Deepika Rangaraju.. వసపిట్టలా వాగుతూ తన వాక్చాతుర్యంతో అందరి మనసులు దోచుకున్న బ్రహ్మముడి సీరియల్ కావ్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమె అసలు పేరు దీపిక రంగరాజు(Deepika Rangaraju). తన పేరు కంటే సీరియల్ పేరుతోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 లోకి గెస్ట్ గా కూడా వచ్చి అందరిని నవ్వించింది. ఇకపోతే బ్రహ్మముడి సీరియల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ (Manas)కి జోడీగా దీపిక రంగరాజు నటిస్తోంది. దీపికాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అని చెప్పాలి. వంటలక్క తర్వాత అంతటి పాపులారిటీ అందుకున్న బ్యూటీ ఈమె కావడం గమనార్హం.
భారీ పాపులారిటీ అందుకున్న దీపిక..
ఇకపోతే దీపిక మన తెలుగు అమ్మాయి కాకపోయినా.. బుల్లితెర ఆడియన్స్ మాత్రం ఈమెను బాగా ఆదరిస్తున్నారు. అలా సీరియల్ తో మంచి పేరు దక్కించుకున్న దీపిక అప్పుడప్పుడు పలు షోలకు, ఈవెంట్లకు వచ్చి, తన అల్లరితో , కామెడీతో, వచ్చీరాని తెలుగుతో అందరిని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇక కొన్ని కొన్ని సార్లు డబుల్ మీనింగ్ డైలాగులతో తలనొప్పి తెప్పించిన సందర్భాలు కూడా బోలెడు ఉన్నాయి.
పెళ్లి చేసుకోబోతున్న దీపిక..
ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా రంగరాజు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందని సమాచారం. ఒక సీరియల్ హీరోతో పీకల్లోతు వరకు ప్రేమలో ఉందట. ఇక తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వారు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు? అనే విషయాన్ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం దీపికా త్వరలోనే ఏడడుగులు వేయబోతోందని చెప్పవచ్చు. ఇక ఇందులో నిజానిజాలు మాత్రం తెలియాల్సి ఉంది.
దీపిక రంగరాజు విషయానికి వస్తే..
తమిళనాడుకు చెందిన దీపిక రంగరాజు.. మమందూర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. కాలేజీలో చదువుకునే సమయంలోనే కల్చరల్ ఈవెంట్స్ లో ఎక్కువగా పాల్గొంటూ అందరిని ఆకట్టుకునేది. ఇక చదువు పూర్తి చేసిన తర్వాత ఒక తమిళ ఛానల్లో న్యూస్ ప్రెసెంటర్ గా జీవితాన్ని ప్రారంభించిన దీపిక.. ఆ తర్వాత చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్ ద్వారా కెరియర్ను మొదలుపెట్టింది. ఇక ఈ సీరియల్ తో తన కెరీర్ను మలుపు తిప్పుకుంది. అందులో ఈమె నటనకు తమిళ మహిళా లోకం ఫిదా అయిపోయింది. ఆ తర్వాత స్టార్ మా లో నిర్మించిన బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకొని, ఇప్పుడు తెలుగులో భారీ పాపులారిటీ అందుకుంది. ఇందులో వయసుకు మించిన క్యారెక్టర్ చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తోంది.