Brahmamudi Actress : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి సీరియల్లలో స్టార్ మా లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్లో మెయిన్ లీడ్ లో కావ్య పాత్రలో నటించి ప్రేక్షకుల మనసును దోచుకుంది దీపికా రంగరాజన్. ప్రస్తుతం పలు టీవీ, ఓటీటీ షోలు చేస్తుంది దీపిక. తాజాగా ఆహాలోని కాకమ్మ కథలు సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌కి దీపిక వచ్చింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకి కాంట్రవర్శీ ఆన్సర్లు ఇచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ రష్మిక మందన గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయ్యింది. అసలేం అన్నదో ఒకసారి తెలుసుకుందాం..
కాకమ్మ కథలు సీజన్ 2 లో దీపికా..
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోగ్రాంలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందులో ఒకటి కాకమ్మ కథలు.. మొదటి సీజన్ బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం రెండో సీజన్ ప్రసారం అవుతుంది. ఈ సీజన్ కు గెస్టుగా బ్రహ్మముడి కావ్య వచ్చింది. ఫేమస్ చెఫ్ సంజయ్ తుమ్మతో పాటు నటి దీపిక రంగరాజు వచ్చింది. బ్రహ్మముడి సీరియల్‌లో తెలుగులో పాపులర్ అయిన దీపిక.. ఆహాలో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే, డ్యాన్స్ ఐకాన్ 2షోలు చేస్తుంది. అయితే కాకమ్మ కథలు టాక్ షోకి వీళ్లిద్దర్నీ ఇలా తీసుకురావడం గమనార్హం.. ఏదైనా షో ప్లాన్ చేస్తున్నపుడు అన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఎదో ప్లాన్ లేకుండా చెయ్యరుగా.. వీరిద్దరు వచ్చిన ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Also Read :ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా.. రెండు ఒకేసారి ఎంట్రీ..!
రష్మిక పై సెటైర్లు..
ఎప్పుడూ ఈ షోలో సెలబ్రిటీలకు తేజు చెమటలు పట్టిస్తుంది. కానీ ఈసారి మాత్రం దీపికా దెబ్బకు తేజు భయపడటం ప్రోమోలో చూడొచ్చు. రష్మిక మందన్నను టార్గెట్ చేసిందని తెలుస్తుంది. హీరోయిన్ యాక్టింగ్ నా కంటే చెత్తగా ఉంటుందని అనుకుంటున్నావు అని తెలుసు అడుగుతుంది. దీపిక వెంటనే రష్మిక మందన్నా అని సమాధానం చెబుతుంది. ఆమె నా అంత కాకపోయినా కూడా కొంచెం బెటర్ గా చేస్తే బాగుంటుందని కామెంట్ చేస్తుంది. ఆ తర్వాత నీ క్రష్ ఎవరిని అడగగా.. విజయ్ దేవరకొండ అని ఆన్సర్ చెప్తుంది.రష్మిక మీద రివెంజ్ తీర్చుకుందామని.. అంటూ కిర్రాక్ ఆన్సర్ ఇచ్చింది దీపిక. టాలీవుడ్‌లో ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారని అడిగితే నాగార్జున అంటుంది. మొత్తానికి దీపికా సమాధానాలకు తేజు షాక్ అవుతుంది. ప్రోమో అయితే వైరల్ అవుతుంది మరీ ఎపిసోడ్లో ఎంత హంగామా చేస్తుందో తెలియాలంటే ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
రష్మిక మందన్న సినిమాల విషయానికోస్తే.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తుంది. పుష్ప 2 బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఛావా మూవీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ రీసెంట్ గా వచ్చిన సికిందర్ మూవీ బోల్తా కొట్టింది.