారాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న మహేష్ బాబు(Mahesh Babu) తాజాగా మరొక కొత్త బిజినెస్ ప్రారంభించారని తెలుస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ మహేష్ బాబు బిజీగా ఉన్నారు.
తాజాగా మహేష్ బాబు గేమింగ్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. మహేష్ బాబు పార్ట్నర్ గా చేరిన షార్ట్ గన్ గేమ్స్ ప్రస్తుతం టేక్ డౌన్ జెనెసిస్(Take Down Genesis) పేరుతో యాక్షన్ అడ్వెంచర్స్ గేమ్ ను అభివృద్ధి చేస్తుంది. పీసీ, కన్సోల్ ఫ్లాట్ ఫామ్ టార్గెట్ చేసుకొని ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ గేమ్ రూపొందించబోతున్నట్లు సమాచారం. అమెరికా, యూరప్, బ్రిటన్ వంటి గ్లోబల్ మార్కెట్ లోని గేమర్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గేమ్ మెయిన్ ఉద్దేశం ఏంటి , దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కాబోతున్నాయి.
ఈ గేమింగ్ బిజినెస్ లో భాగంగా మహేష్ బాబు ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టారనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. మహేష్ బాబు ఇప్పటికే జిఎంబి ఎంటర్టైన్మెంట్ ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టారు. ఈ మల్టీప్లెక్స్ థియేటర్ లు కేవలం హైదరాబాదులో మాత్రమే కాకుండా బెంగళూరు వంటి మెట్రో సిటీలకు విస్తరించింది. అలాగే ఏఎన్ రెస్టారెంట్స్ కూడా ప్రారంభించారు.
ఈ రెస్టారెంట్ వ్యవహారాలన్నింటిని కూడా నమ్రత చూసుకుంటున్నారు ఏషియన్ వారితో కలిసి నమ్రత ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు . అలాగే ఫిట్ డే వంటి వ్యాపారాలలో కూడా మహేష్ బాబు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు ఇలా వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ భాగస్వామ్యం అయినటువంటి ఈయన ఇప్పుడు గేమింగ్ బిజినెస్ లోకి ప్రవేశించడం విశేషం. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ తరహా బిజినెస్ లో భాగస్వామ్యం అయినటువంటి ఏకైక తొలి హీరో మహేష్ బాబు అని తెలుస్తుంది. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే వారణాసి సినిమా(Varanasi Movie) షూటింగ్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
Also Read: రోహిత్ బిగ్ బాస్ రీ ఎంట్రీ.. వీడియో వైరల్.. అసలు నిజం ఏంటంటే?