Upasana: మెగా కోడలు ఉపాసన(Upasana) ఎప్పుడు కూడా నలుగురికి సహాయం చేసే ఆలోచనలోనే ఉంటారు. అందులో భాగంగానే వైద్యం అవసరమైన వారికి ఉచితంగా సేవలు అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఈమె పేరుకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి.. వేలకోట్ల ఆస్తులకు అధిపతి..కానీ ఎప్పుడూ చాలా సింపుల్గా తన పని తాను చేసుకుంటూ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. అటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉన్నప్పటికీ, ఎక్కువగా కెరియర్ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా అయోధ్యలో శ్రీరాముడి సేవలో మునిగిపోయారు ఉపాసన.
అయోధ్యలో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్..
ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉన్న ఉపాసన తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకుంది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపోతే తాజాగా అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ను అయోధ్యలో ప్రారంభించింది ఉపాసన. ఈ కేర్ సెంటర్ ద్వారా అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు మెగా కోడలు స్పష్టం చేసింది. తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈమె అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది.
ఉచిత వైద్య సేవలు అందించడానికి పూనుకున్న ఉపాసన..
ఇకపోతే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “మా తాతగారు సనాతన ధర్మం గురించి ఎంతో నేర్పించారు. అయోధ్యలో సేవ చేసే భాగ్యం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాము. తాతయ్య మాటల స్ఫూర్తితోనే మేము అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని పూనుకున్నాము.ఇప్పటికే కేదార్నాథ్, శ్రీశైలం, తిరుపతి, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలలో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాము. ఇప్పుడు శ్రీ రామ జన్మభూమిలో సేవలు చేయడం నిజంగా అదృష్టం.. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది ఉపాసన. ఇక ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉండగా ఆమె గొప్పతనానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.
రామ్ చరణ్ సినిమాలు..
మరోవైపు రాంచరణ్ విషయానికి వస్తే.. ఆయన ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar)దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara advani)మరోసారి రాంచరణ్ తో జతకట్టనుంది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘వినయ విధేయ రామ’ సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఈసారి మళ్లీ వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా మంచి సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబు సనా(Bucchibabu Sana)దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా అవకాశం అందుకుంది.
Thatha taught us that true Sanatan Dharma for us lies in healing with dignity & empathy.
Inspired by his words we opened a free Emergency Care Centre at the Ram Mandir in Ayodhya.
After successfully serving in Tirumala, Srisailam, Kedarnath, and Badrinath, we are blessed to… pic.twitter.com/YcCVf0ZM61— Upasana Konidela (@upasanakonidela) December 15, 2024